Matalanu Nijam Chesenduku
Matalanu Nijam Chesenduku
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో
వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి మరి తెలుసుకుంటున్నారు.
"నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అని చెప్పింది కమల.
"నేను ఇంజనీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" అని చెప్పాడు అరవింద్.
"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి
పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు మా తెలుగు మాస్టర్ గారు " అని చెప్పింది రమ.
"మరి నువ్వు? " మౌనంగా ఉన్న శేఖర్ ను అడిగారు రాష్ట్రపతి.
" తెలుగు మాస్టారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా " అని
రమకేసి ఓరగా చూస్తూ చెప్పాడు శేఖర్.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రాష్ట్రపతి.