ఆత్మ కూడా దీపం వంటిదే
ఆత్మ కూడా దీపం వంటిదే
దీపం అందరికీ వెలుగు పంచుతుంది. వెలుగునిచ్చే దీపానికీ శత్రువు గాలి. అది చిన్నదైనా దీపాన్ని కదిపి, కాంతి ప్రసరించటంలో ఆటంకం కలిగిస్తుంది. అదే గాలి పెద్దదైతే దీపం రూపే లేకుండా పోతుంది. అందుకే గాలి తగలకుండా ఉండే చోట దీపం పెట్టమని చెప్పారు. అప్పుడే కాంతి నిశ్చలంగా ప్రసరిస్తుంది. చీకటిలో కొట్టుమిట్టాడకుండా పనులు చక్కబెట్టుకోవచ్చు.
మనలో ఉన్న ఆత్మ కూడా దీపం వంటిదే. దీపం కాంతి వంటిదే జ్ఞానము. ఇతర విషయాలపై ప్రవర్తించే మనోవృత్తులే మన శత్రువులు. అవి చిన్న చిన్న విషయాలపై ఆకర్షన కలిగింప చేసి, బాహ్య విషయాలపై ఆసక్తి కలిగేల చేసి సహజస్థితిని తెలియనీయకుండా అడ్డుపడతాయి. సహజమైన జ్ఞానముతో కలిగే ఆనందాన్ని మనోవృత్తులు దూరం చేస్తాయి. అందుకే ఆత్మ ఈ మనోవృత్తులకు లోబడకుండా చూసుకోవాలి. అప్పుడే జ్ఞానం నిశ్చలముగా ఉండును. అప్పుడే మనిషి తన సహజ రూపమును దర్శింపగలడు. భ్రమలతో సహవాసం చేయడు.