Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 18

 

ఏమి జరిగిందా అని విజిత వైపు చూసాడు.
ఆమె కూడా ఇంచు మించు తన స్థితిలోనే ఉంది.  
అప్పుడర్ధమయ్యింది అతనికి ఏం జరిగిందో.
ఆవేశంలో అంతా జరిగిపోయిందని గ్రహించాడు.
ఒక్కమారు ఉలిక్కిపడ్డాడు.
మంచం మీంచి ఒక్క ఉదుటన లేచాడు.
విజ్జీ ఏంటిది. ఇలా జరిగింది అన్నాడు పెద్దగా.
భయం తొంగి చూసింది అతని మాటల్లో.
ఏమి జరిగింది రా వినీల్ అంది విజిత అమాయకంగా మొహం పెట్టి.
ఆమె మధురోహల్లో తేలుతోంది.
కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని మనసులో సంతోషపడుతోంది.
పైకి మాత్రం తనకు అలా జరిగినందుకు బాధపడుతున్నట్లు మొహం పెట్టింది వినీల్ కోసం.
తను లేచి మ్యాట్రెస్ పై వెనక్కు వాలి కూర్చుంటూ నీకేమర్థమయ్యింది చెప్పు బేబీ అంది.
అది జరిగింది కదా అన్నాడు వినీల్ తడబడుతూ.
అది అంటే ఏంటి అంది విజిత అమాయకంగా.
అదే విజ్జీ. పెళ్ళికి తరువాత అయ్యే కార్యక్రమం. బాగా కంగారు పడుతున్నాడు వినీల్. 
కాస్త వివరంగా చెప్పమ్మా అంది విజిత లోలోపల హుర్రే అని ఎగిరి గంతేస్తూ.  
అదే విజ్జీ పెళ్లి తరువాత జరుగుతుంది చూడు శోభనం అని నసుగుతూ అన్నాడు.
అవును. ఇప్పుడు తమరు చేసిన పని అదే.
ఇప్పటివరకు దాచివుంచిన నా ఆడతనాన్ని మీరు సునాయాసంగా దోచేసుకున్నారు తెలుసా.
ఇంత కాలం మీరు అమాయకులని భ్రమపడ్డాను.
ఆమ్మో ఒక్కసారిగా మీ విశ్వరూపం చూపించారు అంది భయం నటిస్తూ విజిత.
మీరు చేసిన పనికి నాకు పెద్ద శిక్షే వేశారు.
నన్ను ఏకంగా తల్లిని చేశారు అంది మరీ భయపెడుతూ. 
ఓ తొమ్మిది నెలలు వెయిట్ చేస్తే నీకో బుల్లి నీల్ ని చేతిలో పెడతా అంది పెద్దగా నవ్వుతూ.
ఆమ్మో ఇదేంటి బ్లాక్ మెయిల్ కి దిగింది. ఏంటి నీకు సరదాగా ఉందా అన్నాడు కోపంగా వినీల్.
మరే.  నాకు ఫన్, నీకు ఫ్రస్ట్రేషన్ అంది నవ్వు ఆపుకుంటూ. 
ఇది ఎంత ప్రమాదమో నీకు తెలుస్తోందా అన్నాడు గాభరాగా.
ఏంటో ఆ ప్రమాదం. నేను సేఫ్ పీరియడ్ లో లేను. అది చెప్పేంతలోనే తమరు చెయ్యాల్సిందంతా చేశారు. ఇంకేముంది. పిల్లల్ని పెంచడానికి ఏర్పాట్లు చేసుకోండి.  పెళ్లి చేసుకోరా బాబు అని నెత్తి నోరు మొత్తుకున్నాను. వింటేగా తమరు. ఒకేసారి పెళ్లి తదుపరి కార్యక్రమం చేసేసారు. నీకు మరీ దూకుడెక్కువరా బుజ్జీ. నువ్వు కనిపించేంత మామూలోడివి కాదు. అసాధ్యుడికి పెద్దన్నవి అంది నవ్వుతూ విజిత.
తనకు వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోదలచుకోలేదు విజిత. 
ఓహ్ మై గాడ్. సేఫ్ కాదని చెప్పొచ్చు కదా. ఎందుకు నన్ను ఎంకరేజ్ చేసావు. అంతా నీ తప్పే అన్నాడు ఫ్రస్ట్రేషన్ తో వినీల్.
నా తప్పేం లేదు బుజ్జి గారు. తమరే తగుదునమ్మా అని నా దగ్గరికి వచ్చి, ముద్దులతో ముంచెత్తి, అంతటితో ఆగక ఆ కార్యక్రమాన్ని కూడా కానిచ్చేశారు అంది విజిత. 
ఆమె వైపు చూడలేక పోతున్నాడు వినీల్. అతనికి నోట మాటలు కూడా రావటం లేదు. 
మొదటిసారి ఒక అమ్మాయి ముందు దోషిలా నిలబడటం అతనికి చాలా అవమానంగా ఉంది.
ఇంతకాలం జాగ్రత్తగా పట్టుకొస్తున్న తనపై తన నమ్మకాన్ని ఇలా అయిపోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఇది ఎలాంటి అవమానాలకు, అపనిందలకు దారితీస్తుందో అని తెగ ఫీల్ అవుతున్నాడు మనసులో. 
****
వినీల్ బాగా దిగులుగా కుంగిపోవడం చూసి బాధపడింది విజిత. 
నీల్ ! తెలిసో తెలియకో లేక తొందరపాటో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అందులోనూ ఇది మన ఇరువురి జీవితాలను శాసించి ముడేసే తప్పు. కారణం నువ్వా, నేనా అన్న వాదనలు ఇప్పుడెందుకు. నాకు బాగా అలసటగా ఉంది. కాస్త కాఫీ కలిపివ్వు ప్లీజ్ అంది విజిత. అతనిని వేరే మూడ్ లోకి మారిస్తే కానీ ఆ దిగులు నుంచి బయటపడేట్లు లేడు అని తోచింది ఆమెకు.
అప్పుడు టైం పన్నెండు కావస్తోంది. రూములో ఏ సి చప్పుడు తప్పితే నిశ్శబ్దంగా ఉంది. అందమైన మ్యాట్రెస్ అంతకు ముందు జరిగిన సంఘటనకు నలిగి కొత్త అందాలు సంతరించుకుంది. మిమ్మల్ని ఎలా కలిపానో చూసారా అంటూ గర్వంగా విజిత, వినీల్ వైపు కొంటెగా చూస్తోంది. 
రూమ్ సర్వీస్ వాడికి ఫోన్ చేసి ఫ్రెష్ జూస్ చెప్పేదా అని అడిగాడు వినీల్.
వద్దు నీల్. కొంచెం కాఫీ కలిపివ్వు వేడి వేడిగా ప్లీజ్ అంది బ్రతిమాలుతూ.
యాంత్రికంగా లేచాడు వినీల్ కుర్చీలోంచి. అతని మైండ్ బాగా డిస్టర్బెడ్ గా ఉంది.   
అక్కడే ఉన్న రెడీమేడ్ మిల్క్ పొడి, కాఫీ పొడి, హాట్ వాటర్ లో మిక్స్ చేసాడు. 
షుగర్ వేసేదా 
లైట్ గా వెయ్యి 
మిక్స్ చేసి రెండు కప్పుల్లో ఇద్దరికీ తెచ్చి ఒకటి విజిత కిచ్చాడు.
థాంక్స్ రా బుజ్జి అంది. చాలా బాగా కలిపావు. రుచిగా ఉంది అని మెచ్చుకుంది.
ఏమో విజ్జీ ఈ రోజు  జరిగింది తలచుకుంటే నాకు చాలా అవమానంగా, దిగులుగా ఉంది అన్నాడు గిల్టీగా తలవంచుకుని. నేను ఎప్పుడూ అంత టెంప్ట్ కాలేదు. ఇవాళ నీ దగ్గర అదీ నీకు బాగా దగ్గరగా రావడంతో నీ అందం, ఆ శరీర పరిమళం ఒక విధంగా మైకాన్ని కమ్మాయి. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. సారీ అన్నాడు.
ఇక ఆ టాపిక్ వదిలెయ్యి. జరిగినదానిని తలచుకుని ఏమి చేస్తావు. ఇలా రా నా పక్కన కూర్చో ప్లీజ్ అంది. 
విజిత పక్కన కూర్చున్నాడు మంచంపై.
ఇద్దరూ వెనక్కు ఆనుకుని కాఫీ సిప్ చేస్తున్నారు.
అతనికి బాగా దగ్గరగా జరిగి అతన్ని ఆనుకుని కూర్చుంది.
సగం తాగిన తరువాత విజిత తన కప్పు అతనికిచ్చి, వినీల్ కప్పు తను తీసుకుంది. టేస్ట్ చూడు అంది.
చాలా బాగుంది అన్నాడు వినీల్ కాఫీ త్రాగుతూ. 
అమ్మయ్య. వీడు నార్మల్సీ కొచ్చాడు అనుకుంది విజిత.
ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సందేహంగా.
ఏ విషయం అంది. 
అదే నీకు ప్రెగ్నన్సీ కన్ఫర్మేషన్.
ఏం. తండ్రి కావాలని, పాపాయిని ఎత్తుకోవాలని కోరికగా ఉందా అని అడిగింది కొంటెగా.
అహ అది కాదు. నీకు ప్రెగ్నన్సీ అయితే మనవాళ్ళముందు తలెత్తుకోగలమా. అందులోనూ మన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలీదు. మీ పేరెంట్స్, మా పేరెంట్స్ ఒప్పుకోవాలి. ఇంతలో నీ ప్రెగ్నన్సీ వార్త తెలిసిందనుకో ఆమ్మో ఆ సీన్ తలచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు. అందులోనూ అది దాచలేము కదా అన్నాడు. చాలా సినిమాలలో చూసిన సన్నివేశాలు కళ్ళముందు కదలాడి వినీల్ ని ఒక్క క్షణం కలవరపెట్టాయి.
అవన్నీ జరిగేలోపే మన పెళ్లయేటట్లు నేను మేనేజ్ చేస్తాలే. నువ్వు ఆ విషయం గురించి వర్రీ అవ్వకు అంది. మనసులో 'పాపం ! దొరికిపోయాడు చదువులు బిడ్డ' అనుకుంది.  భయంగా ఉందా అంది అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని అతని మొహంలోకి చూస్తూ.
హా ! కొంచెం భయంగానే ఉంది అన్నాడు నిజాయితీగా. 
ఇవాళ్టి కి నా రూమ్ లోనే పడుకో నీల్ అంది.
ఇక్కడా ! ఒక్క మంచమే గా ఉంది. వద్దు. నేను నా రూముకెళతాను అన్నాడు.
మళ్ళీ విజితతో కలిసి పడుకుంటే డబల్ కన్ఫర్మేషన్ అవుతుందేమో అని భయపడ్డాడు. 
అంతా చూసావు, హడావిడిగా చేసేసావు. నన్ను నీలో సగం చేసేసుకున్నావు. ఇంకేం మిగిలుంది. ఇవాళ్టి ఈ చర్యతో మన మధ్య గాంధర్వ వివాహం జరిగింది. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ భార్యను. మొహమాటం లేకుండా అబ్బాయిగారు ఇక్కడే పడుకోవచ్చు. నాకూ కొత్త ప్లేస్ కదా. సరిగా నిద్రపట్టదు. నువ్వుంటే ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు అంది ఇక నీకు ఆప్షన్ లేదు అన్నట్లు మొహం పెట్టి.
విజిత బాహుబలిలో శివకామిలా కనిపిస్తోంది వినీల్ కి. విజిత మాటంటే మాట. ఆ మాటే శాసనం. లేకుంటే కుండపోత ఏడుపే. ఆ ఏడుపు భరించేకన్నా ఆవిడ చెప్పింది చెయ్యడం బెటర్ అనుకున్నాడు వినీల్.   
సరే అని తన రూమ్ కెళ్ళి సూట్ కేసు తెచ్చుకున్నాడు. 
విజిత తన మొబైల్ లో మెస్సేజెస్ చూస్తూ హే నీల్ రేపు ఉదయం పది గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్  అని ఉంది. ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఇచ్చారు మెస్సేజ్.
ఓకే. పొద్దున్నే మీ డాడీకి, జనరల్ మేనేజర్ కి ఫోన్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీ ఇండస్ట్రీస్ గురించి. నా దగ్గర ఆడియో విసువల్ కి తయారు చేసిన సమాచారం చాలా ఉంది. రెండు కలిపి చెప్పేయొచ్చు నువ్వు అన్నాడు.
అబ్బా థాంక్స్ నీల్. నాకు ఒక్కమారు భయమేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే. రేపు నువ్వే చెప్పేయ్ కాన్ఫరెన్స్ లో అంది.
అలా బాగుండదు విజ్జీ. నిన్న లాప్ టాప్ చూసి చదివినట్లుగా నువ్వే  చెప్పేయ్ బాగుంటుంది అన్నాడు.
ఊహూ వద్దు. అది ఓన్లీ స్పీచ్. ఇదేమో వాళ్ళు అడిగే ప్రశ్నలకు అతికినట్లు సమాధానం చెప్పాలి. నా వల్ల కాదు. నేను నిన్ను మా విజి ఇండస్ట్రీస్ స్పెషల్  అడ్వైసర్ గా పరిచయం చేస్తాను. అన్ని ఆయనే గైడ్ చేస్తున్నారు. ఆయన మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు అని మీడియా తో చెప్తాను. నీకు ఓకే నా అంది.
మీ డాడీ ఒప్పుకుంటారా అందుకు అన్నాడు సందేహంగా.

 

 Previous Page Next Page