నిర్మల కదలలేదు
అంతకంటే తను స్వరం పెంచితే బయటకు వినబడుతుంది సాగర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అతడు నిర్మలను లేపదల్చుకోలేదు.
తలుపు మళ్ళి చప్పడయింది.
సాగర్ తనేవెళ్ళి తలుపు తీశాడు.
ఏదో అనబోయిన మాణిక్యాంబ ఉలిక్కిపడి- "నువ్వబాబూ!" అని ఊరుకుంది.
"నేను బయటకు వెళ్ళాలని డ్రస్ చేసుకోబోతూండగా నువ్వు తలుపు తట్టేవత్తయ్య! ఎవరూ తీయడంలేదని నేనొచ్చాను. ఇంట్లో ఎవరున్నారూ?" అని ఏమీ ఎరుగనట్లడిగాడతడు.
"నిర్మలుండాలి -ఏ బాత్రూంక్తేనా వెళ్ళిందేమోలె-నేను చూసుకుంటా నులే- నువ్వెళ్ళు ...."అంది మాణిక్యాంబ.
సాగర్ కదలబోతూండగా-"బాబూ! విధివైపు నుంచి మసిలే వీలుంది కదా!మేము లేనప్పడింట్లోంచి మసలకు చూసేవాళ్ళకు బాగుండదు...."అంది మాణిక్యాంబ.
సాగర్ చటుక్కున ఆమెకు పాదాభివందనంచేసి "ఈ యిల్లు మా యిల్లులాగే అనిపిస్తుంది నాకు నావల్లెదైనా తప్పు జరిగితే నువ్వే చేబుతుండాలి నేనింకా చిన్నవాడిని నన్ను మన్నించత్తయ్య!" అన్నాడు.
మాణిక్యాంబతడబడి"అబ్బెఆదేంలేదు ఆడపిల్లలున్న యిల్లుకదా అందుకానీ అలా చెప్పాను. నిమిడ నాకు నమ్మక ముండబట్టేకదా యిల్లద్దేకిచ్చాను" అంది .
సాగర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
తర్వాత మాణిక్యాంబ అక్కడినించి నిర్మల కోసంవెళ్ళింది. తనూహించే చోట్లలోలేదామే. చివరకోగదిలో చాపమీద ఆదమరచినిద్రపోతున్న నిర్మలను చూసి ఆశ్చర్యపోయిందామె నిర్మల ఎప్పడూ యిలా పడుకోలేదు.
"నిర్మలా!" అంది మాణిక్యాంబ
నిర్మల కదలలేదు మెదలలేదు.
ఏ జ్వరమైనా వచ్చిందేమోనని మాణిక్యాంబ ముందుకువెళ్ళి వంగి నిర్మల నడుంను తాకింది.
వళ్ళు మామూలుగా ఉంది.
ఒక్కకుదుపు కుదిపి "నిర్మలా"అంది
అప్పుడు నిర్మల ఉలిక్కిపడి లేచి కూర్చుండి కానీ కళ్ళలో మత్తింకా విడలేదు
"నేను వెళ్ళాక నువ్వుచేస్తున్నపని యిద?" అంది మాణిక్యాంబ.
నిర్మలకప్పడు మత్తువీడింది కళ్ళు విప్పిఎదురుగావున్న మాణిక్యాంబను చూసింది.
"నేను వెళ్ళాక పనులేమైనా చేశావా?" అంది మనిల్యంబ ఆమె గొంతు వురుముతున్నట్లుంది.
ఒక్కసారి ఆమె బుర్రచురుగ్గా పనిచేసింది. జరిగిందంతా ఆమెకు గుర్తువచ్చింది. సుష్టుగా భోం చేసేసరికి వళ్ళు తెలియని నిద్రపట్టేసింది. పనులన్నీ అలాగేఉండిపోయాయి ఇప్పుడేంచేయాలి?
"ఏమిటే-అలా మొద్దులా చూస్తావు ఎప్పుడులేనిది నిద్రేమిటి? అవతల పిల్లలోచ్చే వేళవుతోంది టిపిను కేమ్తెనా రెడిచేశావ?" అంది మాణిక్యాంబ
నిర్మల మాట్లాడకుండా అక్కడ్నించి లేచి తప్పించుకుని పరుగెట్టింది అప్పుడు మాణిక్యాంబ ఆమె ఏపని చేయలేదనే అర్ధమయింది.
నిర్మల కంగారుగా పరుగెత్తిచూసుకుంటే బంతింట్లోగిన్నెలు తళతళ వేరుస్తున్నాయి దోడ్లో బట్టలు ధగధగమెరుస్తూ ఆరుతున్నాయి.
అటుపైన వంటింట్లో ఒక ప్లేట్లో బజ్జిలకని సన్నగా తరిగిన బంగాళా దుంపల ముక్కల్ని చూసిందామె.
"ఇవన్ని ఎవరు చేశారు?" అడిగిందామె మనసు.
"సాగర్!" బదులిచ్చిందామే మనసు.
"ఇది కళా నిజామా?" అన్నదామె మనసు.
నిద్రకు మిఅచిన మనశ్శాంతి ఆ క్షణంలో కలిగిందమెకు.
13
"నేను అరవిందను అర్జంటుగా బయల్దేరి -మోతిమహళ్ ధియేటర్ ఎదురుగాఉన్న పార్కులోపల నల్లగులాబీ గుబుర్లున్నచోటుకురా. పార్కు బెంచిమీదకూర్చుని నీకోసం ఎదురచూస్తూంటాను..."
అవతల క్లిక్ మంది.
సాగర్ ఫోన్ పెట్టేసి -స్కూటర్ మీద అప్పటికప్పుడు మోతిమహళ్ ధియేటర్ ముందున్న పార్కు దగ్గర దిగి- స్కూటరు తాళంవేసి హెల్మెట్ చేత్తోపట్టుకుని లోపలకువెళ్ళాడు.
చెప్పినచోట అరవిందఅతడికోసం ఎదురుచూస్తోంది అతడ్ని చూడగానే లేచి నిలబడి- "ఏమిటి -బొత్తిగా ఈమధ్య కంట్లో నలుస్తె పోయావు? అంది .
"నువ్వెన్నాళ్ళు నన్ను చూడకుండా ఉండగాలవో తెలుసుకుండామని!" అన్నాడు సాగర్.
"నీ మాటకారితనం గొప్పదేకానీ అసలు కారణం చెప్పు!" అంది అరవింద.
"అర్జంటుగా నన్నెందుకు రామ్మనావో నువ్వు నాకు ముందుచెప్పు. అప్పుడు నేను అసలుకారణం చెబుతాను...." అన్నాడు సాగర్.
"అంటే నికాలోచించుకునేందుకు టైము కావాలన్నమాట...."
ఎలాగైనా అనుకో!" అన్నాడు సాగర్.
"కనిసం రోజువిడిచి రోజైనా మనం కలుసుకునేవాళ్ళం. ఇప్పడేమో బొత్తిగా మా యింటికి రావడమే మానేశావు కారణం తెలుసుకుందమనే పిలిచాను...."
"చూడు అరవిందా! అస్తమానూ కలుసుకుంటే మన పరిచయం పాతబడిపోతుంది పెళ్ళినాటికి మన పరిచయం తాజాగా ఆకర్షనీయంగా ఉండాలని ఇప్పట్నించి కాస్త దూఒరంగా ఉంటున్నాను.... అన్నాడు సాగర్.
"మరి నమ పెళ్ళెప్పుడు!"
"పెళ్ళా- అప్పడే?" అన్నాడు సాగర్ కంగారుగా.
"అప్పడే అనడానికి నువ్వేమయినా చంటిపిల్లాడివా?"
"చంటిపిలాడు అదే నాభయం పెళ్ళిచేసుకుంటే చంటిపిలాడు..."
"సరే- నీ భయం ఇంకా ఎన్నాళ్ళుంటుంది?"
"నా భయం నీ కర్ధంకాదులే!" అన్నాడు సాగర్.
"నువ్వు చెప్పు నేనర్ధంచేసుకుందుకు ప్రయత్నిస్తాను..."
"వెయ్యిళ్ళపూజారిని నేను పెళ్ళంటే ఓకేదేవతకు పూజారిగా ఉండిపోవాలి. ఇప్పట్నించి అందుకు సిద్దపడలేను...."