అమ్మ అని నిర్మలతన గుండెలపైన వాలిపోగానే అప్రయత్నంగా దగ్గరగా హత్తుకుంది మాణిక్యాంబ.
అప్పుడు నిర్మల మళ్ళి ఏడ్చింది.
"ఏంజరిగిందమ్మ?" అంది మాణిక్యాంబ.
"రమణయ్య మామయ్యా...." అని ఆగిపోయింది నిర్మల.
అప్పుడు మాణిక్యాంబ ముందు కంగారుగా తలుతిసిన రమణయ్య మెదిలాడు. వోణి వేసుకుంటున్న నిర్మల మెదిలింది. జరిగినదామె ఊహించుకోగాలిగింది.
"తమ్ముడూ!" అని అరిచింది మాణిక్యాంబ.
రమణయ్య అక్కడికి వచ్చాడు.
అప్పటికింకా నిర్మల మాణిక్యాంబ గుండెలపైవాలిఉంది. మాణిక్యాంబ నిర్మలను హత్తుకునిఉంది.
ఆ దృశ్యంచూసి రమణయ్య భయపడ్డాడు.
"ఏళ్ళురాగానే సరికాదు బుద్దిఉండాలి...."అంది మాణిక్యాంబ.
రమణయ్య తలవంచుకుని వెళ్ళిపోయాడు.
"అమ్మా! నువ్వెంతో మంచిదానివి ఎంతో మంచిదానివి ఏమతో మంచిదానివి...." అంది నిర్మల ఆగకుండా తనను సమర్ధిస్తూ నిర్మల ఇతరులను తిట్టిన సందర్భాలా యింట్లో అరుదు.
అప్పుడు మాణిక్యాంబకు నిర్మలప్తే అభిమానం పొంగింది నిజానికామే ఇంటికి తిరిగొచ్చిన కారణంవేరు. ఉదయం తలంటుకుని దుద్దులు కుంకుడు రసంలో నానబెట్టి మర్చిపోయింది. కబుర్లలో పోరాగింటామే. "నీ దుద్దులే వమ్మా" అనడిగేసరికి అసలువిషయం గుర్తుకొచ్చి కంగారుగా వెనక్కోచ్చింది.
మాణిక్యాంబ కళ్ళుతుడుచుకునీ- "వెళ్ళి పనులుచేసుకో..." అంది తర్వాత దుద్దులు చూసుకుంది. అవి జాగ్రత్తగా ఉన్నాయి.
ఆ తర్వాత రమణయ్య తిరిగి ఆమె జోలికి రాలేదు. ఒక్కరోజులో అక్కడ్నించి ప్రయాణంకట్టేశాడు అటుప్తెనుంచి మళ్ళి నిర్మల మాణిక్యాంబలు యధాప్రకారంగానే ఉన్నారు. మళ్ళి నిర్మల మాణిక్యాంబను ప్రత్యేకించి. అమ్మా అని పిలిచే అవకాశంరాలేదు. కానీ మాణిక్యాంబ కావాలనీవచ్చి తనను రక్షించలేదని నిర్మలకు తెలుసు.
నిర్మల అభిమానించినది ఆ పరిస్ధితినేకానీ మాణిక్యాంబనుకాదు.
ఒకసారి అమ్మాఅని మీదపడి ఏడిస్తే తల్లిలా కరిగిపొయిందామె. అది తాత్కాలికం. మరోసారి తనకలాంటి ప్రమాదం వస్తే మాణిక్యాంబ అడుకుంటుందన్న నమ్మకం నిర్మలకులేదు.
7
చంచల్రావు చాలాత్వరగా రంగంలోకి దిగిపోయాడు సాగర్ గదిలో ఉండిపోతే అతడు బైటకు వచ్చి నిర్మలదగ్గరకు వెళ్ళేవాడు.
నిర్మల తన పనుల్లో తనుండేది.
చంచల్రావు తన ఆస్తిపాస్తుల గురించి చెప్పుకునేవాడు. నిర్మల ఈ చెవితోవిని ఆ చెవితో వదిలేసేది.
"నువ్వియింటిలో చాలకష్టాలు పడుతున్నావు-" అనేవాడతడు.
"నాకిక్కడేమీ కష్టంగాలేదు...." అనేది నిర్మల.
"ఈ కష్టాల్లోంచి బయట పదాలని నీకులేదా?" అన్నాడో రోజున చంచల్రావు - నిర్మల గిన్నెలు తోముతూండగా.
"లేదు" అంది నిర్మల.
"చూడు నీకు తెలియడంలేరు నేను ప్రేమించడం నీ అదృష్టం ...." అవకాశం వచ్చింది...."అన్నాడు చంచల్రావ
నిర్మల అంట్లగిన్నె నీళ్ళువిసిరింది. అదోరకమ్తెన వాసనతో కూడిన ఆ నీళ్ళు అతడి బట్టలమీద ముఖంమీద పడ్డాయి.
"ఫరవాలేదులె...."అన్నాడు చంచల్రావు రుమాలుతో ముఖంతుడుచుకుంటూ.
"ఏమయింది?" అంది నిర్మల ఏమీ ఎరగనట్లు.
"కుళ్ళు నీళ్ళు పడ్డాయి...."
"భాగావంతుడలా జరగాలనుకున్నాడేమో...."అంది నిర్మల.
"నువ్వు మనప్రేమగురించి మాట్లాడు...."అన్నాడు చంచల్రావు
"నాకు నీమీద ప్రేమలేదు...."
"ఎవరిమీద వుంది?"
"ముసలివాళ్ళమీద, వికలాంగుమీద...."
"అయితే వాళ్ళనే పెళ్ళిచేసుకుంటావా?"
"ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళిచేసుకుని తీరాలా?"
"ఓహే- నీకు తెలియదుకదూ ప్రేమించుకున్నవాళ్ళేంచేయాలో నేను నీకు చెబుతాను...."అంటూ అతడమెకు దగ్గరగా వెళ్ళాడు.
"నికబుర్లతో నాకాలస్యమ్తెపోతోంది. నీకంత తీరుబడిగా ఉంటే అంట్లు తోమి పెట్టకూడదూ? నేను బట్టలుతుక్కుంటాను !" అంది నిర్మల.
"నువ్వడిగితే ఏమ్తేనా చేస్తాను...." అన్నాడు చంచాల్రావు.
"అయితే ఈఅంట్లుతోమి పెట్టు...." అని అక్కణ్ణుంచి బట్టలుతుక్కుందుకు వెళ్ళిపోయింది నిర్మల.
ఆరోజునుంచి వరుసగా మూడురోజులపాటు నిర్మలకు అంట్లుతోమి పెట్టాడు చంచల్రావు మూడోరోజున నిర్మలతో అతడు "చూశావా ఎంతో గొప్పవాడినయుండి నీకోసం అంట్లు తోముతున్నాను...." అన్నాడు.
"నువ్వెంత గోప్పవాడివో నాకు తెలియదుకానీ అంట్లు తోమడం బాగా అలవాటైన వాడికిలాగే ఉన్నావు. న కంటే శుభ్రంగా తోముతున్నావు" అంది నిర్మల.
"అదంతా ప్రేమ మహత్యం. నిర్మలా! నాప్రేమను చూస్తే నికేమని పిస్తోంది?" అన్నాడు చంచల్రావు.
"నీ స్నేహితుడు కూడా నన్ను ప్రేమిస్తే బాగుండుననిపిస్తోంది!"
"ఎందుకు? నేను నీకు నచ్చలేదా?" అన్నాడుచంచల్రావు కంగారుగా.
"అదేంకాదు ఇద్దరునన్ను ప్రేమిస్త్జే బట్టలుతికే ఒఅనికూడా తప్పుతుంది కదా అని!" అంది నిర్మల.
చంచల్రావు కావేశవచ్చి "ఎంతచెప్పినా ప్రేమంటే నీకర్ధం కాదు" అన్నాడు.