Read more!

షిరిడీలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిందెవరో మీకు తెలుసా?

 

 

షిరిడీలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిందెవరో మీకు తెలుసా?

గుజరాత్ లో 1889వ సంవత్సరంలో జన్మించిన స్వామి సాయిచరణ్ మొట్టమొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి 1911లో బాబాను దర్శించుకున్నారు. ఒక కుండ చేత్తో పట్టుకుని కుష్ఠురోగులకు సపర్యలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ తండ్రి ఆజ్ఞతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా ఆనంద్ తో ఇలా అన్నారు ... "దేవుడు వున్నాడు ... లేడు అని అనకు''. అటు తరువాత 1912 జులై గురుపూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి "నువ్వంటే నాకు చాలా ఇష్టం''  అని చెప్పారు. అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా భక్తుల దగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలా సార్లు గమనించాడు. ఆ పరిశీలన, బాబా సాహచర్యంలో ఆనంద్, బాబా జీవితంలో అద్భుతాలు, ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని, తాను బాబాకు సన్నిహితంగా వుంటూ పరిశీలించినప్పటి విషయాలను పేర్కొంటూ మరొక పుస్తకాన్ని రచించాడు. బాబా మహాసమాధి అయిన తరువాత సాయి సంస్థానంలోని కార్యకలాపాల్లో ఆనంద్ చురుగ్గా పాల్గొనేవారు. 1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ ఆనంద్ చేతుల మీదనే జరిగింది. ఆనంద్ 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయి చరణ్ ఆనంద్ జీ గా మారి అందరి మన్ననలు పొందారు.