Home » Vempalli niranjan reddy » మౌనం

    రెండవ గదిలో ఏవో పిండి  బస్తాలు  వేసి వున్నాయి.

    ఏ మాత్రం  శుభ్రంలేని ఇల్లు  అది.

    నాల్గవ  గదిలోకి  వెళ్ళారు. అది చాలా విశాలంగా  వుంది.

    ఆ గది  మధ్యలో  పైకప్పు  దగ్గర  ఖాళీ  వుంది. దానికి అద్దం  బిగించి  వుంది. అందువల్ల  వెలుతురు  బాగా వస్తోంది  లోపలికి.

    ఆ గదిలో  ఒకవైపు  నేలమీద  నాలుగు  పరుపులు  పరిచి  వున్నాయి. దాని మీద పడుకొని  వున్నాడో వ్యక్తి  నల్లగా, లావుగా  వున్నాడతను.

    నల్లని లుంగీ  మీద ఎరుపు  రంగు డిజైన్  వున్న లుంగీ  ధరించివున్నాడు. ఛాతీమీద ఏ ఆచ్చాదనా లేదు.

    నూరుల్ ని చూడగానే లేచి  కూర్చున్నాడు అతను.

    అతనే  సెబాస్టియన్  అని అర్ధమయింది  నూరుల్ కి.

    "కోటగిరి  బాలయ్య....ఇంతకుముందే  ఫోన్ చేశాడు. నువ్వు   వస్తున్నావని చెప్పాడు" అన్నాడు సెబాస్టియన్.

    ఏమీ మాట్లాడలేదు  నూరుల్.

    "పద....చూపిస్తాను" అంటూ  లేచి ఎడమవైపున  వున్న ఒక తలుపు  దగ్గరకు  నడిచాడు.

    ఆ తలుపు  దగ్గర  నిలబడి  వున్న ఓ వ్యక్తి ఆ డోరు  తెరిచాడు.

    అది మరో విశాలమైన గది.

    ఆ గది  గోడలకు  అరలున్నాయి. వాటిలో కట్టలుగా  కొన్ని  నాటు తుపాకులు, కత్తులు, కైజర్లు  లాంటి  మారణాయుధాలు వున్నాయి. గదిలో క్రింద  సుమారు నలభై  యాభై  వరకు చిన్న చిన్న డబ్బాలు వున్నాయి. అన్నీ ఒకే సైజులో వున్న డబ్బాలు.

    "ఈ డబ్బాలు  మీ కోసమే రెడీ చేసా! కోటగిరి  బాలయ్యతో  చెప్పు. ఎప్పుడు  కావాలంటే  అప్పుడు  తీసుకెళ్ళమను" అన్నాడు సెబాస్టియన్.

    ఆ డబ్బాలను  సమీపించాడు  నూరుల్.

    డబ్బా  లోపలివైపు అడుగునా, స్పాంజిముక్కలు అతికించి  వున్నాయి డబ్బాలో  సగానికి పైగా  నీళ్ళున్నాయి. ఆ నీళ్ళలో  వున్నాయి  గుండ్రని  బంతుల్లాంటి  వస్తువులు. 

    అవి నాటుబాంబులు, నాటుబాంబుల్లో  ఒక రకమైన  పద్ధతిలో  చేసినవి. ఆ బాంబులకి  ఏ మాత్రం  ఒత్తిడి  తగిలినా  పేలిపోతాయి. అందుకే  ఆ డబ్బాల్లో  స్పాంజిలైనింగ్  వుంటుంది. అంతేకాదు! వాటిలో  భాస్వరం వుంటుంది. అది గాలి తగిలిన  కొద్ది క్షణాలకి  మండిపోతుంది. కాబట్టి  నీటిలోనే వుంచుతారు.

    ఆ నాటుబాంబు  విసిరినప్పుడు, సాధారణంగా  ఒత్తిడికి పేలిపోతుంది. ఒకవేళ  అలా పేలకపోయినా, భాస్వరం  వల్ల  మండిపోయి అయినా  పేలుతుంది. ఆ బాంబుల తయారీలో  సెబాస్టియన్ స్పెషలిస్ట్.

    బయట  నుంచి  చూసిన  వాళ్ళకు  ఎవరికీ ఆ ఇంట్లో  అన్ని నాటుబాంబులు, తుపాకులు, కత్తులు వుంటాయని తెలియదు.

    ఒక్కొక్క నాటుబాంబుని ముప్పై రూపాయల  నుంచి  అమ్ముతాడు. టైంబాంబ్  అయితే దాని పవర్ని  బట్టి  రేటు  చెబుతాడు. వేలలో వుంటుంది.

    వాటిని  చూశాక  తృప్తిగా  తలాడించాడు  నూరుల్.

    "నేను వెళ్ళి  కోటగిరి  బాలయ్యగారితో  చెప్పి  రేపు  రాత్రి వచ్చి యివి  తీసుకువెళతాను" చెప్పాడు  సెబాస్టియన్ తో.

    అలాగే  అన్నట్లుగా  తల వూపాడు  సెబాస్టియన్.

    "మరి బయటకు  తీసుకువెళ్ళేటప్పుడు  ఎవరైనా  చూస్తే?" అనుమానం  వ్యక్తం  చేశాడు  నూరుల్.

    "భయపడకు....ఇవి సీల్ చేస్తాం. వీటికి  కొబ్బరినూనె  లేబుల్స్ అంటిస్తాము. డబ్బాలకి  అక్కడక్కడ  నూనె కూడా రాస్తాం. ఎవరికీ  అనుమానం రాదు. ఎవరైనా  సరే  నూనె డబ్బాలే  అనుకుంటారు" ధైర్యం చెప్పాడు సెబాస్టియన్.

    "నేను వెళతా!" అంటూ  ఒక అడుగు ముందుకు వేసి  ఏదో గుర్హ్తుకు వచ్చిన వాడిలా  వెనక్కి తిరిగాడు  నూరుల్.

    ఏమిటన్నట్టు  చూశాడు  సెబాస్టియన్.

    "కోటగిరి  బాలయ్యగారు  నీకో ముఖ్య విషయం  చెప్పమన్నారు" అన్నాడు.

    "ఏమిటి?" ఒకింత  ఆసక్తిగా  అన్నాడు.  

    "సంజు  అనే ఆమె ప్రోగ్రాం వైజాగ్ లో జరగటం లేదట. కాన్సిల్ అయిందట" చెప్పి  వెళ్ళిపోయాడు నూరుల్.

    అదిరిపడ్డాడు  సెబాస్టియన్.

    పక్క గదిలో దాచిన  నాటు బాంబులన్నీ ఒకేసారి తన కాళ్ళ క్రింద  పేలినట్లు అనిపించింది అతనికి.

    అంతవరకు  మామూలుగా  ఉన్న  అతని కళ్ళలో  రక్తం  వర్ణపు జీరలు  తొంగి చూశాయి.

    అసహనంతో నిండిన  ఆవేశంతో  అతని నరాలు, కండరాలు పొంగాయి.


                   *    *    *    *    *

    మనిషి  జీవితంలో  ఎంతోమంది  తారసపడుతుంటారు.

    అందులో  కొందరిని  యిష్టపడుతుంటారు.

    మరికొందరంటే  అయిష్టత  వ్యక్తం చేస్తారు.

    ఈ ఇష్టత, అయిష్టత  అనేవి ఎదుటి వ్యక్తుల  రూపాన్నిబట్టి, ప్రవర్తననిబట్టి, మాటతీరునుబట్టి ఇలా  రకరకాల కారణాలు  వల్ల కలుగుతాయి.

    కౌశిక్ ఎవరో తెలియదు. ఏ పరిచయం లేదు. ఒక సందర్భంలో ప్రాణం కాపాడాడు. అంతే! తర్వాత తన ఇంటికి తీసుకువచ్చాడు.

    అప్పటి నుండి అతని ప్రభావం  ఆమె మీద బలంగా  వుంది.

    అతని మాటను కాదనలేకపోతోంది.

    వైజాగ్ లో తన ప్రోగ్రాం  యివ్వటం....జీవితవాంఛ....కోరిక....ఆకాంక్ష....ఇండియా రావటానికి కారణం కూడా అదే.

    కానీ....అతను వద్దు.... అని చెప్పగానే 'నో' అని అనలేక పోతోంది.

    బాత్ టబ్ లో స్నానం  చేస్తున్న  ఆమె ఆలోచనలు  కొంతసేపు  కౌశిక్ చుట్టూ, మరికొంతసేపు  కౌశిక్ చెల్లెలు ఫోటో చుట్టూ  పరిభ్రమిస్తున్నాయి.

    పాల నురుగులాంటి  నున్నని ఆమె శరీర  వర్ణం, సబ్బు  రంగులో  మరింత  మెరుస్తోంది.

    స్లిమ్ గా ఉన్న ఆమె శరీరం  ఆ నీటిలో సున్నితంగా కదులుతోంది. 

    టబ్ లోంచి  బయటికి  వచ్చి  షవరు  క్రింద నిలబడింది  ఆమె.

    వెచ్చని  నీరు ఆమె కురుల  మీద పడి  శరీరాన్ని  అంతటినీ తాకుతూ క్రిందికి  జారిపోతున్నాయి. ఆ వేడినీటి నుండి  వచ్చే  ఆవిరితో  ఆ గది నిండిపోయింది.

    ఆ సమయంలో  ఆమె పొగమంచులో  నిలబడిందా  అన్నట్లు  వుంది.

    దాదాపు  ఐదు నిమిషాలపాటు  అలాగే  షవరు  క్రింద  నిలబడిందామె.

    స్నానం  పూర్తి అయింది.

    టర్కిష్  టవల్ తో శరీరాన్ని  మృదువుగా  తుడుచుకుంది.

    ఆమెకు  ఎడమ వైపు  రెండున్నర  అడుగుల  వెడల్పు ,ఆరు అడుగుల పొడవు ఉన్న  నిలువుటద్దం  ఒకటి వుంది.
    అందులో  ఆమె తనను ఒకసారి  చూసుకుందామని వెనక్కి తిరిగింది.

    షవరు  నుండి వచ్చిన వెచ్చని ఆవిరి అద్దం మీద పొరలాగా  ఏర్పడి ఆమె ప్రతిబింబం  అందులో  కనపడలేదు.

    మిర్రర్ని  సమీపించి  కుడిచేతి  చూపుడు  వేలితో  దాని మీద గీతలాగా  గీసింది. ఆ గీత  పడిన  ప్రదేశంలో అద్దం  స్పష్టంగా కనిపించింది.

    ఎందుకో  ఆవిరి  పొరతో  ఆడుకోవాలనిపించింది.

    దాని మీద సంజన  అన్న అక్షరాలు  రాసింది.

    క్షణకాలంపాటు  ఆ అక్షరాల వైపు  చూసి  డ్రసెస్ స్టాండ్ వైపు  నడిచి  గ్రీన్ కలరు  చుడీదార్ అందుకుని  ధరించింది.

    బాత్ రూమ్ లోంచి  తన రూమ్ లోకి వచ్చిన  ఆమెకు పనిమనిషి  కనపడింది.

    ఏమిటన్నట్టు  చూసింది  ఆమె వైపు.

    "బాబుగారు తమర్ని  రమ్మంటున్నారు" చెప్పింది.

    "ఎక్కడున్నారు?"

    "ఆఫీసు   గదిలోనండి."

    "వస్తున్నానని  చెప్పు."

    ఆమె తల ఊపి వెళ్ళిపోయింది. 

    ఇంకా తడి ఆరని కురులను బ్రష్ తో పైపైన దువ్వుకొని  అక్కడి  నుండి  కదిలింది.

    కౌశిక్ ఆఫీస్ రూమ్ ని  సమీపించిన  ఆమె లోపల  ఎవరివో మాటలు వినపడటంతో ఒక్కక్షణం  తటపటాయించి  అక్కడే  ఆగింది.

    "లోపలికి రండి" ఆమె ఆగిపోవటం  చూసి  అన్నాడు  కౌశిక్.

    గదిలోకి  ప్రవేశించిన  ఆమెకు కౌశిక్ తోపాటు  మరో ఇద్దరు  వ్యక్తులు  కనిపించారు. ఆ ఇద్దరిలోనూ  బట్టతల  వ్యక్తిని వెంటనే  పోల్చుకోగలిగింది ఆమె.

    ఆ వ్యక్తిని చూస్తూనే  "హలో" అని నవ్వింది  పలకరింపుగా.

    ఆ వ్యక్తి  పెదవుల మీద ఏ విధమైన నవ్వు  లేదు.

    అతనిను పలకరింపుగా  నవ్వలేకపోవటానికి గల కారణం  తను అర్ధం చేసుకోగలదు. కారణం....అతనే వైజాగ్ లో ప్రోగ్రాం  ఆర్గనైజ్ చేస్తున్నది.

    ఆ ముందురోజే  వాళ్ళకి ఫోను  చేసి ప్రోగ్రాం  వాయిదాపడినట్లుగా చెప్పాడు కౌశిక్.

    "ఎందుకు  వాయిదా  వేస్తున్నారు! ఏం జరిగింది?" అదీ ఇదీ అంటూ ఆతృతగా ప్రశ్నలు  కరిపిస్తున్న  ఆ వ్యక్తులతో  "ఒకసారి  హైదరాబాద్ రండి. విషయం  వివరంగా  చెబుతాను" అన్నాడు కౌశిక్.

    ఆదరాబాదగా  పరిగెత్తుకొచ్చారు  వాళ్ళు.

    అక్కడున్న  చైర్లో  కూర్చుంది  ఆమె.

    రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత గొంతు  సవరించుకున్నాడు కౌశిక్.

    "ఉయార్ వెరీ సారీ సుబ్బరాజుగారూ! తప్పనిసరి  పరిస్థితిలో కార్యక్రమం పోస్ట్ పోన్ చేయాల్సి  వస్తోంది" సన్నగా, నూనుగులా  పెరిగి  వున్న గడ్డం  తడుముకుంటూ  అన్నాడు.

    "అదేటండి! ప్రోగ్రాంకు అన్నీ ఎరేంజ్  చేసినాక  ఇప్పుది మాట అంటే  ఎలాగేటి?" సుబ్బరాజు మాటలో  ఖచ్చితమైన  విశాఖపట్నం  యాస తొంగి చూస్తోంది.

    "అందుకే గదా! సారీ అంటున్నాము. తప్పనిసరి పరిస్థితుల్లో  ఇలా  చేయాల్సి వస్తోంది. మరో వారం తర్వాత  ప్రోగ్రాం  తప్పక చేద్దాం."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra