Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 19


    భావరహితంగా చూసింది. " మగాడు ఆడదానికోసం పెళ్ళి చేసుకుంటే ఆడది పెళ్ళికోసం మగాడ్ని అంగీకరిస్తుందనేవాడివి కదూ?"

 

    "అవును... అయితే?"

 

    "రాజీ రణధీర్ ని అలాగే అంగీకరించి ఉంటుంది కదూ?"

 

     టాపిక్ ఇలా మళ్ళుతుందని ఊహించని మిత్ర నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
    
     " ఎందుకిలా జరిగినా రాజీ జీవితంలో చాలా నష్టపోయిందనిపిస్తుంది."

 

    రాజీ గురించి ఆమె అలా ఆలోచిస్తున్న సమయంలో....

 

    అదే  నగరంలో ఓ మూలనున్న భవంతిలో రాజీ దారుణంగా హింసలకు గురి అవుతూంది.


    
    "సో..." రాజీ వంటినుంచి కారుతున్న రక్తన్ని చూస్తూ పాశచికంగా  నవ్వుతున్నాడు రణధీర్. " అది నీకు  కాబోయే వదినన్న మాట! అయినా నిన్ను ఛీకొట్టి పంపిందన్నమాట!"    

 

    ఈ సారి ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా విదిలిస్తూ అన్నాడు. " చూడు... అది నా కేసు విత్ డ్రా చేసుకోవాలి. ఆ విషయంలో నువ్వు దాన్ని ఒప్పించాలి. అందుకు మీ అన్ననే వాడుకుంటావో, లేదూ నువ్వే దాని కళ్ళమీద పడతావో నాకు అనవసరం .ఏమంటావు?"


    
     ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

 

    "మాట్లాడవే!"

 

    "ఒప్పుకోదండీ... నాకు అర్థమైపోయింది."

 

    తల పట్టుకుని గట్టిగా గోడకి గుద్దాడు. సన్నగా మూలిగింది. "అ.... న్నయ్యలాగే... మహా మొండిదండీ" దబ్ మంటూ నేలమీద పడిపోయింది

 

     బ్రతుకు ఆశల్ని ఏనాడో గంగలో నిమజ్జనం  చేసుకుని , కనురెప్పల  సమాధిని చీల్చుకువచ్చే కన్నీళ్ళకు వారధి వేయలేని ఆడదామె.  జీవితమిలా ఉంటుందని తేలీని అమాయకత్వంతో కోరి అతని జీవితంలో అడుగుపెట్టి, ఇలాంటి బ్రతుకుతో రాజిపడటాన్ని అలవాటు చేసుకున్న సగటు మనస్తత్వంగల ఈ దేశంలోని ఓ భార్యరాజీ!

 

    మేనక  రహస్యంగా కలుసుకున్నది- సహాయమే లభిస్తే అలా భర్త మెప్పొందాలీ అన్న ఆలోచనతోనే తప్ప, ఇప్పుడు అది యిలా మలుపు తిరుగుతుందని ఊహించలేకపోయింది.

 

     తాగివున్న రణదీర్ కి నేలమీద పడిన రాజీలో మేనకే కనిపించిందో లేదూ రాజీ నిస్సహాయతే అసహ్యమనిపించిందో చావబాదుతున్నాడు.

 

    "చెప్పవే.... దాన్ని ఒప్పిస్తానని చెప్పు!" చేతితో బూటుకాళ్ళకీ పని కల్పించాడు.

 

    " అ..... మ్మా!"

 

     రాజీ మూలుగులు గొంతులోనే సమాధి అయిపోతున్నాయి.

 

    "లం .. ఒప్పుకోవే!"

 

     సహనం నశించిన రణధీర్ చేతిలో రాజీ   ఏమయ్యేదో, అదిగో అప్పుడు హఠాత్తుగా  రంగప్రవేశం చేసిన లాయరు సూర్యం అతన్ని పక్కగదిలోకి లాక్కుపోయాడు. " చచ్చినా ఒప్పించలేవు రణధీర్. కాని ఇప్పుడా అమ్మాయి చస్తే మేనక్కీ, మిత్రకీ అవకాశమిచ్చినా  వాడివవుతావు."

 

    " ఏం చేయాలి మరి?" అసహనంగా అన్నాడు.

 

    " ముందు ఇది సరైన రహదారి కాదు అంటూ నిర్థారించుకోవాలి" తన చట్ట పరిజ్ఞానాన్ని విశదీకరించాడు. " నీకు  మేనకమీద కసి తీరాలి."

 

    " అవును...." రొప్పుతున్నాడు. "అవకశం దొరికితే దాన్ని నేలకి నెట్టి..."

 

    " నేలమీద కాదు రణధీర్! ఓ శుభముహుర్తాన పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేద్దువుగాని అందుకు ముందు లేపేయాల్సింది రాజీని కాదు. అయినా ఓ మూల పెళ్ళాంగా పడుండే  ఆడదానిమీద నీకు కోపమెందుకు  ఇప్పుడు నీ భార్యమూలంగా జరిగినా మంచి ఏదన్నా ఉంటే అది  మేనక , మిత్రులు కాబోయే భార్య భర్తలని తెలియడం."

 

     " అయితే?"

 

     "మేనకమీద దెబ్బతీయాలని మనం ఓపథకం వేసినా ముందు మనకి ప్రమాదం ఎదురయ్యేది చట్టంతోకాదు. ఓ పెద్ద నేరవ్యవస్థని నడిపిస్తున మిత్రతో . సో... ముందు వాళ్ళ మధ్య అగాధం  సృష్టించాలి."

 

    ఈ ఆలోచన అద్భుతంగా ఉన్నట్టనిపిస్తూంది. " కాని ఎలా?"

 

    " సింపుల్. మిత్ర ఏమిటో మేనక్కి తెలిసేట్టు చేస్తేసరి. ఇద్దరూ ముందు మానసికంగా చస్తారు."

 

    "నిజమే కాని...."

 

    "అటు చూడు. "

 

    అక్కడ ఓ మూల మిత్రకు చెందిన ఓ  అనుచరుడు నిలబడి ఉన్నాడు  డబ్బుతో  కొన్న కమోడిటీలా.

 

    " మార్వలెస్."

 

     ఓ తిరిగులేని పథకానికి అంకురార్ఫణ జరిగిపోయింది.

 

                       *    *    *    *        


     అర్థరాత్రి....

 

    లైట్ హవుస్ కాంతి బంగాళాఖాతం పైన చీలుతున్న చీకటి సంకేతాన్ని నింపుతూంది. సుదూరాన నగరం సుషుప్తిలోకి జారినా జాలరుపేటని ఆనుకుని ఉన్న ఓ  సరుగుడు తోటలో  సన్నగా అలికిడి మొదలైంది.

 

     అప్పటికే సముద్రం  లంగరు వేసిని జపాన్ షిప్ నుంచి తిరిగి వస్తున్న నాలుగుబోట్స్ ఒడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.


    
    క్రమంగా ఎక్కువవుతున్న ఈ దురుగాలిలో కెరటాలు వేగాన్ని పుంజుకుంటున్నాయి.

 

     ఓ బోటునుంచి సంకేతంలా మూడసార్లు లైటు వెలిగి ఆరింది.

 

     దానికి అలాంటి సంకేతంలా మూడుసార్లు లైటు  వెలిగి ఆరింది.

 

     ఆ నాలుగు పడవల్లో సుమారు ఇరవై అయిదు లక్షల ఖరీదుచేసే గోల్డు బిస్కెట్స్ ఉన్నాయి.

 

     తుఫాను ముందు ప్రశాంతతలాంటి వాతావరణంలో .... ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న మిత్ర అనుచరులకి సంజ్ఞచేస్తూ ముందుకు నడిచాడు.    

 

      సాయుధులయిన ఇద్దరువ్యక్తులు ఇసుక తిన్నెలకి ఆనుకుని రోడ్డువేపు చూస్తున్నారు.

 

     బాంబేలో ఉన్న ఓ మాఫియా వ్యవస్థ సౌత్ జోన్ కి ఆధిపత్యం  వహించే మిత్ర ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నది దుబాయినుంచి వస్తున్న కన్ సైన్ మెంటుని.

 

    అయిదు నిముషాలు గడిచాయి నిశ్శబ్దంగా.

 Previous Page Next Page