Tala Maatram Addugaa Vundi
Tala Maatram Addugaa Vundi
తల మాత్రం అడ్డుగా ఉంది
పొడుగ్గా ఉండే అప్పారావు ఒక రోజున నెట్టి మీద టోపీ పెట్టుకుని సినిమా చూడ్డానికి
దియేటరుకు వెళ్లి శ్రద్ధగా సినిమా చూస్తున్నాడు.
కాసేపటి తరువాత ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి తిరిగి చూశాడు. వెనుక సీట్లో ఒకావిడ
కూర్చుని ఉంది.
" మేడం..మీరు సినిమా చూడ్డానికి నా టోపీ అడ్డుగా ఉంటే చెప్పండి. టోపీ తీసి పక్కన
పెడతాను " అని అన్నాడు మర్యాదగా.
" అబ్బే...లేదండీ..! కాకపొతే మీ తల మాత్రం అడ్డుగా ఉంది " అని చెప్పిందావిడ.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పొడుగ్గా ఉన్న అప్పారావు.