కోరికలు నెరవేరాలంటే... వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలో తెలుసా!
కోరికలు నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలో తెలుసా!
]
వినాయకుడు ఏ శుభకార్యంలో అయినా మొదటి పూజ అందుకుంటాడు. ఆయన్ను కాదని చేసే ఏ కార్యం కూడా సఫలం కాదని పండితుల అభిప్రాయం. పురాణ కథనాలు కూడా దీనికి బలం చేకూరుస్తాయి. తొలిపూజ అందుకునేలా వినాయకుడికి ఆయన తండ్రి అయిన శివుడి నుండి వరం లభించిందన్నది పురాణ కథనం. అలాంటిది ఏకంగా ఆ గణేశుడినే పూజ చేస్తూ ఉత్సవం జరిపితే కలిగే పుణ్యఫలం మాటల్లో చెప్పలేనిది. అయితే వినాయకుడిని పూజించేవారు తమ తమ కోరికలను బట్టి ఇంటికి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంతకూ ఏ ఫలితం కోసం ఎలాంటి గణపతి విగ్రహం తీసుకురావాలంటే..
సెప్టెంబర్ నెలలో భాద్రపద శుక్ల చవితి రోజున గణేశుడి ప్రతిష్ట చేస్తారు. ఇందుకోసం వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకువస్తారు. అయితే వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపు ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. చాలా మంది వినాయకుడి తొండం కుడివైపు ఉన్న శుభకరమని నమ్ముతారు. ఈ కారణంగా కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని ఇంటికి తీసుకొస్తారు. కానీ కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కష్టమట.
ఇంటికి తీసుకొచ్చే వినాయకుడి చేతిలో దంతం, అంకుశం, మోదకం ఉండాలట. దీంతోపాటు ఒక చేయి అభయం ఇస్తున్నట్టు ఉండాలి. ఇవన్నీ ఉన్న వినాయకుడి విగ్రహం పూజకు చాలా మంచిది. అయితే ఇన్ని ఉన్నా ఈ విగ్రహానికి వినాయకుడి వాహనం అయిన ఎలుక లేకపోతే ఇక ఆ విగ్రహం పరిపూర్ణం కానట్టే లెక్క. కాబ్టటి ఎలుక కూడా ఉండాలి. వినాయకుడు ఈ రూపంలో ఉన్నప్పుడే ఆయనను విగ్రహంలోకి ఆవాహన చెయ్యడం కుదురుతుంది.
పిల్లలు లేని జంట వినాయకుడిని పూజించి ఆయన కరుణ పొందాలని అనుకుంటే బాలగణేశుడి విగ్రహాన్ని తీసుకుని వచ్చి పూజచేసుకోవాలి. అలాగే ఇంట్లో బాల గణేశుడి ఫోటో పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుందట.
ఇంట్లో ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ పోయి అందరూ సంతోషంగా ఉండాలంటే వినాయకుడు నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. అలాగే కళారంగంతో అనుబంధం ఉన్నవారు కూడా ఈ నృత్యభంగిమ గణపతిని పూజించడం వల్ల వారి జీవితంలో ఎదుగుదల ఉంటుందట.
వినాయకుడు సింహాసనంలో కూర్చున్నట్టు లేదా శయనిస్తున్నట్టు ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఉంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.
ఇక వాస్తుప్రకారం అయితే వినాయకుడిని ఇంట్లో బ్రహ్మ స్థానంలో అంచే ఆసనం ఏర్పాటుచేసిన చోట మధ్యలో .. తూర్పు దిశలో లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. వినాయకుడి విగ్రహం ఉత్తరం వైపుకు కనిపిస్తూ ఉండాలి. పొరపాటున కూడా వినాయకుడిని దక్షిణం లేదా నైరుతి మూలలో ఉంచకూడదు. వినాయకుడి విగ్రహం ప్రతిష్టించేచోట వినాయకుడికి సంబంధించిన ఇతర ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉండకూడదు. ఈ నింబంధనలు పాటించి ఇంటికి మంచి వినాయకుడిని తెచ్చి పూజ కూడా సంతోషంగా జరుపుకోండి.
*నిశ్శబ్ద.