వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?

 

వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?


హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ధనుర్మాసంలో వస్తుంది. ఈరోజులు ప్రజలు దేవుడిని రకరకాలుగా పూజిస్తుంటారు. 2023లో వైకుంఠ ఏకాదశి, ముహూర్తం, పూజా ఆచారాల గురించి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి రోజు  శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ రోజు వైకుంఠ ద్వారా తెరుచుకుంటుందని నమ్ముతుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు స్మరణ చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈఱోజు పూజలు, ఉపవాసాలు ఉంటారు. పలు ఆలయాల్లో ఈరోజుప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రోజంతా భజన, పూజలు నిర్వహిస్తుంటారు. భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు ఉంటారు. రేపు అంటే 23న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకంత ప్రత్యేకమైందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైదిక సంప్రదాయం ప్రకారం..వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎన్నో విధాల ప్రయోజనం ఉంటుంది. ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండటమే కాదు..ద్వాదశి నాడు మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉంటారు. అలాగే ఈరోజు హరి తన భక్తులకు దర్శనం ఇచ్చే రోజని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారాం నుంచి బయటకు వస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు.

పురాణాల ప్రకారం..ఈరోజు వైకుంఠ ద్వారం దగ్గర విష్ణుమూర్తిని దర్శించుకుని మధుకేతువులు అనే రాక్షసులకు శాపవిముక్తి కలిగిందట. అందుకే అప్పటి నుంచి వైకుంఠ ద్వారాన్నిపోలిన ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నవారికి స్వర్గప్రాప్తి కలుగుతుందనే నమ్మకం ఉంది. ఇదే కాదు ఈరోజు నూనె స్నానం చేసి ఉపవాసం ఉంది ఆలయానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు. అక్కడ దేవుడి ఉత్సవ విగ్రహానికి శిరస్సు నుంచి వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే మోక్షం లభిస్తుంది. ఈ ఏకాదశిని స్వర్గ వతిల ఏకాదశి అని అంటారు. విశ్వాసం ప్రకారం ఈరోజు దక్షిణాయనంలో నిద్రించిన విష్ణువు ఉత్తరాయణంలో మేల్కోంటాడు. అలాగే 3 కోట్ల దేవతలకు దర్శనం ఇస్తారని చెబుతారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.