నీ జీవితానికి పరమార్థం చేకూరాలంటే..
నీ జీవితానికి పరమార్థం చేకూరాలంటే..
- అనిల్
కోపం తన పరిధి విస్తరించినపుడు వికృతరూపం దాల్చి అది క్రోధంగా మారుతుంది. క్రోధం ఆగ్రహమై ఉగ్రరూపం దాలిస్తే దానియొక్క తరంగాలు శరీరంలోని అన్ని కణములకు ‘లావా’లాగా వ్యాపిస్తుంది.అది వ్యాపించినప్పుడు చెవులు మంచి మాటలను వినే వినికిడి శక్తిని కోల్పోయి దారులను మూసివేస్తుంది. నోటితో ఏమి మాట్లాడుతున్నామో మనకే ఏవగింపు కలిగే విధంగా రాక్షసత్వంతో కూడిన వికృతమైన భాషను ఉపయోగిస్తాము. ఇక మనస్సు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయిన బుద్ధి ద్వారా సరియైన నిర్ణయం తీసుకోలేక కల్లు త్రాగిన కోతిలాగా వ్యవహరిస్తుంది కాబట్టి మన అంతర్గత శత్రువులు అయిన క్రోధం, కక్షలు, కార్పణాలు, ద్వేషం, ఈర్ష్యలాంటి దుష్టశక్తులు మన దరికి చేరనీయకుండా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలతో జీవిస్తూ అందరికి ఆనందాన్ని పంచేలా చేయగలిగితే నీ జీవితానికి పరమార్థం చేకూరుతుంది.