చందమామతో చీమ సరసం
చందమామతో చీమ సరసం
విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చందమామతోడ సరసమాడె
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
ఒకానొక చీమ శివునికి అర్చించిన పూలతో పాటుగా ఆయన ఒంటి మీదకు చేరుకుందట. అలా చేరుకున్న చీమ ఆయన శిరసు మీద ఉన్న చందమామను చూసి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కడ చీమ ఎక్కడ చందమామ! చీమ స్థాయి ఎక్కడ జాబిల్లి స్థాయి ఎక్కడ! కానీ శివుని సాంగత్యం పొందడం వల్ల, అది తన జన్మకు అసాధ్యమైన స్థితిని అతి సులువుగా సాధించగలిగింది. ఉత్తములైనవారి ఆశ్రయంలో ఎవరికైనా ఇలాంటి ఉన్నతమైన స్థితి లభిస్తుంది.
-నిర్జర