శుక్రగ్రహ జపం

 

శుక్రగ్రహ జపం (Shukra Graha Japam)

 

ఆవాహనము:

అస్యశ్రీ శుక్ర గ్రహ మహా మంత్రస్య భరద్వాజ ఋషిః! శుక్రగ్రహో దేవతా!

త్రిష్టుప్ చ్చందః శుక్రగ్రహ ప్రసాద సిద్ధర్ధే శుక్రగ్రహ మూలమంత్ర జపం కరిష్యే:!!

కరన్యాసము:

ఓం సుక్రంతే అన్యత్ - అంగుష్టాభ్యాసం నమః ఓం యజంతే అన్యత్ - తర్జనీభ్యాం

ఓం విష్ణురూపే అహని - మధ్యమాభ్యాం నమః ఓం ద్యౌరివాసి - అనామికాభ్యాం నమః

ఓం విశ్వహిమాయ అవసిన్వధావః - కనిష్టికాభ్యాసం నమః

ఓం భద్రాతే పూషన్నిహరాతిరస్తు - కరతల కరపృష్టాభ్యాసం నమః

అంగన్యాసము:

ఓం సుక్రంతే అన్యత్ - హృదయాయ నమః ఓం యజంతే అన్యత్ - శివసేస్వాహా

ఓం విష్ణురూపే అహని - శిఖాయైవషట్ ఓం ద్యౌరివాసి - కవచాయహు

ఓం విశ్వాహిమాయ అవసిన్వధావః - నేత్రత్రయాయ వౌషట్

ఓం భద్రాతే పూషన్నిహరాతిరస్తు - అస్త్రాయఫట్ ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ఆదిదేవతాః

ఇంద్రాణి మాసునారిషు సుపత్ని మహ మాశ్రవం సహ్యస్యా అపరంచన జరసామరతే పతి:!

ప్రత్యథి దేవతా: ఇంద్ర ఓ విశ్వతస్పరిహ వామయే జనేభ్యం:! అస్మకమస్తు కేవలః

వేదమంత్రం

శుక్రన్తే అవ్యద్య జతంతే అవ్యద్విషురాపే ఆహానిద్యౌరివాసి విశ్వాహి

మాయా అవసి స్వదావో భద్రాతే పూషన్నిహిరాతిరస్తు!!

సూర్య కవచ స్తోత్రము శిరోమే భార్గవః పాతు! ఫాలం పాతు గ్రహధిపః!

నేత్రే దైత్యగురు: పాతు! శ్రోత్రే శ్రీ చంద్రనద్యుతి:! పాతుమే నాసికాం కావ్యో!

వాదనం దైత్య వందితః! రసనా ముశనా: పాతు! కర్ణం శ్రీకంఠ భక్తిమాన్!

భుజౌ తేహోనిధి: పాతు! వక్షో యోగవిదాం వరః! అక్షమాలా ధరోక్షేత్!

కుక్షిం మె చక్షుషాం కరం:! కటింమే పాతు విశ్వాత్మా! సిక్థినీ సర్వపూజితః!

జానునీ తు భ్రుగు: పాతు! జంఘేమే మహతాం వరః! గుల్ఫౌ గుణనిధి: పాతు!

పాదౌమే పాండురాంబరః! సర్వాణ్యంగాని మే పాతు! శుక్ర కవి రహర్నిశం!!

ఫలశ్రుతి:

య ఇదం కవచం దివ్యం పఠేచ్చ శ్రద్దయాన్వితః!

సతస్య జాయ తే పీడ! భార్గవస్య ప్రసాదతః!!

శుక్ర మంగళాష్టకమ్

శుక్రోభార్గవ గోత్రజ స్సిత నిభః పూర్వముఖః పూర్వదిక్! పంచాశ్రో వృషవస్తు లాధిప మహారాష్ట్రాదిపౌ దుంబర!!

ఇంద్రాణీ మఘవాచ సౌమ్య విరజౌ మిత్రేర్క చంద్రావరీ! శాస్భూ భ్రుద్దశ వర్జితో భ్రుగుసుతః కుర్యాత్సదా మంగళమ్!!

శుక్రాష్టోత్తర శతమామావళి: ఓం శుక్రాయ నమః ఓం శుచయే నమః ఓం శుభగుణాయ నమః

ఓం శుభదయ నమః ఓం శుభలక్షణాయ నమః ఓం శోభనాక్షాయ నమః ఓం శుభ్రరూపాయ నమః

ఓం శుద్ధస్పటికభాస్వరాయ నమః ఓం దీనార్తిహరాకాయ నమః ఓం దైత్యగురవే నమః

ఓం దేవాభినందితాయ నమః ఓం కావ్యసక్తాయ నమః ఓం కామపాలాయ నమః ఓం కవయే నమః

ఓం కల్యాణదాయకాయ నమః ఓం భద్రమూర్తయే నమః ఓం భద్రగుణాయ నమః

ఓం భార్గవాయ నమః ఓం భక్తపాలనాయ నమః ఓం భోగదాయ నమః ఓం భువనాధ్యక్షాయ నమః

ఓం భుక్తిముక్తి ఫలప్రదాయ నమః ఓం చారుశీలాయ నమః ఓం చారురూపాయ నమః

ఓం చారుచంద్ర నిభాసనాయ నమః ఓం నిధయే నమః ఓం నిఖిల శాస్త్రజ్ఞాయ నమః

ఓం నీతివిద్యాధురంధరాయ నమః ఓం సర్వ లక్షణ సంపన్నాయ నమః ఓం సర్వావగుణవర్ణితాయ

ఓం సమానాధిక నిర్ముక్తాయ నమః ఓం సకలాగమపారగాయ నమః ఓం భ్రుగవే నమః

ఓం భోగకరాయ నమః ఓం భూమీసురపాలనతత్పరాయ నమః ఓం మనస్వినే నమః

ఓం మానదాయ నమః ఓం నూన్యాయ నమః ఓం మాయాతీతాయ నమః ఓం మహాశయాయ నమః

ఓం బలిప్రసన్నాయ నమః ఓం అభయదాయ నమః ఓం బలినే నమః ఓం బలపరాక్రమాయ నమః

ఓం భవపాశపరిత్యాగాయ నమః ఓం బలిబంధవిమోచకాయ నమః ఓం ఘనాశయాయ నమః

ఓం ఘనాధ్యక్షయ నమః ఓం కంబుగ్రీవాయ నమః ఓం కళాధరాయ నమః ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః

ఓం కళ్యాణగుణవర్థనాయ నమః ఓంశ్వేతాంబరాయ నమః ఓం శ్వేత వపుషే నమః ఓం చతుర్భుజసమన్వితాయ నమః

ఓం అక్షమాలాధరాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం అక్షీణగుణభాసురాయ నమః

ఓం నక్షత్రగణ సంచారాయ నమః ఓం నయదాయ నమః ఓం నీతిమార్గదాయ నమః ఓం వర్షప్రదాయ నమః

ఓం హృషీకేశాయ నమః ఓం క్లేశానాశకరాయ నమః ఓం కవయే నమః ఓం చిన్తితార్థప్రదాయ నమః

ఓం శాస్తమతయే నమః ఓం చిత్తసమాధికృతే నమః ఓం ఆదివ్యాధిహరాయ నమః

ఓం భూరివిక్రమాయ నమః ఓం పున్యదాయకాయ నమః ఓం పురాణపురుషాయ నమః

ఓం పురుహోతాది సన్నుతాయ నమః ఓం అజేయాయ నమః ఓం విజితారాతయే నమః

ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః ఓం కుందపుష్ప ప్రతికాశాయ నమః ఓం అమన్దహాసాయ నమః

ఓం మహామతయే నమః ఓం ముక్తాఫలఫసమానాభాయ నమః ఓం ముక్తిదాయ నమః

ఓం మునిసన్నుతాయ నమః ఓం రత్నసింహసనారూఢాయ నమః ఓం రథస్థాయ నమః

ఓం అజతప్రభాయ నమః ఓం సూర్యప్రాగ్దేశ సంచారాయ నమః ఓం సురశత్రునుహృదే నమః

ఓం కవయే నమః ఓం తులావృషభారశీశాయ నమః ఓం దుర్ధరాయ నమః ఓం ధర్మపాలకాయ నమః

ఓం భాగ్యదాయ నమః ఓం భవ్యచారిత్రాయ నమః ఓం భవపాశవిమోచకాయ నమః

ఓం గౌడదేశేశ్వరాయ నమః ఓం గోప్త్రే నమః ఓం గుణినే నమః ఓం గుణవిభూషణాయ నమః

ఓం జ్యేష్టానక్షత్రసంభూతాయ నమః ఓం జ్యేష్టాయ నమః ఓం శ్రేష్టాయ నమః ఓం శుచిస్మితాయ నమః

ఓం అపవర్గ ప్రదాయ నమః ఓం సన్తానిఫలదాయకాయ నమః ఓం సర్త్వేశ్వర్యప్రదాయ నమః

ఓం సర్వ గీర్వాణ గుణసన్నుతాయ నమః శుక్ర స్తోత్రమ్ శృన్వంతు మునయస్సర్వే

శుక్రస్తోత్రమిదం శుభమ్, రహస్యం సర్వభూతానాం శుక్రప్రీతికరం పరమ్.

యేషాం సంకీర్తన ఐర్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్, తాని శుక్రస్య నామాని కథయామి

శుభాని చ. శుక్రస్శుభగ్రహస్శ్రీమాన్ వర్తకృద్వర్శవిఘ్నకృత్ తెజోనిధిరాజ్ఞానదయా యోగీ యోగవిదాం పరః

దైత్య సంజీవసత్రాంతో దైత్యనేత్రోశనా కవి: నీతికర్తాగ్రహాధీశోవిశ్వాత్మా లోకపూజితః

శుక్రమాల్యాంబరథః శ్రీ చందనసమప్రభః అక్షమాలాధరః కావ్యస్తపోమూర్తిర్థన ప్రదః

చతుర్వింసతినామాని అష్టోత్తరశతం యధా, దేవస్యాగ్రే విశేషేణ పూజాం కృత్యాం విధానతః

యఇదం పఠతి స్తోత్రం భార్గావస్య మహాత్మనః విషమస్టోపి భగవాన్ తుష్ట

స్స్యాన్నాత్రసంశయః స్తోత్రంభ్రుగోరిదమసంతగుణప్రదం యో భక్త్యా పఠేత

మనుజో నియతస్శాచిస్సన్ ప్రాప్నోతి నిత్య మాతులాం

శ్రియమీ ప్సితార్దాన్ రాజ్యం సమస్తధనధాన్యయుతం సమృద్ధిమ్.

(శుక్రం తే అన్య ద్యజితం తే అన్యద్విషురూపే అహనీ ద్యౌరివాసి, విశ్వాహి మాయా అవసి స్వధావో భద్రాతే పూషన్నిహ రాతిరస్తు.)

శుక్రమహ ర్దశలో చేయవలసిన దానములు

1. శుక్రమహర్దశలో శుక్ర అంతర్దశలో తెల్ల ఆవును దానం చేయండి.

2. శుక్రమహర్దశలో రవి అంతర్దశలో ధాన్యం దానం చేయండి.

3. శుక్రమహర్దశలో చంద్ర అంతర్దశలో మినుములు దానం చేయండి.

4. శుక్రమహర్దశలో కుజ అంతర్దశలో ఎద్దును దానం చేయండి.

5. శుక్రమహర్దశలో రాహు అంతర్దశలో గుమ్మడిపండును దానం చేయండి.

6. శుక్రమహర్దశలో గురు అంతర్దశలో గుమ్మడిపండును దానం చేయండి.

7. శుక్రమహర్దశలో శని అంతర్దశలో గేదెను దానం చేయండి

8. శుక్రమహర్దశలో బుధ అంతర్దశలో కొంత ధనం దానం చేయండి.

9. శుక్రమహర్దశలో కేతు అంతర్దశలో ధాన్యం దానం చేయండి

శుక్ర దోషం – పరిహారం – శాంతులు

1. ప్రతి శుక్రవారం దగ్గరలో ఉన్న మహాలక్ష్మీ దేవాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటలవరకూ 200 ప్రదక్షిణాలు చేయండి.

2. 20 శుక్రవారాలు నవగ్రహాలకు 200ప్రదక్షిణాలు చేసి 1.25 కే.జీ లు బొబ్బర్లు తెలుపు వస్త్రములో దానము చేయండి.

3. విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి దేవాలయమునకు వెళ్ళి దర్శించండి.

4. శుక్రవారం రోజున పేదలకు పాలు, పంచదార పంచండి.

5. కర్ణాటక రాష్ట్రంలో కొల్వాపూర్ మహాలక్ష్మి దేవాలయం దర్శించి బొబ్బర్లు చానం చేయండి.

6. వజ్రం (శ్వేత పుష్యరాగం) కుడిచేతి ఉంగరపు వెలికి బంగారంలో ధరించండి.

7. శుక్రగ్రహ జపం బ్రాహ్మణుడితో చేయించి బొబ్బర్లు దానం చేయండి.

8. శుక్రవారం నవగ్రహాలకు 20ఒత్తులతో దీపారాధన చేసి తెల్లటి వస్త్రాన్ని దానం చేయండి.

9. 20 శుక్రవారములు ఉపవాసం ఉండి చివరి శుక్రవారం లక్ష్మీపూజ, శుక్ర అష్టోత్తర పూజ చేయండి.

10. తమిళనాడులోని కంచనూరు దేవస్థానమును దర్శించండి.

11. మహాలక్ష్మి ఆలయం నందు పేదలకు, సాధువులకు ప్రసాదం పంచి పెట్టండి. శుక్రవారం అన్నదానం చేయండి.

12. శుక్రధ్యాన శ్లోకమును ప్రతిరోజూ 200మార్లు పారాయణం చేయండి.

13. శుక్రగాయత్రి మంత్రమును 20 శుక్రవారములు 200 మార్లు పారాయణం చేయండి.

14. శుక్రమంత్రమును 40 రోజులలో 20,000 మార్లు జపం చేయండి. లేదా ప్రతిరోజూ మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి.

15. తీరికలేనివారు కనీసం శుక్రశ్లోకం 20 మార్లు కాని, శుక్ర మంత్రమును 20 మార్లుగాని పారాయణ చేయండి.

16. దీపావళినాడు మహాలక్ష్మి అష్టకం 8 మార్లు పారాయణ చేయండి.