షష్టిపూర్తి ఎందుకు చేయాలి... ఎలా చేయాలి....
షష్టిపూర్తి ఎందుకు చేయాలి... ఎలా చేయాలి....
మనది ఎంతో పవిత్రమైన, ఆదర్సవంతమైన సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారములను, సంస్కారములను మనకు చెప్పియున్నారు. అట్టి సంస్కారములలో ఒకటి ఈ షష్టి పూర్తి మహోత్సవము. గతాన్ని ఒక్కసారి వెనుదిరిగి చూసుకొని , పగలు - పంతాలు మరచి పోయి, కోపతాపాలు ప్రక్కన బెట్టి. దూరమైన బంధువుల్ని, మరచి పోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి చేసుకొనే వేడుక షష్టి పూర్తి. అరవై సంవత్సరాల వయసంటే... ఎన్నో సంవత్సరాల దాంపత్యానుభవం... ఎంతో లోకానుభవం!.... కొడుకులు - కోడళ్లు, కూతుళ్ళు - అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, అన్నదమ్ములు, బంధువులు మిత్రులు.... ఇలా ఎందరో... వీళ్ళందరినీ ఒకసారి కలవాలి... అలా కలవాలంటే ఏదో ఒక వేడుక వేదిక గా అవ్వాలి అదే షష్టి పూర్తి వేడుక. మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు. షష్టిపూర్తి గురించి మీకు మరిన్ని విషయాలు తెలియాలంటే డా. ఎన్. అనంతలక్ష్మీ గారు చెప్పిన ఈ వీడియో చూడండి.... https://www.youtube.com/watch?v=n0qHT5vNUn4