Cinetaaranu Pelli Chesukunte

 

Cinetaaranu Pelli Chesukunte

సినీతారను పెళ్ళిచేసుకుంటే

ప్రముఖ బిజినేన్ మ్యాన్ అయిన సుందరం నలుగురిలో తన స్టేటస్ ను పెంచుకోవడానికి

ఎంతో ఇష్టపడి ఒక సినీతారను పెళ్లి చేసుకున్నాడు. సుందరాన్ని పలకరించడానికి తన

చిన్ననాటి మిత్రుడు గురునాథం వచ్చాడు.

" ఏరా సుందరం...మొత్తం మీద సినీతారను పెళ్ళిచేసుకుని సినీతారను పెళ్లి చేసుకోవాలనే

నీ కోరికను తీర్చుకున్నావు. ఎలా వుందిరా మరి జీవితం ?" అని సరదాగా నవ్వుకుంటూ

అడిగాడు గురునాథం.

" ఏం జీవితమో ఏం పాడోరా... ! సరదాగా పార్కుకు వెళ్ళితే మాంచి సాంగ్ పాడమంటుంది.

ఎవరైనా చెల్లెమ్మా అంటే చాలు...అమాంతంగా వెళ్లి అతన్ని కౌగిలించుకుంటుంది.

సినిమాకి వెళితే చాలు కూర్చోకుండా సాంగ్స్ రాగానే లేచి స్టెప్పులు వేస్తుంది. " అని

నిరాశగా నిట్టూరుస్తూ చెప్పాడు సుందరం.