శ్రీరామ హనుమత్ స్తోత్ర రత్నావళి, శ్రీరామ ప్రార్ధన, శ్రీరామ కర్ణామృతం
శ్రీరామ హనుమత్ స్తోత్ర రత్నావళి,
శ్రీరామ ప్రార్ధన,
శ్రీరామ కర్ణామృతం
శ్రీరామ హనుమత్ స్తోత్ర రత్నావళి
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
రామనామాన్ని మూడు సార్లు స్మరిస్తే చాలు, వెయ్యి నామాలతో వేయి వెలుగుల వేల్పును ధ్యానించినట్ల అవుతుందని ఆర్యోక్తి. రామశబ్ధం యొక్క మహాత్యం అటువంటిది. రామ చరిత్ర ఒక్క అయోధ్యను ఉద్దరిస్తే రామనామం యావత్ప్రపంచాన్ని తరింప చేసిందని తులసీదాసు రామనామ ప్రాచుర్యాన్ని విశదీకరించాడు. శ్రీరామచంద్రమూర్తికి సాటి దైవ మికలేడని రామదాసు కొనియాడాడు.
''వేద వేద్య పటే పుంపి జాతే దశరదాత్మజే.
వేద: ప్రాచేతసాదాసీట్ సాక్షా ద్రామాయణాత్మనా''
వేదవేద్యుడయిన పరంధాముడు శ్రీరామచంద్రుడుగా అవతరిస్తే వేదమే రామాయణ కావ్యంగా వాల్మీకి నోట వెలువడింది.
నారద మహర్షి శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణించి చివరకు 'సత్యధర్మ ఇహపర:' అంటాడు. అనగా నిత్యనిష్టలో రాముడు సాక్షాద్ధర్మ దేవతట. 'రామోవిగ్రహవాన్ ధర్మ:' అనగా రాముడు మూర్తీభవించిన ధర్మమే అని మారీచుడు రావణునితో చెబుతాడు.
భారతీయ సంస్కృతిలో ప్రజల్లో రాముడులాగా చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు మరియొకడు లేదు. అందుకే భారత దేశంలో పట్టుమని పది ఇండ్లు కూడా లేని పల్లెల్లో సహితం ఒక రామ మందిరం నిర్మితమై వుంది.
రాముని నమ్మినబంటు ఆంజనేయుడు. శ్రీమద్రామాయణ కార్యంలో ఆంజనేయస్వామివారి ప్రాభవం ఎంతగానో కొనియాడబడింది. భయమని చెప్పే పిల్లలకు ఆంజనేయ దండకం మననం చేసుకోండని చెప్పే తల్లిదండ్రులు ఎందరో వున్నారు.
భారతీయ జనజీవన స్రవంతిలో ఇంత బలీయంగా పెనవేసుకు పోయిన శ్రీరామచంద్ర, ఆంజనేయస్వామి వారల కొన్ని ముఖ్యమైన స్తోత్రాలను సమాజానికి సమరిపిస్తోంది.
శ్రీరామ ప్రార్ధన
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతయా: పతయే నమః
శ్రీరాఘవం దశరతాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపమ్.
ఆజానుబాహు మరవింద దశాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
మనోభిరామం నయనాభిరామం వచోభిరామం శ్రవణాభిరామమ్,
సదాభిరామం సతతాభిరామం వందే సదా దాశరథిమ్ చ రామమ్
శ్రీరామ కర్ణామృతం
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండసే
మధ్యే పుష్పకమాననే మణిమయే వీరాననే సంస్దితమ్,
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పఠం
వ్యాఖ్యాంతం భ్రతాదిభి: పరివృతం రామమ్ భజే శ్యామలమ్.
శ్రీ మద్దివ్య మునీంద్ర చిట్టా నిలయం సీతా మనోనాయికం
వల్మీకోద్భవ వాకృయోదిశశినం స్మేరాననం చిన్మయమ్
నిత్యం నీరద నీలకాయ మమలం