సరస్వతి పుష్కరాలు

 

సరస్వతి పుష్కరాలు

 

 

పూర్వ కాలంలో పుష్కరుడు అనే బ్రా హ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యేక్షమై ఏదైన వరం కోరుకోమని అడుగు తాడు. అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాల తో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమ య్యేట్లు వరం ఇవ్వమని కొరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవు తారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నా యి.

 

 

బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుం టారు. కాలగమనంలో నవ గ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్తజ్ఞ్రులు, పంచాంగ కర్తలు, వేద పండితులు చెబుతుంటారు. బృహ స్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరం గా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్దతిలో పుష్కరాలను శాస్తజ్ఞ్రులు రూపొందించారు. అందులో భాగంగానే గురువు మేష రాశిలో ప్రవేశిస్తే గంగానదికి, వృషభ రాశిలో ప్రవేశి స్తే నర్మదా నది, మిథునంలో సరస్వతి, కర్కటంలో యము నానది, బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి, అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహితా నదికి పుష్కరాలు వస్తాయి

 

 

ముక్తీశ్వర లింగానికి వున్న నాసిక రంద్రాలగుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదిరూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో  కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడడం.  సరస్వతీ నది  గుప్త కామినిగా ప్రవహించడం (ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివ లింగం పై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కుద్వారా సేకరించి గోదావరి-ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది, శివుని ముక్కు నుండి గోదావరి-ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వార అంతర్వాహిని గా వెళ్ళే శివున్ని అర్చించిన జలమే సరస్వతి నది, అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి,  సరస్వతీ నదికి గుప్త కామినీ అను ఇంకో పేరు కూడా ఉంది. గుప్తంగా వచ్చి కలయుట, సరస్వతీ నది లుప్తమై, గుప్తనది గా ప్రవహించడం తో గుప్త కామినీ అనే పేరు వచ్చిందంటారు. పిఠాపురం, కాశీల వలె   కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం (కాశీ కి వెళ్ల  లేని వాళ్ళు ఇక్కడ గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు, ఇది కాశీ లో జరిపించినంత  పుణ్యమని చెప్తారు).

 

 

అలహాబాద్ లో గంగా యమున సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతి నది అంతర్వాహినిలా ఉండటం వలన కనపడదు.  ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించటానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీం నగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించటానికి నిర్ణయం జరిగింది.  ఆదిలాబాద్ నుంచే వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది.  అదే చోట అంతర్వాహినిలా సరస్వతి నది కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరుపబోతున్నారు. 12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాల వేడుకను మే 31 నుంచి జూన్ 10 వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి.

 

 

కరీంనగర్ జిల్లా లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం, కరీంనగర్ పట్టణం నుండి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం, కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి గోదావరి, ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది, ఇక్కడ శివలింగంతోపాటు యమలింగం కూడా ఉంటుంది. ఎందుకంటే, పురాతనకాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్ధించాడు, అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికని మన్నించాడు, అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలు ఉంటాయి. ఒకటి యమలింగం కాగా, మరొకటి శివ లింగం, కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే, శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు, కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర-ముక్తేశ్వర క్షేత్రం అంటారు, అయితే ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే ముందు యమున్ని ధర్శించుకున్నాకే, శివుని దర్శనం లభిస్తుంది.

 

 


అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం, పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు, అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది, సరస్వతిదేవి ఆలయాలు దక్షిణభారతంలో కేవలం రెండే ఉన్నాయ్, ఆ రెండింటిలో ఇది ఒకటి. అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడున్నది, అదే సూర్య దేవాలయం, ఆంద్ర ప్రదేశ్ లో కేవలం రెండే సూర్యదేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది. కాళేశ్వరంలో మరో ప్రత్యేకత కూడా ఉంది, ఇది త్రివేణి సంగమ పవిత్రభూమి, ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమిస్తాయి, ఇక్కడ మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి, అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అంటారు, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదుల పుష్కరాలు చాల వైభవంగా జరుగుతాయి.ఇక్కడ శివ రాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది.

 

 

‘‘మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపిచ
పూర్వేహ్ని సమయం తృత్యా తత్రాహ్న సంయతః శుచిః"

అంటే మాఘ శుక్ల పంచమినాటి ఉషోదయ కాలాన స్నానమాచరించి, పూజామందిరంలో పూజాపీఠంపై నూత్న వస్త్రాన్ని పరచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదళ పద్మాన్ని లిఖించి, వాగ్దేవి ప్రతిమనుంచి, కలశస్థాపన చేసి, దేవి సన్నిధిలో కలం, పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజగావించి, సరస్వతీదేవిని షోడశోపచార, అష్టోత్తరాలతో పూజించాలి. నివేదనగా ఆవుపాలతో చేసిన పాయసం సమర్పించాలి. శ్రీ పంచమిరోజున విద్యారంభం, విద్యాభ్యాసం, చేయడం శుభప్రదమని అక్షరాభ్యాసాలు చేయించడం, విద్యార్థినీ విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీదేవి ముందుంచి పూజించడంవల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిచెందుతారని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.

పుష్కర స్నాన మహిమ

“జన్మ ప్రబృకియత పాపం స్త్రియావ పురుషేణ
పుష్కర్యోమాత్రశ్య సర్వయే ప్రణశ్యతి”

 

 

 

పుట్టినప్పటి నుంచి స్త్రీ, పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతుందని, అంతేకాకుండా పూర్వ జన్మల పాపం, త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నియూ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేథయాగం చేసినంత పుణ్య ఫలితాన్నిస్తుంది. నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశిలో మరణం ఎంత మోక్ష ప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతారు. తొలిగా నదిలో దిగునప్పుడు రేగు పండంత మట్టి ముద్దలను నదిలో వేయాలి. హే… నదీమతల్లీ నీలో నేను స్నానమాచరిస్తున్నాను…. అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్ధన చేయాలి. నదికి నమస్కారం చేస్తూ….స్నానం చేసి తుంగభద్ర, వరుణ దేవునికి, బృహస్పతికి, విష్ణుమూర్తికి, భోళాశంకరునికి , బ్రహ్మాది దేవతలకు, వశిష్టాది మునులకు, గంగాది సర్వ నదులకు, సూర్యునికి ఆర్థ్యం ఇవ్వాలి.

 

 

నదిజలాలను మూడుసార్లు తీసుకుని ఒడ్డుకు వచ్చి నీళ్లలో నిలబడి శ్లోకాలను పటిస్తూ… కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడుసార్లు ఒడ్డుమీద పిండాలి. ధరించిన వస్త్రాలను వదులుకుని నూతన వస్త్రాలను లేదా పొడివస్త్రాలను ధరించాలి. అనంతరం సూర్య ధ్యానం చేయాలి. పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప, ధ్యాన, అర్చన, గాన, తర్పనాది అనుష్టానాలకు, పితృ పిండా ప్రధానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్పారు. ఈ కర్మల వల్ల శారీరక, మానసిక, బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి, పవిత్రులు, పుణీతులు, తేజోవంతులు, ఉత్తేజితులు అవుతారు. ఈ పుష్కర సమయంలో పసిడి, రజతం, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణాలు, ఔషధాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, తేనే, కూరలు, పీఠం, అన్నం, పుస్తకం మొదలైనవి వారి వారి శక్త్యానుసారం దానంగా ఇస్తే… సువర్ణ రజితులు, సుఖ సంతోషాలతో బోగ భాగ్యాలతో అలరారుతారు. భూదానం చేయడం వల్ల భూపతిత్వం, వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి కలుగుతుంది. గోవును దానంగా ఇస్తే… రుద్రలోకప్రాప్తి, నెయ్యిని దానంగా ఇస్తే… ఆయుస్సు వృద్ధి, ఔషధాన్ని దానంచేస్తే… ఆరోగ్యవంతులవుతారు. సాలగ్రామందానం చేస్తే… విశ్వలోకాల ప్రాప్తి,తిలదానం వల్ల ఆపదలు కలుగవు

 

 

 

More Related to Saraswathi Pushkar