Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 14

    "అందుకే నాకు చెప్పకు...."
    నీకుకాక ఇంకెవరికి చెబుతాను? మాటల్లో చెబితే  నీకర్ధంకావడం  లేదు. చేతల్లో చూపిస్తాను...." అంటూ చంచల్రావామె చేయిపట్టుకున్నాడు.
    మరుక్షణం  అతడి చెంప  చెళ్ళుమంది.
    "నువ్వు నన్ను కొట్టావా ?" అన్నాడు చంచల్రావు.
    "ఇది హెచ్చరికమాత్రం అందుకే ఒకచేత్తో ఓకే చెంపమీదేకొట్టాను కావాలంటే రెండుచేతుల్తోటి రెండు చెంపలమీద కొట్టగలను నేను..."అంది నిర్మల.
    "నీ రెండు చేతులకి రెండు డజన్ల బంగారు గాజులు చేయించలనుకున్నాను. ఆ చేతుల్తో నన్ను కొట్టావు...."అన్నాడు చంచల్రావు.
    "అందుకు నేను కొట్టలేదు నీ చేతులు నా చేతుల్ని పట్టుకున్నాయి...." అంది నిర్మల.
    "నీ రెండు చేతులకి రెండు డజన్ల బంగారు గాజులు చేయించాలనుకున్నను. ఆ చేతుల్తో నన్ను కొట్టలేదు నీ చేతులు  నా చేతుల్నిపట్టుకున్నాయి.,..." అంది నిర్మల.
    "నీకోసం అంట్లుతోమాను..."
    "కావాలంటే బట్టలుకూడా ఉతుకు నేను వద్దనను...."
    "మరి- మన ప్రేమ?'
    "ప్రేమ గురించి  నాతో ఎందుకు మాట్లాడతావు? మా నాన్నగారితో మాట్లాడు...." అంది నిర్మల.
    "నేనంటే నీకిష్టమేనా?"
    "ఇష్టంలేదు కానీ మా నాన్నాగారోప్పూకుంటే నిన్త్నేనా పెళ్ళిచేసుకుంటాను. ఇంక ప్రశ్నలడక్కు. వెళ్ళు...."
    ఇష్టంలేని పెళ్ళి నీకూ  నాకూకూడా సుఖాన్ని
వ్వద్దు...."
    "నీకోసంగతి తెలియదు నా పెళ్ళినా యిష్టంతో  జరగదు...."
    "ఎందుకని?"
    "మా అమ్మ నాకోసం ఓ రెండో పెళ్ళివాణ్ణి చూసింది. ఆ సంబంధమె నాకు ఖాయం...."అంది నిర్మల.
    "అయ్యో!" అన్నాడు చంచల్రావు- "ఆ సంబంధంనుంచి నువ్వు తప్పించుకోవాలి. అమ్డుకొక్కటే ఉపాయం...."
    "ఏమిటది?"
    "మన ప్రేమ విషయం  బయటకు  పోక్కాలి...."
    "అంటే?"
    "పెళ్ళికిముందే మనం సంబంధం ఏర్పరచుకోవాలి...."
    నిర్మల మాట్లాడలేదు....
    "అప్పుడు మీ పెద్దలు చచ్చినట్లు మన పెళ్ళి స్దిరపరుస్తారు...."
    "నువ్వడిగితే ఇప్పుడూ స్దిరపరుస్తారు...." అంది నిర్మల.
    చంచల్రావు తడబడి "ఇప్పుడు వీలుకాదు..."అన్నాడు
    "ఎందుకని?"
    "మేము చాలా గొప్పవాళ్ళం. నాకు లక్షరూపాయలు తక్కువ కాకుండా  కట్నం వస్తుంది. మీవాళ్ళు ముఖ్యంగా నీకు ప్తెసాకట్నం కూడా యివ్వలేరు. అందుకని నా తల్లిదండ్రులి పెళ్ళికి ఒప్పుకోరు. ఇప్పడే ప్రయత్నిస్తే అది లోనే హంస పాదవుతుంది  అలాకాకుండా మనంకొంతకాలంపాటు ప్రేమించు కున్నామనుకో కొంతకాలం రహస్యంగా ఉంచి- ఒకరోజు కావాలనే పెద్దలకు దొరికిపోతాం. అప్పుడు పెద్దరభాస అవుతుంది. వ్యవహారం  పెద్దలదాకా వెడుతుంది. మీవాళ్ళు నన్ను తిడతారు మా వాళ్ళు నిన్ను తిడతారు అప్పడునేను తప్పనాదేనని ఒప్పుకుని పెద్దలనెదిరించై నాసర్ నిన్ను పెళ్ళిచేసుకుంటాను ఒకసారి  పెళ్ళయ్యాక మావాళ్ళు నన్ను పోమ్మనలేరు..."
    "నువ్వుచెప్పింది బాగానేవుంది. కానీ మీవాళ్ళూ, నా వాళ్ళూ  కూడా నన్నే తిట్టారనుకో అప్పుడు నువ్వేంచేస్తావ్?" అంది  నిర్మల.
    చంచల్రావు కేంచెప్పాలో  తెలియలేదు.
    "మిస్టర్ చంచల్రావ్! ఇంతసులభంగా నాతో మాట్లాడేఅవకాశం నీకు  రావదమన్నది నా దురదృష్టం. నాకు అయినవాళ్ళున్నారు. కానీ వాళ్ళకు నేనక్కర్లేదు. నేను చేసిన ప్రతి చిన్నతప్పుని భూతద్దంలో ఇమడనంత పెద్ద తప్పుకు ప్రోత్సహించడం నీకు తగదు. నీకు నామీద నిజంగా ప్రేమ ఉండవచ్చు. నువ్వునన్ను నుఖపెట్టాలని అనుకుంటూండవచ్చు  నువ్వునిజంగామంచి వాడివేకావచ్చు. కానీనాకిలోకంలోమంచితనంమీద నమకం పూర్తిగా పోయింది నాకేమిరాసి పెట్టివుంటుందో-అదే జరుగుతుంది. నీవంటి వాళ్ళసాయాన్ని నేను కోరికోను దయుంచి నన్ను వదిలిపెట్టు తలచుకుంటే నీకు నాకంటే  మంచి వాళ్ళూ అందమ్తెనవాళ్ళూ దొరుకుతారునీకు రెండుచేతులూ జిదించి నమస్కరిస్తాను. ఇక మీదట నాజోలికిరాకు ...." అంది నిర్మల.
    "సిరిరామోకాలడ్డుతున్నావు...." అన్నాడు చంచల్రావు.
    "నాకు సిరులోవ్డ్డు నువ్వు దూరంగా ఉంటే అంతేచాలు...."
    ఎంత ప్రయత్నించినా చంచల్రావామెకు దగ్గర కాలేకపోయాడు.
                                                                                    8
    "నువ్వు చెప్పిందినిజం- ఆమెనాకు లొంగదు" అన్నాడు చంచల్రావు.
    "ఎక్కడో వనజాక్షిలాంటి బరితెగించిన ఆడదితప్పు ఏ ఆడది నీకు లొంగదు...." అన్నాడు సాగర్.
    "వనజాక్షి బరితెగించిన  ఆడది కాదు...." అన్నాడు చంచల్రావు.
    "ఆ విషయం నికర్ధంకాదులే....వశపరచుకునేందుకు నిర్మల కంటే సులభమైన ఆడది  ఉండదు ఆమెను వశపరచుకోలేకపోయవంటే నీ అంత చేతకానివాడు లేనట్లే లెక్క!" అన్నాడు సాగర్.
    చంచల్రావు పౌరుషంగా "చెప్పడం సులభం" అన్నాడు.
    "ఈరోజు మంగళవారం వచ్చే మంగళవారంనాడూ సాయంత్రం నా ఆఫీసు అదికిరా అక్కాడ నిర్మలను చూస్తావు...." అన్నాడు సాగర్.
    "అంటే పెళ్ళిచేసుకుంటావా?"
    "పెళ్ళిచేసుకుంటే ఆఫీసుగదిలో ఎందుకుంటుంది? మా యింట్లో నే వుంటుంది...." అన్నాడు సాగర్.
    చంచల్రావు ఆశ్చర్యంగా "నీనమ్మకంగొప్పది. కానీ నువ్వువస్తావాన్నీ విస్మరిస్తూన్నావు...."అన్నాడు.
    "పదివేళరూపాయలు పందెం కూడా కడతాను" అన్నాడు సాగర్.
    "పదివేలా వద్దులే!" అన్నాడు చంచల్రావు  చటుక్కున.
    "చూశావా-నువ్వే వాస్తవాన్ని విస్మరిస్తున్నావు...." అని నవ్వాడుసాగర్.
    "బ్రదర్ నీ కర్ధంకావడంలేదు. నిర్మల అసహయురాలు కావచ్చు కానీ ఆమెకు  మనోబలం  ఎక్కువ కష్టాల్లో ఉండవచ్చుగాని ఆమెకు ఓర్పుఎక్కువ పైగా ఆమెకు ఆశలులేవు ఆమెలో కోర్కెలులేవు...."అన్నాడు చంచల్రావు.

 Previous Page Next Page