Previous Page Next Page 
ఋషి పేజి 18


    "నేను  చెప్పేది అదే. వీళ్ళపట్ల తొందరగా ఒక అభిప్రాయానికి వచ్చే సేయ్యకు. నువ్వు జీవితంలో ఒక్క సారయినా తాగేవా?"

    "లేదు."

    "మరి యిందులో ఏవి ఆనందంలేదని ఎలా చెప్పగలవు?"

    ప్రకాశం మాట్లాడలేదు.

    మళ్ళి కుమార్ అన్నాడు, "పోతే నువ్వన్నది తప్పని నేననను అదిగో ఆవిణ్ణి చూడు , జారిపోతున్న స్ధనాల మీద జారిపోతున్న నైలాన్  చీరే వెనుక బిగించి కట్టిన మాసిన -వీళ్ళూ వున్నారు మనచుట్టూ  కాదని అనను. కానీ వీళ్ళున్నారుకదా అని ఈ  రకపు జీవితాన్ని  ద్వేషించే హక్కులేదు నీకు. ఇలాటివాళ్ళు బార్లలోనే కాదు. పవిత్రామైన పురాణ కాలక్షేపం  వినటానికి వచ్చిన ఆడవాళ్ళలో కూడా వుంటారు."

    ప్రకాశానికి చప్పన సుబ్బులు గుర్తుకొచ్చింది. "ప్రతి మధ్య తరగతి ఇంట్లోనూ  కనబడే  సగటు ఆడపిల్ల పవిత్రతనీ, అమాయకత్వాన్ని రంగరించుకోవలసిన ఆ పదహారేళ్ళ వయసులో ఆ అమ్మాయి కళ్ళల్లో  ఏదో కసి- తపన- అది సెక్సు కాదు, ఇంటర్  కోర్సుకి  వప్పకోదు కానీ   ఏదో  చిన్న అనుభవం. చాలా చిన్నది- చెయ్యి  తాకించటమో ప్రేమలేఖ అందుకోవటమో ఇలాటివి చెయ్యాలని. ఇది చెడిపోవటం కాదు ఆమె దృష్టిలో, సరదా ఒక అమ్మాయి అబ్బాయితో  గంటల తరబడి  మాట్లాడినా, తాకినా- ఆ అమ్మాయి శీలం కోల్పోయేనని అనుకోదు ఎందుకంటే  అమ్మాయిల దృష్టిలో శీలం అంటే ఫిజికల్ కాంటాక్టు ఒకటే."

    "ఏమిటాలోచిస్తూన్నావ్?"

    "ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం గురించీ-"

    "ఇందులో ఆలోచించేటంత గొప్ప విషయమేమి లేదు  నా అను భావం మీద చెపుతున్నాను. ఏదో క్షణం ___ ఈ భరించలేని ఆలోచనా ప్రవాహం ఆగిపోయి_ నిశ్శబ్దాన్ని కూడా మర్చిపోయేటంతగా మ్తేకం కమ్మేసి మనిషి ఆ సుషుప్తిలో అలాగే వుందిపొగలిగితే ఎంత అదృష్టం!"

    ___వెయిటర్ ట్రే తీసుకొచ్చి బల్లమీద సర్ది వెళ్ళిపోయేడు. దూరంనుంచి అలలు అలలుగా తలక్ మహమూద్ పాట వినిపిస్తూంది. "ఫిర్ ఒహిగమ్-ఒహిరాత్  -తన్హా  యిహ్తే -దిల్ కో సమ్ ఝూనే తేరియాద్  చెలి అయి హై-" (మళ్ళి అదే ఒంటరి రాత్రి-మళ్ళి అదే  వేదన అదే చీకటి - మనసుని ఓదార్చటం కోసం  ణి జ్ఞాపకాలు వస్తూంటే-)

    ఒక క్షణం నిశ్శబ్దంగా పాటవింటూ  వుండిపోయేరు ఇద్దరూ. మౌనాన్ని భంగాపరుస్తూ అన్నాడు కుమార్ , "ఈ  ప్రపంచంలోకల్లా అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా ప్రకాశం- పదిమందిలో వుంటే ఒంటరిగా వుండాలని కోరుకునేవాడూ, ఒంటరిగా వుంటే పది మందిలోకి వెళ్ళాలని తపించేవాడూ-"

    ప్రకాశం మాట్లాడలేదు. కుమార్ జేబులోంచి ప్యాకెట్ తిసి, "సిగరెట్" అంటూ ఇవ్వబోయేడు.

    "ఉహు-అలవాటు లేదు."

    "నాకూ అలవాటు లేదు. కానీ ఒకటి తాగితే అందులో తప్పేం వుంది?"

    "నాకు సెల్ప్ కంట్రోల్ లేదు కుమార్ అలావాటైతే  కష్టం" అన్నాడు ప్రకాశం. ఈ వాదాన్ని ఒప్పకుంటున్నాట్టు మరి వాదించ కుండా గ్లాసు ఎత్తి "చీర్స్" అన్నాడు కుమార్.

    అంతలో హల్లో కలకలం వినిపించింది. ఒక పక్కగా వున్న స్టేజిమీద చిన్న స్పాట్ పడింది. ఆ వెలుతురులో పాములా మెలికలు తిరుగుతూ ఒక అమ్మాయివచ్చి డాన్స్  చెయ్యసాగింది. గిటార్, డ్రమ్స్ ల ధ్వనుల్తో ఆ హాలు ప్రతిధ్వనించ సాగింది. ప్రకాశం కుతూహలంగా అటువంగి చూడసాగేడు.

    "ప్రకాశం" పిలిచేడు కుమార్.

    ఉలిక్కిపడ్డాడు ప్రకాశం. కుమార్ తన ఉత్సుకతని గమనించేడెమో అని సిగ్గుపడుతూ "ఏమిటి" అన్నాను.

    కుమార్ నవ్వేడు. స్నేహితుడి చేతిని తన చేతిలోకి తీసుకొంటూ , "ఇందులో అంత గిల్టీకాన్ష స్ నే స్ ఏవి అక్కర్లేదు. మనిషిలో ఆ మాత్రం  కుతూహలం వుండకపోతే అనవసరం" అన్నాడు.

    ప్రకాశం మాట్లాడలేదు.

    "ఇదయిపోయిన తరువాత -ఈ  బార్ కి ఎదురుగా వుందొక లాడ్జి, అక్కడికి వెళదాం-"

    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగేడు ప్రకాశం.

    "ఇక్కడ మనం యిచ్చే డబ్బులో సగంయిస్తే ఇంకా నగ్నంగా  కనబడే అమ్మాయిలు అక్కడుంటారు."

    ప్రకాశం కంగారుపడుతూ "వద్దు వద్దు ప్లీజ్-" అన్నాడు.

    కుమార్ ముందుకి వంగేడు- "ఫ్రాంకుగా  చెప్పు  ప్రకాశం ణి కెవి  ఇంటరెస్టు  లేదా?"

    ఒకక్షణం ఆగి నెమ్మదిగా అన్నాడు ప్రకాశం. "ఇంటరెస్టుని భయం డామినేట్ చేస్తూంది."

    కుమార్ మాట్లాడలేదు. మళ్ళి ప్రకాశావే అన్నాడు , "ఈ భయం అనే కవర్ లేకపోతే నే నెప్పుడో పాడాయిపోదును."

    "పోన్లే అంత లోతుగా వెళ్ళాను. ఈ ప్రశ్నకి జవాబు  చెప్పు. రంద్రో జులు పోయిన తర్వాత మళ్ళి ఇక్కడికి ఆహ్వానించాననుకో. వస్తావా?"

    ప్రకాశం అప్రయత్నంగా  "రాను" అన్నాడు.

    "ఎందుకు?" వెంటనే అడిగేడు.

    ప్రకాశానికి జావాబు దొరకలేదు. దాన్ని కవర్  చేసుకొంటూ "నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు" అన్నాడు.

 Previous Page Next Page