Read more!

తిరుప్పావై ముప్పయివ పాశురం

 

 

తిరుప్పావై ముప్పయివ పాశురం

 

 

 



    *    వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై
        త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ
        అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై
        పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న
        శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే
        ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్
        శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
        ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్
        అణ్దాల్ తిరువడిగళే శరణమ్


భావం :     ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కై౦కర్యమును పొందారు.
వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.
ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.

        శ్రీ సూక్తి మాలిక సంపూర్ణమ్  
        శ్రీ అండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్


    అవతారిక : __

 

 

 

 



ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ (మాలిక) ఈ వ్రతాన్ని చేసినవారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన (మాలిక). ఎన్నడో ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతాన్ని శ్రీ అండాళ్ తల్లి కలియుగంలో తానాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్టానం వలన _ భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి. అత్యంత నిష్టతో ఆచరించిన యీ వ్రతంవలన అజ్ఞానులు సైతం భగవత్సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి, యితరులచే అనుసరింపచేసి మార్గదర్శుకురాలై, ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటివారలను తరింపచేయ సమకట్టి, తల్లి మనకనుగ్రహించినదీ వ్రతాన్ని. ఈ 'తిరుప్పావై' దివ్య ప్రపందాన్ని అనుసంధించి మనమూ తరిద్దా౦! అమ్మా ఋణాన్ని తీర్చుకొందాం శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం!

        (శంకరాభరణము _ ఝుంపెతాళము)
   
    ప.     శ్రీసూక్తి మాలిక! ఆనంద డోలిక!
        కేశవుని వ్రతకల్ప ద్రవిడ సుమ మాలిక!
       
    అ..ప..    పాశురపు పేటిక ముప్పుదుల కానుక!
        ఆశువుగ గోదపాడిన గీతమాలిక!
   
    1. చ..    పాలకడలిక ఓడలున్నను సురలకై
        లీలగ మధించిన కేశువుని జేరి
        గొల్లెతలు చంద్రముఖులా యలంకృతులు
        నల్లనయ్యకు కృపా పాత్రులైన విధమ్ము
        ఉల్లమలరగ గోద గీతముల పాడినది
        శ్రీ సూక్తి మాలిక......

    2.చ..    ఈ పాశురమ్ములను ముప్పదిని విడువక
        గోపాల సన్నిధిని నిత్యమనుసధింప
        గోపదేవుని పూర్ణా కృపగల్గు గాక! యని
        గోపతిని కొలిచిన విష్ణుచిత్తుని తనయ
        శ్రీ పాదములే మనకు శరణమని చూపినది.
        శ్రీ సూక్తి మాలిక! ఆనంద డోలిక!
        కేశవుని వ్రతకల్ప ద్రవిడమును మాలిక!


    (పుష్పములతో ఈ క్రింది కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమును పుష్పమును చూపిస్తూ దానియందు ప్రేమనింపి అర్చన చేయాలి)

 

 

 

 



ఓం   కేశవాయ నమః             ఓం వాసుదేవాయ నమః
ఓం   నారాయణాయ నమః      ఓం ప్రధ్యుమ్నాయ నమః
ఓం  మాధవాయ నమః           ఓం అనిరుద్దాయ నమః
ఓం  గోవిన్డాయ నమః              ఓం పురుషోత్తమాయ నమః
ఓం విష్ణువే నమః                   ఓం అధోక్షజాయ నమః
ఓం మధుసూదనాయ నమః    ఓం నారసింహియ నమః
ఓం  త్రివిక్రమాయ నమః          ఓం అచ్యుతాయ నమః
ఓం వామనాయ నమః            ఓం జనార్దనాయ నమః
ఓం శ్రీ ధరాయ నమః               ఓం ఉపేంద్రాయ నమః
ఓం హృషీకేశాయ నమః           ఓం హరయే నమః
ఓం పద్మనాభాయ నమః          ఓం శ్రీ కృపాయ నమః
ఓం దామోదరాయ నమః          ఓం  సంకర్షణాయ నమః

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్