Home » Yerramsetti sai » 420 Mega City


                          సారా జహాసె అచ్ఛ!
    సారా ఉద్యమం ఊపు చూసేసరికి మిగతా అందరిలాగానే మా కాలనీలో కూడా ఎక్కడలేని చైతన్యం వచ్చింది.
    ముఖ్యంగా మా కాలనీ ఆడాళ్ళు మరీ రెచ్చిపోయారు. మా కాలనీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గోపాల్రావ్ ఆ సందర్భంగా అనేకమంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు తీసుకుని ఏదైనా పేపరుకు పంపాలని నిశ్చయించుకున్నాడు.
    ఆ ఇంటర్వ్యూలు మేమే తీసుకుంటామని మా కాలనీలోని కొంతమంది వీర వనితలు ముందుకొచ్చారు. అందరం కలసి ముందు హైద్రాబాద్ లో షూటింగ్ కొచ్చిన ఓ సినీ నటుడిని గెస్ట్ హౌస్ లో కలుసుకున్నాం.
    మమ్మల్ని చూసి లేచి నిలబడి ప్రతి నమస్కారం చేయబోయి తూలి కిందపడిపోయాడతను. మేమంతా అతనిని లేపి కూర్చోబెట్టాం!
    "సార్! ఈ సారా ఉద్యమం మీద మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి. "సారా వల్ల ఎన్నో కుటుంబాలు నాషనమవుతున్నాయ్! నేను షూటింగ్ లకెళ్ళినప్పుడు ఎంతో మంది ఆడాళ్ళు పాపం ఎన్నో బాధలు పడషం చూశాను. ఏడుపోచ్చేసింది నాకు. నిజంగానే ఏడుపొచ్చేషింది" అంటూ భోరున ఏడ్చేయటం ప్రారంభించాడతను.
    మాకు ఏం చేయాలో అర్థంకావటం లేదు.
    "ఊరుకోండి సార్! ఏడవకండి! ఏడ్చి చేసేదేముంది?" అన్నాడు రంగారెడ్డి ఓదారుస్తూ.
    "పాపం ఎంత జాలిగుండె గల మనిషో" అంది పార్వతీదేవి ఆ నటుడిని గౌరవంగా చూస్తూ.
    "ఇప్పుషే కాదంషీ! షిన్నప్పషినుంషీ నాది జాలిగుంషే! ఒక నిముషం! ఇప్పుషే వష్తా" అంటూ పక్కనున్న డ్రస్సింగ్ రూమ్ లోకెళ్ళి మందు బాటిల్ ఎత్తి తాగేసి బయటికొచ్చాడు.
    "అంటే 'సారా' ను బాన్ చేయాలని మీ అభిప్రాయమా?" అడిగాడు చంద్రకాంత్.
    "అవును! షారాని బాన్ష్ షేయాల్సిందే! లేకపోషే ఎన్నో కుషుంబాలు నాషనం అయిపోషున్నాయ్."
    అతని అసిస్టెంట్ ఫోన్ తెచ్చిచ్చాడు.
    "సార్! మీ భార్యగారు ఫోనులో వున్నారు"
    "హలో! ఛఛ! నీ మీద ఒష్షే! నేను తాగషం లేదు! ప్రామిష్. బాంక్ లో డబ్బయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? ఏంషీ! నేను ఆరు నెలల నుంషీ డబ్బివ్వడం లేదా? షరే ఇప్పుడే రెండొందలు పంపిష్తాను. తీషుకుని నేలంతా జాగ్రష్షగావాడు"
    ఫోన్ పెట్టేసి జేబులోనుంచి నోట్లకట్ట తీసి అసిస్టెంట్ కిచ్చాడు.
    "షూడు రెండొందలు ఇంటికి పంపి మిగతా రెండువేల మూడొందలు పెట్టి ఫారిన్ విస్కీ తీసుకురా" చెప్పాడతను.
    మా కాలనీ ఆడాళ్ళు మొఖమొఖాలు చూసుకున్నారు.
    "ఈ షారా వల్ల మన షమాజానికి హాని జరుగుతోంది-ఎంత హాని జరుగుతోందంషే -ఎంత హాని జరుగుతోందంషే-" అని దభేల్ మని పడిపోయాడు నేలమీద.
    రాజేశ్వరీ, సావిత్రమ్మ, పార్వతీదేవి కెవ్వున కేకేసి బయటకు పరుగెత్తారు.
    అక్కడి నుంచి అందరం మంత్రిగారింటికి చేరుకున్నాం.
    మేమంతా ఫలానా పత్రిక తాలూకు అని తెలిసేసరికి అతను మాకు చాలా గౌరవం ఇచ్చాడు. "ఒరేయ్! ఆడాళ్ళకు కూల్ డ్రింక్సూ, మగాళ్ళకు వాట్-69 తీసుకురా" అని పురమాయించాడు బాయ్ కి. మాకు వాట్-69 అనగానే నోరూరింది గానీ ఆడాళ్ళు పక్కనే ఉండటం వల్ల "అబ్బే వద్దండీ వద్దు. మాకస్సలు అలవాటు లేదు" అన్నాం గాబరాగా.
    "ఈ సారా వ్యతిరేఖ ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్" అడిగాడు గోపాల్రావ్. "సారా నిజంగా చాలా భయంకరమయిన అలవాటు. మాకు ఓట్లు వేసే ఎన్నో కుటుంబాలు ఈ దురలవాట్ల వల్ల నాశనమవటం నేను చూశాను. ఆ కుటుంబాలను చూసినప్పుడల్లా నేనెంత కుమిలిపోతానో మీకు తెలీదు" అనేసి కన్నీళ్ళు తుడుచుకున్నాడతను. అప్పుడే వాళ్ళ మనిషి వచ్చాడు హడావుడిగా.


    "సార్! దొంగతనంగా మన డిపోకి మొలాసిస్ తెస్తున్న లారీని ఎక్సయిజ్ వాళ్ళు పట్టుకున్నారంట రంగా ఫోన్ చేశాడు."
    రాజకీయ నాయకుడు మండిపడుతూ ఫోన్ అందుకున్నాడు.
    "ఎవడ్రా ఆడు నా లారీని పట్టుకుంది. బతకాలని వుందా లేదా? ముందా ఇన్ స్పెక్టర్ ని బదిలీ చేసెయ్. నువ్వేనా లారీని డిపోకి తీసుకురా తెల్సిందా?" అనేసి ఫోన్ పెట్టేశాడు.
    "సారాని బాన్ చేయాలని ఉద్యమకారులంటున్నారు. దీని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?"

"నిజమే పాపం! బాన్ చేయాల్సిందే. ఆ ఉద్యమం పదికాలాలపాటు కొనసాగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ బాన్ చేసినా దొంగ సారా ఎలాగూ వుంటుంది. కనుక బాన్ చేసినా చేయకపోయినా ఒకటే! అయినాగానీ అన్నీ ఆలోచించి బాన్ చేయాలి. ఎందుకంటే సారా వ్యాపారం మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయ్. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు నిలపాలన్నా, పడగొట్టాలన్నా సారాయే చేస్తోంది. బలహీనవర్గాలు చేపట్టిన ఈ వృత్తిని నిర్మూలించడం వల్ల ఆ వర్గాలకు బ్రతుకుతెరువుండదు."
    "సార్! ఆ సారాలో మందు కలపాలి" అతను తన టేబుల్ సొరుగులో నుంచి ఓ పాకెట్ తీసిచ్చాడు. "ఇందులో సగమే కలపమను. ఎక్కువ కలుపుతే మళ్ళీ జనం ఉస్మానియాలో జాయినయ్ ఛస్తారు. దాంతో పేపరోళ్ళు మనల్ని రుద్దేస్తారు."
    అక్కడి నుంచి మేము ఓ రచయిత ఇంటికి వెళ్ళాం! ఆయన భార్య బయటకొచ్చింది.
    "రచయిత గారిని ఇంటర్ వ్యూ చెయ్యాలండీ-"
    "ఆయన లేరు..."
    "ఎక్కడికెళ్ళారండీ?"
    "హాస్పటల్ కి..."
    "ఎప్పుడొస్తారండీ?
    "ఇంకెక్కడొస్తాడు? తాగి తాగి ఛస్తాడు! ఇందాకే ఎవరోవచ్చి చెప్పారు. సినిమా ప్రొడ్యూసర్ తో చేరి తాగి తాగి రోడ్ మీద పడితే ఎవడో తీసుకెళ్ళి చేర్పించాడంట! ఆ సంగతి చెప్పడానికొస్తే వాడిని చీపురుపట్టుక్కొట్టాను" అంది చీపురు పుల్లలన్నీ జమ చేస్తూ. మేము బెదిరి బయటికొచ్చాము. ఓ ప్రభుత్వాధికారిని కలుసుకోడానికి ఆఫీసుకెళ్ళాం.
    "ఆయన కంట్రాక్టర్ తోపాటు బార్ కెళ్ళాడు" చెప్పాడు క్లర్క్. ఆ బార్ కి చేరుకుని సారా ఉద్యమం గురించి అడిగాము.
    "సారా ఉద్యమం కొనసాగాల్సిందే! ఎంతోమంది సారాకు బానిసలయి కుటుంబాలను బాధలు పెట్టటమే కాకుండా... వాళ్ళు దానిక్కావలసిన డబ్బు కోసం ఎన్నో అవినీతి పనులు చేస్తున్నారు..."
    కాంట్రాక్టర్ అతని ఓ నోట్లకట్ట పెట్టాడు. "బిల్ పాస్ చేసేస్తారు కద్సార్?"
    "సెంట్ పర్సంట్ - అసలు నీకా అనుమానం ఎందుకొచ్చింది?"
    "ఆ! ఇంకేం కావాలో అడగండీ! సారా నా ఫేవరేట్ సబ్జెక్ట్! ఎంతసేపు కావాలంటే అంతసేపు దానివల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడగలను..."
    మర్నాడు పేపర్లో సారా వ్యతిరేకోద్యమాన్ని బలపరుస్తున్నవాళ్ళ ఇంటర్ వ్యూలన్నీ వేసేశాం. అప్పటిగ్గాని మాకు మానసికంగా సంతృప్తిలేకపోయింది. మేమూ ఆ ఉద్యమాన్ని బలపరచామన్న ఫీలింగ్! (సారా ఉద్యమ సమయంలో)

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra