"అర్చనగారి పెళ్ళి నిశ్చయం అయిందటగా."
"ఎవరు చెప్పారు?"
"చిరంజీవినీ........" అమ్తూచేప్పబోయి అనుమానం వచ్చి అగేడు. క్షణంలో వెయ్యవవంతు అయోమయంలో సర్వోత్తమరావు తల గోక్కున్నాడు. అతడికి ఇది కలోనిజమో అర్ధంకాలేదు. తనకి తెలియకుండా తన మేనకోడలిపెళ్ళి ఎలా జరగబోతూంది.
సర్వోత్తమరావు ఆలోచనలో పడటం చూసి ఇన్ స్పెక్టర్ "వెళ్ళొస్తాను సార్" అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసేడు. ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చి, అయన "పెళ్ళిసరే, కానీ ఎవరితో?" అని అడిగేడు . కానీ ఆ మాటలు మోటారు శబ్దంతో కలసిపోయినయ్ ఇన్ స్పెక్టరేళ్ళిపోయాడు.
* * * *
"గోరూగారూ ఓ గుడ్ న్యూస్ " అంటూ చిరంజీవి హుషారుగా లోపలికి ప్రవేశించేడు. చదువుతూన్న బౌండుపుస్తకం పక్కనపేట్టి, సర్వోత్తమరావు తలెత్తి చూసేడు.
"మీకో మంచి విషయం చెప్పాలి సార్" హాడావిడిగా అన్నాడు.
అయన తాపీగా "నిన్ను తల వాచేతాతతో చివాట్లు పేడ్దామనుకుంటున్నాను. నువ్వు విషయం చెప్పాక చెయ్యనా? ముందే పెట్టానా" అని అడిగాడు. చిరంజీవి గతుక్కుమని, అంతలోనె తేరుకొని సిన్సియర్ గా "నన్ను ముందు చెప్పనివ్వండి. దానివల్ల మీ చివాట్లు డెన్సిటీతగ్గొచ్చు " అన్నాడు.
"అయితే చెప్పు"
"శవాన్ని అయిదొందలకిమాట్లాడేను. దారా సింగ్ అని ఓ రౌడీ వున్నాడు. అయన ఈ క్షణంనుంచీ మనకి కావాల్సిన శవం గురించి వెతుకుతున్నాడు. బహూశా పదిహేనురోజుల్లో దొరకవచ్చు. మన ప్లాను అమలుచేసే రోజు దగ్గరపడింది. ఇదే మంచి న్యూస్. ఇక మీ చివాట్లు ప్రారంబించండి" గడగడా చెప్పేసి, తల కొద్దిగా వంచి వాయుటంకోసం సిద్దంగా కూర్చొన్నాడు.
అయన గంభీరంగా , "అర్చన ఫియాన్సీ ఎవరు? మా ఇంట్లో పప్పున్నము అరేంజి చేస్తున్నారట ఆదేవరు?" అని అడిగాడు. చిరంజీవి తల అలాగే వంచుకుని నమ్రతగా, "మొదటిదినేను, రెండోది మీరు." అని, ఆ మాటల్తో వున్న ధైర్యం దిగజారిపోగా _అయన చేతులు పట్టుకుని "పాతడైలాగు అంటున్నానని అనుకోకపోతే గురూగారూ. ఇవి చేతులు కావనుకోండి. అర్చనగారికివన్నీ తెలీదు. నేనే నోటికొచ్చినట్టూ ఆ ఇన్ స్పెక్టర్ దగ్గర ఏదో వాగేసేను. " అని ప్రాధేయపడ్డాడు.
"అంటే నీ కసలు ఆ ఉద్దేశ్యమే లేదా?"
"లేదుగాక లేదు ." అనేసి మళ్ళీ నెమ్మదిగా, "వుండనుకోండి." అని నసిగేడు.
"లేదంటే వుందుకీతేడా చాలా చిన్నది. జీవితం మిథ్య . ప్రేమ మిథ్య . ఉండటానికి లేకపోవటానికి తేడాలేదని స్వామి జ్ఞానందస్వామి భగవద్ఘీతలో కృష్ణుడితో చెప్పాడు. కృష్ణుడికీ , గోపికలకీ మధ్య అలౌకిక ప్రేమ..."
"భగవద్ఘీతలోగావుపిక్ల ప్రసక్తి లేదే?"
"లేదా. అయితే కృష్ణుడు సీతతో ..."
"చాల్చాలు. నీ పౌరాణిక పరిజ్ఞానానికి జోహార్లుగానీ అసలు విషయానికి రా" అన్నాడాయన.
"పిల్లకోసం వచ్చి ముంత దాచటం, ఎందుకు గురూగారూ, మీరే సలహా చెప్పాలి. మీ మేనకోడల్ని వన్ వే ట్రాఫిక్ లో ప్రేమిమించేసేను." అన్నాడు చిరంజీవి అన్నిటికీ సిద్దపడి.
"నీ అంతస్తేమిటో, అర్చన అంతస్తేమిటో గుర్తించావా? ఆమెకి రెండు కోట్లున్నాయి."
"లాయర్ని. నాకూ వున్నాయి."
అయన దాన్ని పట్టించుకోలేదు. "ఆఫ్ కోర్స్ . ఈకాలం ఆడపిల్లలు డబ్బుకి విలువ ఇవ్వరనుకో. కానీ అర్చన చాలా ఇంటిలిజెంట ఇండస్ట్రీయలిస్ట్ కూడా. ఇలా ప్రేమా వగైరా అంటే మండిపడ్తుంది. ఆమె మెదడేప్పుడూ ఫ్యాక్టరీలూ_ బ్యాలేన్స్ శీతల మధ్య తిరుగుతూ వుంటుంది. అలాంటి హృదయపు బీడులో ప్రేమ విత్తనం జల్లాలంటే డానికి మంచి వాతావరణం వుండాలి. అనునయంగా ఆమెకి నీ హృదయంలో మాట చేప్పాలి."
ట్లింగ్....... ట్లింగ్ ........
పొడవాటి ప్లీ మత్ కారు హొటల్ ఏషియానాలోకి మెత్తగా దూసుకుపోయింది. పుల్ సూట్ లో చిరంజీవి దిగాడు. పక్కన అమ్దమైనశిఫాన్ చీరలో అర్చన. మత్తయిన డిన్నర్ _ గమ్మత్తయిన గాలి.
కోటు జేబులోంచి ఉంగరం తీశాడు. చిరంజీవి మసక చీకట్లో ఖరీడైన వజ్రం ధగధగ మెరుస్తూంది. ఆమె చేతిని సుతారంగా తన చేతుల్లోకి తీసుకుని 'ఐ లవ్యూ' వెలికి తోడిగేడు.
గ్౦ట్లి..... గ్౦ట్లి.......
"నా చెయ్యి వదిలి పెడ్తవా?" అని అయన అనేసరికి ఉలిక్కిపడి వదిలేసి "సారీ సార్" అన్నాడు.
"ఫర్లేదు. దీన్నిబట్టి నువ్వెంత గాడంగా ఆ అమ్మాయిని ప్రేమించావోఅర్ధమావూతుంది. కానీ చిరంజీవి ఒక్క విషయం. డబ్బు సమస్య కాకపోయినా మీ ఇద్దరికీ పెళ్ళయితే కొన్ని సమస్యలుంటాయి. లెవల్ ఆఫ్ థింకింగ్ ముఖ్యమైనవి. నీకీ విషయంలో ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను.కానీ కారు డ్రైవింగ్ కూడా రాణి వాడివి, అర్చనని ఎలా చేసుకుంటావ్? ఆలోచించు."
కట్ చేస్తే చిరంజీవి హుస్సేన్ అండ్ హుస్సేన్ కంపెనీ.
హుస్సేన్ అండ్ హుస్సేన్ కంపెనీ ఇరవై సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంస్థ. పాతకార్లు డొక్కుకార్లు__ తుక్కుతుక్కైనకార్లు __ పెళ్ళికార్లు కొంటూంటాడు. హుస్సేను. అతడికో డ్రైవింగ్ స్కూలు కూడా వుంది. అతడికి నత్తి.
చిరంజీవి ప్రస్తుతం అక్కడే వున్నాడు.
"జీ.... జీ..... జీ"
"జీవితం" అన్నాడు చిరంజీవి. అతడికీ హుస్సేన్ సంగతి అర్ధమైపోయింది.