Home » Yandamuri veerendranath » చెంగల్వ పూదండ


    రిక్షావాడు క్రిందికి దిగి ఎత్తులో పైకి  లాగుతున్నాడు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయాను 'పార్వతి ఎలా వుంది?' అడిగేను. నా ఆతృతని పసిగట్టినట్టు ఆమె చెప్పసాగింది.

    "నేను వచ్చేటప్పటికే అక్క ఇక్కడుంది మొదట్నుంచీ అందరితోనూ కలిసేదేకాదు. సాధారణంగా ఇక్కడ కొచ్చేక కొంతకాలానికి ఎవరయినా మారిపోతారు. కానీ ఆమె అలా కాదు" అని ఆగి నెమ్మదిగా "ప్రతి నాలుగు రోజులకీ జగ్గడి చేతిలో నరకం అనుభవించేది. కొంచెం అందంగా అలంకరించుకొమ్మనీ, వచ్చేవాళ్ళతో నవ్వుతూ  మాట్లాడమనీ, కాంతమ్మ పోరేది. తను వినేది కాదు. ఫలితం - జగ్గడు..........." మెరుపులో నా మొహం చూసి  ఆగింది. "చెప్పు..." అన్నాను. నా  కంఠం వణికింది. ఆమె మాట్లాడలేదు క్షణం వూరుకొని, నా చేతిని తన చేతులోకి తీసుకొని "తట్టుకోవాలి, తప్పదు" అంది అనునయిస్తున్నట్టు.

    నన్ను నేను సంబాళించుకోవటానికి ప్రయత్నిస్తూ "తరువాత ఏం జరిగింది!" అన్నాను.

    "అక్కప్రవర్తనలో కాంతమ్మ విసిగిపోయింది. తిండి దండగ అని విసుక్కునేది. ఈ లోపులో...."

    "ఊఁ ఈ లోపులో........."

    "చెప్పు - ఏమయింది........."

    "ఇంకేం లేదు - అంతే" అంది, ఆమె మరి ఆ విషయం మాట్లాడటానికి ఇష్టంలేనట్టు.

    బలవంతం చేయలేదు నేను. పార్వతి ఇక్కడ్నుంచి తప్పించుకొంది, అంతే చాలు! ఇక కష్టపడనివ్వను. పవిత్రత మనసుకి సంబంధించినదనీ, శరీరానికి కాడనీ  ఆమెని ఒప్పించటానికి కొద్దిగా కష్టపడాల్సి వుంటుంది- అంతే! ఒప్పించగలను. ఈ ఆలోచన వచ్చిన తర్వాత మనసు తేలికపడింది. అప్పటివరకూ అస్పష్టంగా మనసులో తొలిచేస్తున్నప్రశ్న బయట కొచ్చింది.

    " పార్వతి  ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది".

    "నాకన్నా రెండు నెలలముందు  -నేనే  పదిహేనో ఏటా వచ్చేను. అంటే....." లెఖ్క వేయసాగింది.

    అసందిగ్థమైన భావాలమధ్య అస్పష్టంగా అన్నాను- "అప్పుడు ఆమెకి పిల్లల్లు ఎవరూ లేరా?" ఆమె జవాబు చెప్పటానికి క్షణం ఆలస్యం చేసింది. నా గుండె వేగంగా కొట్టుకొంటోంది.

    "ఇక్కడికి వచ్చేసరికి అక్కకి ఆరో నెల- కానీ........."

    ఊపిరి బిగపట్టి "ఊఁ కానీ........." అన్నాను.

    "తరువాత కాంతం బలవంతంగా తీయించేసింది" అంది నెమ్మదిగా. "ఎంతో గొడవ జరిగింది, బలవంతంగా  ముగ్గురు కలిసి చేసేరు. అప్పటినుంచే అక్కఆరోగ్యం దెబ్బతింది. బిడ్డ  బయటకొచ్చేక కూడా కొంచెంసేపు బ్రతికేవున్నదనీ, కాంతం అరచేత్తో మొహం నొక్కేసిందనీ నా దగ్గిర చెప్పుకొని ఏడ్చింది". జరిగిందంతా జ్ఞాపకం తెచ్చుకొంటున్నప్పుడు ఆమె కంఠం రుద్దమయింది.

    అరచేత్తో మొహం దాచుకొని మౌనంగా రోధించసాగేను. ఎంత నరకం అనుభవించింది- నన్ను ప్రేమించిన నేరానికి!

    రిక్షా ఆగింది. ఇద్దరం దిగేం.

    హాస్పిటలు కాంపౌండ్ పొడుగ్గా కనబడుతూంది. మైదానంలో చెట్లు చీకట్లో జడలు విరబోసుకున్న దెయ్యాల్లా వున్నాయి. మెరిసినప్పుడల్లా వాటి నీడలు మరింత వికృతంగా కనబడుతున్నాయి. సన్నగా జల్లు పడుతోంది. దూరంగా ఎవరో  హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. చలిగావుండటంవల్ల ఎక్కడా అలికిడిలేదు. నిద్రపోతున్న శ్మశానంలా వుంది హాస్పిటల్ పల్లెనుంచి వైద్యంకోసం  వచ్చిన వాళ్ళు టీ కొట్ల చెక్కలమీద, హొటల్ మెట్లమీద పడుకొని వున్నారు. హాస్పిటల్ లోంచి బయటకు తోసేసిన రోగులు అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నట్టు రోడ్డు ప్రక్క తూముల్లో పడుకున్నారు. అలికిడివిని లేచిన కుక్క ఒకటి మమ్మల్ని చూసి మళ్ళీ  పడుకుంది.

    "ఎటు వెళ్ళాలి?" అడిగేను.

    "ఇక్కడే"-

    వెయ్యి వోల్టుల కరెంటు కమ్చీతో ఒకసారి కొట్టినట్టయింది. 'అంటే' అన్నాను. ఆమె మాట్లాడలేదు. నాకేదో అర్థమయింది. వెన్నులోంచి సన్నగా ప్రారంభమైన చలి శరీరం అంతా వ్యాపించింది- బేలగా ఆమెవైపు చూస్తూ- 'అంటే...అంటే' అన్నాను ఏడుపు గొంతుతో.

    ఆమె అడుగు ముందుకు వేసింది. అటూ ఇటూ చూస్తూ- పడుకున్న వాళ్ళని పరికిస్తూ ముందుకు పోతోంది- 'పార్వతి' నెమ్మదిగా పిలుస్తోంది.

    చిన్న బొంతలమీద  పడుకున్న  వాళ్ళూ, అదీ లేనివాళ్ళు- చిన్న పిల్లల్ని  పొదువుకొని పడుకున్న వాళ్ళు.....మూర్తీభావించిన దైన్యం అంతా అక్కడే వున్నట్టు కనిపించింది. ఇంకొంచెం ముందుకు నడిచేం.

    'పార్వతీ- పార్వతీ' నెమ్మదిగా పిలుస్తోంది. ఆ అలికిడికి నిద్రలోంచి లేచిన బిచ్చగాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూసి మళ్ళీ పడుకొంటున్నారు. రోడ్డు ప్రక్కనున్న రావిచెట్టు క్రింద ఇద్దరు మెలకువగా వున్నారు. చిరుగుల బొంత కప్పుకొని కూర్చొని వున్నారు. కుష్టువాళ్ళలా వున్నారు.

    ఆమె అటుదారి తీసింది. వరదలోపడి కొట్టుకుపోతున్నవాడు చేతికి దొరికిన ఆధారాన్ని పట్టుకుని సాగినట్టు ఆమె వెంట నడుస్తున్నానే తప్ప ఏదీ ఆలోచించే స్థితిలో లేదు నా మనసు. తుఫాను వచ్చేముందు వుండే ప్రశాంతత వాతావరణంలో అలుముకొని వుంది.

    నాకు నమ్మకం పోతోంది. ఈ రాత్రి- ఈ చీకట్లో పార్వతి కనబడుతుందనే ఆశ తగ్గిపోతోంది.

    రావి చెట్టుక్రింద ఇంకా నలుగురైదుగురు పడుకొని వున్నారు. బిచ్చగాళ్ళలో తరగతులు అంటూ వుంటే అధమాధమ జాతికి వస్తారు వాళ్ళు. వర్షం కాల్వలుగా నిలవటంవల్ల రొచ్చుకంపు కోడ్తోంది అక్కడ.

    'పార్వతి' నెమ్మదిగా  పిలిచింది. ఇద్దరిలో ఒకడు వెనక్కి తిరిగి అస్పష్టంగా ఏదో అన్నాడు. రెండోవాడు పక్కకి జరిగేడు. మధ్యలో ఎవరో పడుకుని వున్నారు. ఆమె ఇంకొంచెం దగ్గరకెళ్ళి మరీ పిలిచింది. పడుకున్న  ఆకారం అస్పష్టంగా కదిలింది. ఇద్దరిలో ఒకడు తల క్రింద గడ్డి సరిచేస్తున్నాడు. చేతిని ఎత్తి సరిగ్గా  పెడుతున్నాడు.

    నాలో అసందిగ్ధంగా ఏదో అనుభూతి కలిగింది. జన్మజన్మల సన్నిహితత్వాన్ని మేల్కొలిపే అనుభూతి!

    ఒక్క అంగలో ముందుకు దూకేసు. వంగి ఆమె తలని చేతుల్లోకి తీసుకోబోయేను. తళుక్కున మెరుపు మెరిసి ఆ ప్రదేశాన్ని అంతా క్షణంపాటు వెలుగులో నింపింది. ఆ వెలుగులో స్పష్టంగా ఆమె ఆకారం కనిపించింది.

    "పార్వతి" దిక్కులు పిక్కటిల్లేలా, నా గొంతులోంచి వెలువడినకేక, ఆకాశంలో ప్రతిధ్వనించిన ఉరుములో  కలిసిపోయింది.

    ముక్కులోపలికిపోయి, కనుబొమ్మలు వికృతమై, బుగ్గలు మాంసఖండాలు వ్రేలాడుతూ వుంటే, ఏదో మృగం తినేసినట్టున్న చేతివేళ్ళతో దొరికిన ఆధారాల్ని పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తోంది ఆ శుష్క శరీరం, ఆవగింజవేస్తే పేలిపోయేటంతగా సలసలా మాడిపోతోంది వళ్ళు! ఆమెని రెండు చేతుల్తోనూ వడిలోకి తీసుకొన్నాను. ఏం చెయ్యటానికి పాలుపోలేదు. ఆకుల సందుల్లోంచి వర్షపు చినుకులు పడుతున్నాయి. బైట ప్రపంచంతో తన కేవీఁ సంబంధం లేనట్టు ఆచేతనంగా నా చేతుల మధ్యపడి వుంది ఆమె శరీరం.

    'ఇంకెతోసేపు లేదు-అయిదో పదో నిముషాలు' ఇద్దరిలోనూ ఒకడన్నాడు. కుష్టు చాలాభాగం తీసేసిన వాడి మొహంలో, నిర్లప్తత తప్ప ఇంకేవీ కనబడలేను. ఏ విషయాన్నయినా మామూలుగా తీసుకోగలిగేలా నా మనసు మొద్దుబారిపోయింది. పార్వతివైపు చూసేను. ఈ బాధలన్నిటి నుంచీ విముక్తి పొందుతున్నట్టు ప్రశాంతంగా వుంది. ఇన్ని సంవత్సరాల నరకం తరవాత ఇంకో  లోకంలో సుఖం దొరుకుతుందేమోనన్న ఆశతో  వెళ్ళిపోతోంది- నాకేడుపు రావటం లేదేమిటి? యింతకాలం ఇంత వ్యధతో- ఇంత ఆతృతతో ఎదురు చూసిన క్షణం ఇంత విషాదకరంగా ఎదురు పడినప్పుడు.

    నా కంట నీరు రావటంలేదేం?

    పార్వతి కదలటంతో నా ఆలోచన్ల నుంచి తేరుకొని ఆమె వైపు చూసేను. ఆమె పెదవులు అస్పష్టంగా కదుల్తున్నాయి. ముందుకు వంగేను. ఆ మాట కొద్దిగా వినిపిస్తోంది.

    "కృష్ణా..... కృష్ణా....."

    నాలో అప్పటివరకు ఆనకట్ట కట్టిన శోకం కట్టలుదాటి ఒక్కసారిగా ప్రవహించింది. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వదిలేసిన ప్రియమిత్రుణ్ని- ఇన్ని  కష్టాలుపడి జీవితపు చివరిక్షణాల్లో కూడా తల్చుకొంటూందంటే-నా అంత అదృష్టవంతుడు లేడని పొంగిపోనా? ఇలాంటి సహచారిణి నా జీవితంలోంచి తప్పుకొంటున్నందుకు రోదించనా? నవ్వుకూ, ఏడుపుకూ మధ్య తేడా ఎంత చిన్నది!

    "చచ్చేముందు మెలకువ వస్తుంది చూడు- అదీ యిది" అంటున్నాడు రెండోవాడు. వాళ్ళకీ చావులు చాలా సామాన్యమైన విషయాల్లా వున్నాయి. నా గుండెల్లో అగ్ని పర్వతాల్ని బ్రద్ధలు చేస్తున్నా ఈ చావుని వాళ్ళిద్దరూ చాలా నిర్లిప్తతతో గమనిస్తున్నారు. నా ప్రక్కన నిల్చున్న అమ్మాయి పార్వతివైపు జాలిగా చూస్తూంది.

    నా చేతుల మధ్య ఆమె శరీరం కదుల్తోంది. ఎగశ్వాస ప్రారంభంకాబోతోంది. ముందుకి వంగేను. ఆమె చెవి దగ్గరగా నోరు పెట్టి- హృదయంలోకి చొరబడేలా ఏడ్చేను. "పార్వతీ.... నేను నీ కృష్ణని. వచ్చేసేను పార్వతీ ఒక్కసారి చూడు పార్వతి-" ఆ కంఠం గాద్గదికమైంది. నా పిలుపు ఆమె హృదయంలో ఎక్కడో తంత్రుల్ని శృతిచేసినట్లు కళ్ళు విప్పింది. క్షణంలో వెయ్యెవవంతు ఆమె మొహంలో ఏదో మెరుపు తళుక్కుమంది. నన్ను గుర్తించినట్టు ఆమె చెయ్యి కొద్దిగా వణికింది.

    "చెప్పు పార్వతి! ఈ విషవలయంలో నువ్వెలా చిక్కుకొన్నావు? మళ్ళీ మన ఊరెందుకు రాలేదు? అసలేం జరిగింది?" ఆత్రుత నన్ను ప్రశ్న మీద ప్రశ్న వేసేటట్టు చేస్తోంది. జవాబు కోసం నాకళ్ళు ఆమెవైపు గుచ్చి గుచ్చి చూస్తూన్నాయి. ప్రశ్న అర్థమైనట్టుగా ఆమె పెదవులు కదిల్చింది. ఆమె పెదవులు కదుల్తోంటే ఒక్కో అక్షరాన్ని కలుపుకోసాగేను. పదం తయారయింది.

    "ల......క్ష్మీ.....నా....రా....య....ణ"

    వణికిపోయేను. ఇన్ని సంవత్సరాలుగా నిద్రపోతున్న పగ ఒక్కసారిగా మేల్కొంది.

    లక్ష్మీనారాయణ!

    అంటే.... అంటే.... తండ్రిని చంపి, నన్ను జైలుకు పంపి ఆమెను అనాధని చేసింది చాలక, చెరపట్టి ఇంటిని స్వాధీనం చేసుకొని అవసరం తీరేక గొడ్డుని కసాయివాడికి అమ్మినట్టు వ్యభిచార గృహానికి అమ్మేసేడన్నమాట!

    నా పిడికిలి బిగుసుకుంది. "తీసుకొంటాను పార్వతీ! నీకు  జరిగిన  అన్యాయానికి ప్రతిదానికీ లెక్క పెట్టి బదులు తీసుకుంటాను!"

    నా సమాధానం ఆమెకి వినిపించిందో లేదో తెలీదు- ఆమె మొహం ప్రశాంతంగా వుంది.

    అలికిడి దూరం నుంచి కుక్క ఒకటి మా పక్కగా వచ్చి నిలబడింది. శరీరాన్ని వదుల్తోన్న ఆత్మకి వీడ్కోలు చెప్పటానికా అన్నట్టు ప్రకృతి కూడా మౌనం వహించింది. ఆమె తల వాలిపోయింది. కష్టాల్నుంచీ వ్యధల్నుంచీ శాశ్వతంగా ఆమె సెలవు తీసుకుంది. నలుగురం ప్రేక్షకుల్లా మిగిలిపోయేం.

    ఒక్కసారిగా నన్ను నిస్పృహ ఆవరించింది. ఇంకెందుకు బ్రతికివుండాలి నేను? ఎవరున్నారు నాకు? కన్న అమ్మ చచ్చిపోయింది. పెంచిన అమ్మలేచిపోయింది! జీవితంలో పెనవేసుకొన్న స్నేహితురాలు పోయింది.

    ఇంకేం మిగిలింది? ఎందుకు చచ్చిపోకూడదు నేను?

    లేదు - చావకూడదు!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra