Read more!

తిరుమల ఉభయ నాంచారులు, శ్రీ మలయప్ప స్వామి, విమాన వెంకటేశ్వరస్వామి

 

తిరుమల ఉభయ నాంచారులు,

 

శ్రీ మలయప్ప స్వామి, విమాన

 

  వెంకటేశ్వరస్వామి

తిరుమల ఉభయ నాంచారులు

 

 

 


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. ఉభయ నాంచారులలోని శ్రీదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి కుడి వైపున ఉంటుంది. 26 అంగుళాల ఎత్తు గల శ్రీదేవి విగ్రహం 4 అంగుళాల పీఠముపై నిలబడి ఉంటుంది. అలాగే భూదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి ఎడమవైపున ఉంటుంది.

తిరుమల శ్రీ మలయప్ప స్వామి

 

 

 


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. 966A.D. కన్యమాసంలో ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఒక్కసారే జరిగేవి. అప్పుడు పల్లవుల రాణి "సామవై" శ్రీవేంకటేశ్వర స్వామి వెండి విగ్రహం ప్రతిష్టించింది దీనిని "భోగ శ్రీనివాసా" అని పిలుచుకునేవారు. ఈ భోగశ్రీనివాసునినే ఉత్సవ మూర్తిగా బ్రహ్మోత్సవాలు సమయంలో తిరువీథుల్లో 9 రోజులు తిప్పేవారు. కాని ఇప్పుడు వుండే మలయప్ప స్వామి ఉత్సవ మూర్తి మాత్రం 1339A.D నించి వెలుగులోకి వచ్చింది.

విమాన వెంకటేశ్వరస్వామి

 

 

 


ఒక విజయనగర రాజు, స్వామివారి ఆభరణాలను ధరించిన 9మంది అర్చకులను విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికివేయగా ఆ దోషాన్ని నివృతి చేయడానికి వ్యాసరాయలువారు పన్నెండు సంవత్సరాలు ఎవ్వరినీ గర్భగుడిలోనికి అనుమతించకుండా లోపలనే వుండి పూజలు చేసారంట. అలా గర్భగుడి తలుపులు మూసే ముందు దూరప్రాంతాల నుండి వచ్చేభక్తులకు అసౌకర్యం కలగకూడదన్న వుద్దేశ్యం తో మూలవిరాట్టు కు ప్రతిరూపం గా వేరొక విగ్రహాన్ని ఆనందనిలయవిమానం మెదటి అంతస్థులో ఉత్తరవాయువ్యం మూల ప్రతిష్టించారు. అప్పుడు మెదలై నేటికీ కొనసాగుతూ, స్వామి దర్శనం అనంతరం విమానవెంకటేశ్వర స్వామిని దర్సించుకోవడం ఒక ఆచారంగా మారింది. మరొక కథనం ప్రకారం ...
కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీవెంకటేశ్వరస్వామి ఉంటారు. వాయువ్య దిశలో వున్నా ఈ స్వామిని విమాన వెంకటేశ్వరస్వామి అని అంటారు. మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి ఈ విమాన వెంకటేశ్వరస్వామిని తీసుకొచ్చాడని ప్రతీతి. ఆ దర్హ్స్నం పశుపక్షాదుల కోసం, దేవతలకోసం, ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామివారిని సేవిన్చుకోవటం కోసమే. మన పగలూ, రాత్రిళ్ళతో వారికి సంబంధం లేదు. కాబట్టి వారి పూజా సమయం వేరు కనుక భూమిక్రిందున్న, భూమిపైన ఉన్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది.