దుర్గ ప్రార్థనాస్
దుర్గ ప్రార్థనాస్
అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మలమూలపుటమ్మ చాల బె
ద్దమ్మసురారులమ్మ కడుపారాడి బుచ్చిన యమ్మదన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములనుండెడియమ్మదుర్గమ్మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
హరికింబట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంపు బెన్నిక్క చం
దురుతోబుట్టువు భారతీగిరి సుతల్తోనాడు పూబోడి దా
మరలండుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపుతల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
అష్టాదశ పీఠములు
లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురీ జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంభికా
కొల్హాపురీ మహాలక్ష్మీ, మాహూర్యే ఏకవీరకా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓడ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యే దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్య గౌరికా
వారణాసీ విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ పీఠాని యోగీనా మతి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం
సర్వ రోగ హరం దివ్యం సర్వ సంపత్క రం శుభం
శారదా స్తుతి
శంఖ త్రిశూల శరచాప కరాం త్రినేత్రాం
తిగ్మేతరాంసు విలసత్కీ రీటాం
సంహస్థి తామసుర సిద్ధ నుతాంచ
దుర్గాం దుర్గానిభాం నమామి
పార్వతీ ప్రార్థన
మృణాలవాల నిలయా వేణీ బంధ కపర్ధిని
హారాను కారిణి పాతు లీలయా పార్వతీ జగత్
వాగార్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
పార్వతీ దేవి ధ్యానశ్లోకం
సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసా ధకే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవిజ్ఞాన సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి
మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః
బాంధవా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్
పార్వతీ స్తోత్రమ్
ఓంకార పంజరశుకీం ఉపనిషదు ద్యాన కేళి కల కంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీమ్
లలితాపరమేశ్వరీ మహామంత్రం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః