చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు

 

చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో

 

వినాయకుడిని పూజిస్తారు

 

 

 

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టి తోడి ముఖంగలవాడూ అయినవానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానిస్తున్నాను

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదం తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

 

 

 


ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాదనం

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమంగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయంలో శైవములోను, వైష్ణవాలలోను, అన్నిప్రాంతాలలో, అన్ని ఆచారాలలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతన పూజా విధానంలో వినాయకుని పూజ కూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానాలు) .

 

 

 


మనం మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభంలాంటి దేహం, బాన పొట్ట, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్నఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము(పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకశాలు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించే సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉంది కానీ, వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.

వినాయక పూజలో ఉన్న విశిష్టతల విశేషాలు. ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి అంటే 21 రకాలు. వీటి వివరాలు - అవి ఆరోగ్యానికి ఉపయోగపడే విధానం:

 

 

 


1.బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది

2.మాచి పత్రం (ధవనం):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.

3.బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.

4.దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.

5.దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.

6.బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.

7.తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.

 

 

 



8.అపామార్గ పత్రం(ఉత్తరేణి): -దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.

9.చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.

10.జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.

11.గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.

12.అశ్వత పత్రం(రావి ఆకు):-చాల ఓషధగుణాలు ఉన్నాయి.

13.అర్జున పత్రం(మద్ది ఆకు):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.

14.అర్క పత్రం(జిల్లేడు ఆకు) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.

 

 

 



15.విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు ఆకు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.

16.దాడిమ పత్రం(దానిమ్మ ఆకు):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.

17.దేవదారు(దేవదారు ఆకు):-శరీర వేడిని తగ్గిస్తుంది.

18.మరువాకం(మరువం ఆకు):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

19.సింధువార పత్రం(వావిలాకు):-కీల్లనోప్పులకు మంచి మందు.

20.శమీ పత్రం(జామ్మీ చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

21.కరవీర పత్రం(గన్నేరు ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.