తిరుమలలో స్నానమాచరించవలసిన తీర్ధరాజములు – తిధులు ఏమిటి?

 

తిరుమలలో స్నానమాచరించవలసిన


తీర్ధరాజములు, తిధులు ఏమిటి?

 

 

 

తిరుమలలోని ఏడు ప్రధాన తీర్ధరాజములలో వివిధ పుణ్యతిధులలో సంకల్ప సహితముగా స్నానము చేసి, శక్తికొలది దానములు చేస్తే అరవైమూడు కోట్ల పుణ్యతీర్ధములలో స్నానమాచరించిన ఫలితము పొందగలము. దానికి కారణము "ఆ పుణ్య తిధులలో అరవైమూడు కోట్ల పుణ్యతీర్థాలు ఆయా తీర్థాలలో ప్రవేశించియుంటాయని'' వ్యాసమహర్షి అభయం యిచ్చారు. భక్తులు ఈ వివరాలు గమనించి శ్రీవేంకటాచలము ఆయా తిధులలో దర్శించి, స్నానమచరించి, శక్తికొలది దానములుచేసి, తరింతుగాకా అని శ్రీవేంకటేశ్వరుని పాదములుపట్టి ప్రార్ధిస్తున్నాము.

తీర్ధరాజము స్నానమాచరించవలసిన తిధి

 

 

 


శ్రీస్వామి పుష్కరిణి అన్నితిధులు

ఆకాశగంగ చైత్ర శుద్ధ పౌర్ణమి

పాపనాశనము ఆదివారము, సప్తమి, హస్తకాని, పుష్యమికానినక్షత్రయుక్తమైనది.

 

 

 



పాండవతీర్ధము వైశాఖ మాసములో ఏ తిధినాడైన
(శ్రీమళయాళస్వామి తపమాచరించిన స్థలము)

కుమారతీర్ధము మాఘమాసపు పౌర్ణమి మధ్యాహ్ణము 12 గంటలకు

తుంబురతీర్ధము ఫాల్గుణ మాసము ఉత్తరఫల్గుణి నక్షత్రయుక్తము
మాత తరిగొండ వెంగమాంబ
తపమాచరించిన గుహకూడ
ఇక్కడే ఉన్నది.తీర్ధరాజము స్నానమాచరించవలసిన తిధి

 

 

 



కృష్ణతీర్ధము పుష్యమాస శుద్ధపౌర్ణమి