సీతారాముల కల్యాణానికి మీవంతు తలంబ్రాలు ?
సీతారాముల కల్యాణానికి మీవంతు తలంబ్రాలు ?
ఉగాది నుండి మీ ఇంటిలో సభ్యులు స్నానానంతరం[ఉదయంలేదా సాయంత్రమైనా] వడ్లు తీసుకుని "శ్రీరామ" అని గోటితో వలచి ఆ బియ్యాన్ని పవిత్రంగా ఒక పాత్రలో పోయండి. ఇలా నవమి వరకు తయారు చేసిన బియ్యాన్ని నవమి ఉదయాన్నే తీసుకెళ్ళి మీ ఊరిలో కళ్యాణం జరుగుతున్న మండపంలో తలంబ్రాలు నిమిత్తం అక్కడి అర్చక, పురోహితులకు అందజేయండి. అవి ఎన్నైనా పరవాలేదు. వందగ్రాములు కావచ్చు, అరకేజీ కావచ్చు. మీకున్న సమయాన్ని బట్టి స్వామి నామస్మరణతో తయారు చేసి పంపండి. మీ ఇంటిలో ధనధాన్యములు వృధ్ధి చెంది, పరంధాముని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ తొమ్మిదిరోజుల నామస్మరణతో మీ గృహంలో గల దోషాలు తొలగిపోతాయి. ఇల్లు శక్తితరంగాలతో వెలుగొందుతుంది. మీగ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువమందిచే జరిపించి శ్రీసీతారాముల కరుణాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము.