వాస్తు ప్రకారం పడకగదిలో చేయవలసినవి,చేయకూడనివి ఏమిటి?
వాస్తు ప్రకారం పడకగదిలో
చేయవలసినవి,చేయకూడనివి ఏమిటి?
మీ పడక గదిలో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి.
ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు. ఇది ప్రతికూల వైబ్రేషన్లను పెంచి వైవాహిక విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
అలాగే పడకగదిలో టివి పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు.
మంచాన్ని కిటికీకి కిందా తలుపుకు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. మూడు వైపుల నుంచి దిగేందుకు వీలుగా మంచాన్ని వేసుకోవాలి.
పడకగదికి బాత్‌రూమ్ అటాచ్డ్‌గా ఉంటే ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచాలి.
పడకగదిలో మొక్కలు, అక్వేరియం పెట్టుకోవడం మంచిది కాదు. ఎదిగే మొక్కలు, చురుకుగా తిరిగే చేపలు బెడ్‌రూంలో విశ్రాంతి వాతావరణంతో విబేధిస్తాయి.
మంచం కింద ఉండే అన్ని వస్తువులను తీసి వేయడం మంచిది. శక్తి నిరాటంకంగా ప్రవహించాలంటే ఆ ప్రదేశం పరిశుభ్రంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. ఇది వైవాహిక సంబంధాలకు మంచిది.
కిటికీ పక్కన పింక్ లేదా హృదయాకారంలో ఉన్న క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి లేదా ఒక పింక్ క్వార్ట్‌జ్ క్రిస్టల్‌ను వెలుగు పడేలా బల్ల మీద ఉంచాలి. తద్వారా అది ప్రేమకు సంబంధించి సానుకూల శక్తిని పెంచుతుంది.
వ్యాయామం చేసే పరికరాలు, కంప్యూటర్, పనికి సంబంధించిన ఇతర సామాగ్రిని పడక గదిలో నుంచి వేరే గదికి తరలించాలి. వాటిని బెడ్‌రూంలో ఉంచడం వల్ల మీ మధ్య సంబంధాలు కూడా పనికి సంబంధించిన వాటిలానే అనిపిస్తాయి.
అలాగే సూది మొనలు కలిగిన ఫర్నిచర్‌ను బెడ్‌రూంలో ఉంచుకోకపోవడం మంచిది. ఇవి విషపు బాణాలలా పని చేస్తాయి. గుండ్రటి అంచులు కలిగిన ఫర్నిచర్ ఉత్తమం.