వివాహ పంచమి ఎప్పుడు..దీనిని ఎందుకు జరుపుకుంటారంటే..!

 

 

వివాహ పంచమి ఎప్పుడు..దీనిని ఎందుకు జరుపుకుంటారంటే..!


దీపాల కోలాహలం ముగిసింది.  శివాలయాల సందడికి తెర పడింది. నదీ స్నానాలు, అభిషేకాల నుండి దేవుడికి కాస్త విరామం దొరుకుతుంది.  భక్తుల కళ్లలో దీప కాంతులు నింపి కార్తీక మాసం సెలవు తీసుకుంది. అయితే కార్తీకం అలా అవ్వగానే ఇలా మార్గశిరం మొదలైంది. మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటాడు.  అంటే మాసాలన్నింటికి మార్గశిర మాసం  శీర్షం   అంటే తల లాంటిది అని అర్థం. పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం ఉంటుంది. అందుకే దీనికి మార్గశిరం పేరు అంట. ఇక మార్గశిరంలో కూడా పూజలు, వ్రతాలకు ఏ లోటు లేదు.  ఈ మార్గ శిర మాసంలో  వివాహ పంచమి వస్తుంది. మార్గశిర పంచమి నాడు వివాహ పంచమి జరుపుకుంటారు.


డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం నుండి డిసెంబర్ 6వ తేదీ మద్యాహ్నం వరకు వివాహ పంచమి ఉంటుంది. సూర్యోదయ తిథి ప్రకారం వివాహ పంచమిని డిసెంబర్ 6 వ తేదీ జరుపుకుంటారు.  వివాహ పంచమి అనేది శ్రీరాముడు, సీతమ్మతల్లి వివాహం జరిగిన రోజట.


వివాహ పంచమి రోజు సీతారాములను భక్తితో పూజిస్తే  పెళ్ళికాని వారికి పెళ్లిళ్లు తొందరలోనే కుదురుతాయని అంటారు. అలాగే పెళ్లైన వారు  ఈ రోజు సీతారాములను పూజిస్తే వారి వివాహ బంధం చాలా బాగుంటుందట.   ఈ రోజు సీతారాములను పూజించడమే కాకుండా పేద ప్రజలకు డబ్బు, ఆహారం,  అవసరమైన వస్తువుల దానం చేయాలి. అలాగే దేవాలయాలను విరాళాలు ఇవ్వడం కూడా మంచిది.  ఈ రోజు ఆర్థిక స్థితికి తగ్గట్టు ఇలా చేస్తే జీవితంలో దేనికీ లోటు లేకుండా ఉంటుంది.

                                                 *రూపశ్రీ.