ప్రహసిత్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. "......లక్ష్మిలాటి స్త్రీని కూడా నిర్లక్ష్యం చేసేవారుంటారా? అఫ్ కోర్స్. విష్ణు గురించి నువ్వు ఇంతకు ముందే చెప్పావనుకో....."

    "లక్ష్మి నిజంగా  చాలా  మంచి అమ్మాయి. ఒద్దికైనది. ఒకరి గురించి చెడుగా మాట్లాడదు. చీరెలమీదా నగలమీదా ఆశలేదు....."

    ప్రహసిత్ నవ్వుతూ, "మరి అటువంటి అమ్మాయిని సంవత్సరం తిరిగేసరికల్లా వదిలేస్తానని ఎందుకనుకున్నావ్?" అన్నాడు వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నంచేస్తూ. మధూహ నవ్వలేదు. "మీరు భారతదేశపు ప్రధాన టెన్నీస్ ప్లేయరు. ఆట మానేసేక కూడా ప్రతిరోజూ ఉదయం అయిదింటికే లేచి జాగింగ్ చేయటం గమనించాను."

    ఆమె ఏం చెపుతూందో అర్థంకానట్టు చూసాడు. మధూహ తలెత్తి అతనివైపు సూటిగా చూసింది. "మీరు ప్రేమించటానికి ఒక మంచి, ఒద్దికయిన.....చీరెలమీద ఆశలేని అమ్మాయి చాలా?" అని అడిగింది.

    అతడు మరింత కన్ ప్యూజ్ అయి, "నీవు చెపుతోంది నాకు అర్థం కావటంలేదు మధూ" అన్నాడు.

    "అది అర్థమయితే ఈ దేశంలో చాలా సంసారాలు ఇంతకన్నా బాగా వుండేవి. భార్యాభర్తలు మరింత కమ్యూనికేషన్ తో గడిపేవారు. నిజం చెప్పండి. మీ భార్యలో మంచితనం తప్ప మీరింకేమీ ఆశించరా?"

    "ఆమె ఆలా ప్రవర్తించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. భర్త నిరాసక్తత ఆమెలో ఆ విధమైన నిర్లప్తతని కల్గించి వుండవచ్చు."

    మధూహ మరింత ఇరిటేటింగ్ గా, "స్త్రీలు బ్రతికేది కేవలం భర్తల కోసమూ, పిల్లలకోసమేనా? తమకోసం తాము బ్రతకరా?" అంది. "భర్త నిర్లక్ష్యం చేస్తే శరీరం అడ్డంగా పెరిగిపోతూన్నా  పట్టించుకోరు. ఎవరి కోసం అంటారు? భర్తకి మరింత ఆసక్తి చచ్చిపోతుంది. అనాశక్తి ఎవరిలో ముందు ప్రారంభమయిందన్నది.....చెట్టుముందా విత్తుముందా లాటిప్రశ్న. ఈ విషయమంతా మొన్నే మామధ్య చర్చకు వచ్చింది. చివరికి నేనేమన్నానో తెలుసా? ఈ రకమైన బ్రతుకు బ్రతకటంకంటే, ప్రేమించిన ప్రహసిత్ తో ఆనందించటం మంచిదని సలహా ఇచ్చాను." 

    ప్రహసిత్ అప్రతిభుడై చూసాడు. సన్నగా వణికాడు. ఆమె అతడిని పట్టించుకోలేదు....."అవును. మరెందుకు ఈ జీవితం? అటు భర్తనీ సుఖపెట్టలేక, తనూ సుఖపడక, అంతా ఖర్మ మీదికి తోసేసి జీవచ్చవంలా బ్రతకటం కన్నా....ఏదో ఒక కొత్తదారి వెతుక్కోవటం సుఖం కదా. కనీసం అందులోనైనా ఆనందం దొరుకుతుందేమో....." అని ఆగింది. ".......కేవలం భర్తకి ఇది తెలుస్తే తన సెక్యూరిటీ పోతుందేమోనన్న భయానికి 'ప్రేమ' 'కుటుంబం' 'నైతికవిలువలు' అన్నా పేరు పెట్టుకోవటం కన్నా ఆత్మవంచన మరొకటి వున్నదా? అది నిరాసక్తపు రొటీన్ కి దారితీయదా?" ఆమె ఆవేశం ఏ వాదనలకి మరింత దూరంగా దారితీసేదో  కానీ, అప్పుడే పోస్ట్ మాన్ రావటంతో సంభాషణకి బ్రేక్ పడింది.

    ఒకటే ఉత్తరం వచ్చింది. అది అక్కడ అగ్నిపర్వతంలా పేలింది. చాలా మామూలుగా దాన్ని విప్పి చదవటం ప్రారంభించిన ప్రహసిత్, మొదటి వాక్యం చదవగానే నిటారుగా అయ్యాడు.

    అతడి మొహంలో మార్పు గమనించిన మధూహకి ఏమీ అర్థం కాలేదు. "ఏమిటది?" అని అడిగింది. అతడు మౌనంగా వుత్తరాన్ని ఆమెకు అందజేశాడు. ఆమె గబగబా దాన్ని చదవసాగింది. చదవటం పూర్తయ్యేసరికి ఆమె మొహం కూడా రక్తం ఇంకిపోయినట్టు పాలిపోయింది. అందులో ఇలా వుంది.

    "కష్టాలు చెప్పుకుందామని వచ్చిన ఆడదాన్ని ఓదార్చు పేరుతో  ఊరిబయట హొటల్ కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తిన్పించటం మంచివాళ్ళ లక్షణం కాదు. పెళ్ళయిన స్త్రీని లోబర్చుకోవటమంటే వెయిటర్ కి రెండున్నర రూపాయల టిప్ ఇవ్వటమంత సులభం కాదు. ఇదే ఆఖరి వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే, తరువాతి వుత్తరం సరాసరి ఆమె భర్తకే వెళ్తుంది....."

    ఇద్దరూ ఆ వుత్తరంవైపే నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయారు. ఒకటే ప్రశ్న!

    ఎవరు వ్రాసి వుంటారిది?

    "ఈసారి కూడా అతను మిమ్మల్ని ఫాలో అయివుంటాడు" అంది మధూహ.

    "అలాటి అనుమానం వచ్చే, జాగ్రత్తగా  తీసుకెళ్ళాను ఆమెని" అన్నాడు. "ఊరిచివర డాబాహొటల్ కి వెళ్ళాం. వెళ్తున్నంత సేపూ కారు వెనుక ఎవరైనా వస్తున్నారేమోనని జాగ్రత్తగా గమనిస్తూనే వున్నాము. మమ్మల్ని ఎవరూ ఫాలో అవలేదని నిర్భయంగా చెప్పగలను" ఎన్నాడూ లేనంతగా ప్రహసిత్ మొహంలో ఆందోళన కనిపించింది.

    మధూహ ఆ వుత్తరంవైపే పరిశీలనగా గమనిస్తూ "ఈ చేతివ్రాత ఎక్కడో చూసాను. ఎక్కడ చూసానా అన్నది గుర్తురావటం లేదు. అప్పటినుంచి ఆలోచిస్తూనే వున్నాను."

    'నీకూ లక్ష్మికీ కామన్ స్నేహితులుగానీ స్నేహితురాండ్రుగానీ వున్నారా?'

    ఆమెతల అడ్డంగా వూపుతూ "లేరు" అంది.

    "విష్ణు?" అతను వ్రాసివుంటాడా అన్న అనుమానంతో అడిగాడు.

    "కాదు. నిశ్చయంగా కాదు"

    అతడొక క్షణం ఆగి, "రాజు?" అన్నాడు.

    "ఇంపాజిబుల్. అతడి చేతివ్రాత నాకు బాగా తెలుసు."

    ప్రహసిత్ సాలోచనగా, "ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అవటానికి వీల్లేదు. ఆమెని ఇంటికి దూరంగా ఎక్కించుకున్నాను. అదీగాక కారు చాలా వేగంగా డ్రయివు చేసాను. పైగా ఆ డాబా హొటల్ లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు. నేను టిప్ గా రెండు రూపాయలన్నర ఇచ్చానన్న విషయం నాకూ బేరర్ కీ తప్ప మరెవరికీ తెలీదు" అన్నాడు.

    ఆమె మరింత పరిశీలనగా ఆ వుత్తరాన్ని గమనించింది. అతడు కూడా తన ఆలోచనల్లో తనున్నాడు. ఇలాటివి మనసుని చాలా ఛిద్రం చేస్తాయి. పెద్ద పెద్ద ప్రమాదాల్ని సులభంగా ఎదుర్కోవచ్చు. కానీ ఇలాటి చిన్న విషయాలు, కాలిలో ముల్లులాగా నిరంతరం మనసులో ఒక మూల కదలాడుతూ రాత్రింబవళ్ళు గుర్తొస్తూ.....డిప్రెస్ చేస్తాయి. ముందెప్పుడో రాబోయే పెద్ద ప్రమాదంకన్నా ఇది మరింత పెద్దనరకం.

    అకస్మాత్తుగా ఆమె కుర్చీ వెనక్కివాలింది.

    అతడామె వైపు చూసాడు. ఆమె కనులు మూసుకుని దీర్ఘాలోచనలో వుంది. అతడేదో అనబోతుండగా ఆమె కనులు విప్పి, "మనమొకసారి పత్రికాఫీసుకి వెళదామా?" అంది.

    అతడు విస్మయంగా, "ఎందుకు?" అన్నాడు.

    "చెప్తాను. లేదంటే మీరుండిపోండి. నేను వెళ్ళి అక్కడనుంచి ఫోన్ చేస్తాను."

    "వద్దు. నేనూ వస్తాను."

    కార్లో ఇద్దరూ మాట్లాడుకోలేదు. వాళ్ళు వెళ్ళేసరికి ఎడిటర్ శాస్త్రి ఖాళీగానే వున్నాడు. "ఏమ్మా చాలారోజులైంది కనపడి....." అన్నాడు.

    "కాస్త బిజీగా వున్నానండీ.....బైదిబై.....ఈయన ప్రహసిత్."

    శాస్త్రి ఒక్కక్షణం తబ్బిబ్బయ్యాడు. అంత అకస్మాత్తుగా ఇంటర్నేషనల్ స్థాయి ఆటగాడిని అక్కడ చూడటం! ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు.

    "నాకు ఒకసారి 13....14...15స్క్రిప్టు కావాలి సర్. చేతివ్రాత..."

    శాస్త్రి ఆశ్చర్యంగా "......ఎందుకమ్మా" అని అడిగాడు.

    "నా స్నేహితురాలు లక్ష్మి వ్రాస్తోందది. చాలాకాలం వరకూ నాకూ ఆ విషయం తెలీదు. ఆ స్క్రిప్టు చదివింది నేనేకదా. లక్ష్మి చేతివ్రాత నాకు బాగా తెలుసు. మరి ఆ విషయం ఇంతకాలం ఎందుకు గురించలేకపోయానా అని అనుమానం వచ్చింది. అది మరొకసారి చూద్దామని....."

    శాస్త్రి బెల్ కొట్టి ఆ మాన్యుస్క్రిప్టు తెమ్మని పంపించాడు. అది వచ్చేలోపులో అన్నాడు. "ఆ నవల బాగా క్లిక్ అయిందమ్మాయ్. నీ స్నేహితురాలే అంటున్నావు కాబట్టి మరొకటి వ్రాయించు....."

    "వ్రాస్తుందో లేదో తెలీదండీ. మరో నవల వ్రాసేటంత డెప్త్ వుందని నేననుకోను. పయత్నిస్తాను."

    "కష్టపడమను అమ్మాయ్. బాగా చదవమను."

    మధూహ నవ్వి వూరుకుంది. ప్రహసిత్ ఈ సంభాషణనంతా ప్రేక్షకుడిలా వింటున్నాడేగానీ అతని మనసంతా ఉద్వేగంగా వుంది. మధూహ అక్కడికి ఎందుకొచ్చిందో లీలగా అర్థమైంది. కానీ.....కానీ.....

    ఆలోచన్లని భంగంచేస్తూ శాస్త్రి అన్నాడు..... "అభినందన సాంస్కృతిక సంస్థ వారు ప్రతిఏడూ ఒక ఉత్తమరచయిత్రికి బహుమతి ఇస్తారు. ఈ సంవత్సరం ఈ నవలకి ఇద్దామనుకుంటున్నారట. వాళ్ళుగానీ కలుస్తే అంగీకరించమని చెప్పు. చాలా మంచి సంస్థ అది. అలాంటి సన్మానాలు మంచి ఉత్సాహాన్నీ , ప్రోత్సాహాన్నీ ఇస్తాయి."

    బోయ్ ఈలోపులో స్క్రిప్టు తీసుకొచ్చి బల్లమీద పెట్టాడు. మధూహ ఆత్రంగా దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ప్రహసిత్ ఊపిరి బిగపట్టాడు.

    క్షణం కూడా పట్టలేదు.

    రెండు చేతివ్రాతలూ ఒకటే.

    ప్రహసిత్ క్కూడా నిస్సందేహంగా నిర్ధారణ అయిపోయింది.

    ఆ ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాసింది లక్ష్మే.

   
                                    5

    కారు నెమ్మదిగా సాగిపోతోంది. ఎవరి ఆలోచన్లలో వారున్నారు.

    "ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను" అంది మధూహ స్వగతంగా. "లక్ష్మి ఎందుకు చేసిందిలా?"

    ప్రహసిత్ మాట్లాడలేదు.

    "లక్ష్మి స్వభావసిద్ధమైన చేతివ్రాతకీ దీనికీ బాగా తేడా వుంది. అందుకే దీన్ని గుర్తుపట్టటానికి నాకు కాస్త కష్టమైంది. అంత తేడా ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏమి ఆశించి ఈ ఆకాశరామన్న వుత్తరాలు వ్రాసి మిమ్మల్ని బెదిరించింది? దానికన్నా ముఖ్యంగా తనకి తానే ఆ బెదిరింపు లేఖలు ఎందుకు వ్రాసుకుంది? అంతగా భయపడినట్టు ఎందుకు నటించింది? నిజంగా అది నతనేనా? నాకు నమ్మశక్యం కావటంలేదు. ఆ వుత్తరం వచ్చిన రోజు. ఆమె మొహంలో భయం నాకింకా గుర్తుంది! చాలా భయపడింది!!! అయినా ఇదంతా ఎవర్ని భయపెట్టటానికి వ్రాసినట్టు? ఎవర్ని మోసం చేయటానికి?"

    "తనని"

    మధూహ నిశ్చేష్టురాలైనట్టు చూసింది.

    ప్రహసిత్ గంభీరంగా అన్నాడు. "ఆ వుత్తరాలు వ్రాసింది లక్ష్మే. అందులో సందేహం లేదు. పారనాయిడ్ సైకాలజీకి పరాకాష్ట అది"

    మధూహ అదే నిశ్చేష్టతతో అతనివైపు చూసింది. ప్రహసిత్ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు కొనసాగించాడు.

    "యుగయుగాల తరతరాల స్త్రీ ఉదాసీనతకీ, అసంతృప్తికీ ఉదాహరణ లక్ష్మి,. మరుసటిరోజు సూర్యోదయంపట్ల ఆసక్తి లేకపోవటంకన్నా దురదృష్టం మరొకటి వుంటుందా? అటువంటి వైవాహిక జీవితంలో ఎన్నో ఏళ్ళు బ్రతికి బ్రతికి, శూన్యమైన మనసు చుట్టూ నిరాసక్తతని గోడగా కట్టుకుంది. ఆ పరిస్థితిలోంచి బయట  పడాలంటే మనిషి తనను  తాను  ప్రేమించుకోవాలి. ఏదో ఒక  ఆనందప్రదమైన దినచర్య, సంతృప్తినిచ్చే అభిరుచి, నిరంతరం మనో.....శారీరక సంతృప్తి ఏర్పర్చుకోవాలి. ఇవన్నీ కావాలంటే కష్టపడాలి. లేదంటే కర్మసిద్ధంతాన్ని  ఆశ్రయించాలి! చాలామందిలాగే లక్ష్మికూడా ఆ సిద్ధాంతాన్నే ఆశ్రయించి, పైకి నవ్వుతూ బ్రతుకుతోంది. కానీ మనసులో మాత్రం....తనెలావుంటే బావుంటుందో నిరంతరం ఆలోచిస్తూనే వుంది. ఆ ఆలోచనల పర్యవసానమే ఆమె వ్రాసిన 13....14.....15 నవల.....వూహలకి అవుట్ లెట్. మనసు మురళీరవం  ప్రతిగ్గదిలోనూ పల్లవించవలసిన సంసారంలో, శరీర మృదంగనాదం పడగదికి పరిమితమవ్వలసి రావటం పట్ల  ఆమె ఆవేదన అక్షరంగా రూపుదిద్దుకుంది. ఈ పరిణామక్రమంలో ఆమె రెండుగా విడిపోయింది. ఒకటి వాస్తవ జీవితం. మరొకటి వూహ. పెళ్ళికాకముందు ప్రతి ఆడపిల్లా ఎన్నో కలలు కంటుంది. అది నిజమయ్యే అదృష్టవంతులు చాలా కొద్దిమందే వుంటారు. మిగతావారు వాస్తవానికి సర్దుకు పోతారు. ఆమె ఆ విధంగా అడ్జెస్టు కాలేకపోయింది. ఊహల్ని అమితంగా ప్రేమించటం మొదలుపెట్టింది. ఎన్నాళ్ళనుంచో తనలో పేరుకుపోయిన ఊహల్ని నవలలో 'తను' గా చిత్రీకరించుకుంది. అందుకే ఆమె మామూలు చేతివ్రాతకీ, ఈ ఉత్తరంలో వ్రాతకీ అసలు పొంతన లేదు......" 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra