Second Shirdi Ongole Saibaba Temple
రెండో షిర్డీ ఒంగోలు సాయి మందిరం
(Second Shirdi Ongole Saibaba Temple)
సాయిబాబా భక్తులు ఒంగోలును రెండో షిర్డీగా భావిస్తారు. ఎందరో అనుభవాలు అలా ఉన్నాయి. ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి సంకల్పబలంతో ఒంగోలు లాయరుపేటలో సాయిబాబా మందిరం రూపుదిద్దుకుంది.
మొదట 1981 లో సాయిబాబా భక్తులు ఇచ్చిన స్థలంలో ద్వారకామాయి సత్సంగ్ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1982లో శ్రావణ పూర్ణిమ రోజున మరో సాయి భక్తుడు సమర్పించిన ద్వారకామాయి సత్సంగ్ మందిరంలో సమర్ధ సద్గురు శ్రీ సాయినాథుని నిలువెత్తు చిత్ర పటాన్ని భరద్వాజ మాస్టారు ఆవిష్కరించారు. అదే రోజున సాయి మందిరానికి శంకుస్థాపన జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, హర్షద్వానాలు మిన్నంటాయి.
శ్రావణ పూర్ణిమ అంటే సామాన్యమైన రోజు కాదు. ఒకప్పుడు షిర్డీలో సాయిబాబా స్పృశించి ఇచ్చిన పాదుకలను ఉపాసనీ బాబా తన తలపై ఉంచుకుని నడుస్తుండగా, మేళతాళాలతో భక్తజన బృందం అనుసరించి ఘన ఉత్సవం జరిపిన రోజు. తర్వాతి రోజుల్లో షిర్డీ గ్రామం ఎలా మహా పుణ్యక్షేత్రంగా రూపు దాల్చిందో మనకు తెలుసు. ఒంగోలు కూడా సాయి మందిరం వెలిసిన తర్వాత అలాగే ప్రసిద్ధమైంది.
షిర్డీ తీర్థంలో సాయిబాబా తన యోగశక్తితో వెలిగించిన ధునిలోంచి అగ్నిని తెచ్చి ఒంగోలు ద్వారకామాయి సత్సంగ మందిరంలో ఉంచి ప్రారంభోత్సవం చేశారు.
సాయిబాబా చిత్రపటానికి, సాయిబాబాకు తేడా లేదని, షిర్డీ క్షేత్రానికి, ఒంగోలు పుణ్యస్థలానికి బేధం లేదని రుజువైన సందర్భాలు అనేకం ఉన్నాయి. షిర్డీ మాదిరిగానే ఒంగోలు సాయి మందిరంలో కూడా చావడి ఉంది. ధ్యానం చేసుకునేందుకు ధ్యాన మందిరం ఏర్పాటైంది.
ఒంగోలు సాయిబాబా మందిరంలో నిత్యం నాలుగు హారతులు, అర్చనలు జరుగుతాయి. భజనలు చేస్తారు. సత్సంగాలు, ప్రవచనాలు ఏర్పాటు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
Second Shirdi Ongole Saibaba Temple, Ekkirala Bharadwaja Shirdi Saibaba, Ongole Saibaba Temple, Dhuni at Ongole Saibaba Temple, Ongole Saibaba Temple