ఈ వారం (అక్టోబర్ 15th నుంచి అక్టోబర్ 21st) వార ఫలాలు

 

మేషరాశి - అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో మీదైన తరహాలో ప్రయాణించగలుగుతారు. ప్రతికూల అంశాలను చక్కదిద్దుకొనే ప్రయత్నాలను వేగవంతం చేసుకుంటారు. ఆర్థికంగా ముందడుగు వేయగలుగుతారు. సహజమైన తీరుతో వృత్తి, ఉద్యోగాలలో పాల్గొంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి ప్రయోజనాలు ఏర్పరచు అవకాశాలు ఏర్పడతాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభం - కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి.

వృషభరాశివారికి అనుకూలంగా ఉన్నది. అవకాశాలు వస్తాయి. వస్తు జాగ్రత్తలు అవసరం. వృధా ఖర్చులు, స్వల్చ అనారోగ్య సమస్యలు చికాకుపరచుతాయి. శుభకార్యముల విషయమై అయినవారితో చర్చలు చేయగలరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిధునరాశి - మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి.

మిథునరాశివారికి బంధుమిత్రులతో మాటపట్టింపులు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. భూ, గృహ వివాదాలు ఉన్నవారికి మంచి ప్రయోజనాలుంటాయి. ఖర్చులు అధిగమించాలని సూచన. ఆర్థికంగా ఉత్సాహమునిచ్చు వార్తలు వింటారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

.4.కర్కాటక - రాశి  పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. మీ సొంత నిర్ణయాలు కలసివస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబంలో ఏకవాక్యతలు ఏర్పడతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి. 

సింహ రాశి - మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

సింహరాశి మీకు అనుకూలంగా లేదు. ప్రతీ విషయంలో జాగ్రత్తలు వహించండి. పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. ఆలోచనలతో ముందుకు సాగండి. ఆర్థిక అవసరాలను సమర్ధించుకునే విధముగా అవకాశములు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశములు ఏర్పడతాయి. కుజస్థంబన మీకు ప్రయోజనాలను ఇయ్యగలదు. మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

6.కన్య - ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి


కన్యారాశి వారికి మీకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసని చేయండి. అకారణంగా వివాదాల్లో చిక్కుకొను సూచనలు ఉన్నాయి. అధికారులతోను, పెద్దలతోను జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణంలో అనవసర చర్చలు ఏర్పడకుండా జాగ్రత్తలు తప్పనిసరి. ఇతరుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులకు బాధ్యతలు అప్పగించకుండా స్వయంగా చేపట్టుకోండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులారాశి - చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

తులారాశి వారికి మీకు మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. వ్యయమందు కుజస్థంబన, ఆలోచనా విధానమును అమలులో పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించుకోండి. ఆదాయమునందు కొంత కలసివచ్చును. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో విభేదించవలసి వచ్చినప్పుడు లౌక్యముగా సాగాలి. మధ్యవర్తిత్వములకు, కెరీర్పరంగా మార్పులకు దూరంగా ఉండండి. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి  -విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

వృశ్చిక రాశి వారికి మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘపరమైన వ్యవహారాల్లో గుర్తింపులు పొందుతారు. ఆధ్యాత్మి కతతో కూడిన ప్రయాణాల్ని చేపట్టుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి మార్పులు. పనుల్లో వేగవంతంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉండును. మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి - మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ధనూరాశి వారికి మీకు మధ్యస్థంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వృద్ధి ఉండును. ఖర్చులు, ఆదాయాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగ మార్చులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.రోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం రోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకరరాశి - ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

మకర రాశివారికి మీకు అనుకూలంగా ఉంది. భూ, వాహన, గృహ సౌకర్యములు కలుగును. ఆర్థికంగా బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. మనోభీష్టం నెరవేరుతుంది. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి  -ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

కుంభరాశి వారికి మీకు మధ్యస్తముగా ఉన్నది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తునష్టములు, దొంగతనములు ఏర్పడకుండా మెలకువగా వ్యవహరించుకోవాలి. చేసిన పనులే తిరిగి చేయవలసి రావచ్చును. రోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీనరాశి  -పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

మీన రాశి వారికి మీకు అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన విధంగా ప్రయత్నించాలి. ఇతరుల వ్యవహారములకు దూరంగా ఉంటూ ఆలోచనలతో సాగాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగి చేసుకోవాలి. విలాసాలకు అనవసర ఖర్చులు చేయు సూచనలు కలవు. భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయాలకు తగ్గి ఉండుట మంచిది. వాహనవాడకంలో జాగ్రత్తలు అవసరం. మరింత శుభఫలితాలు పొందడం కోసం రోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.