Read more!

Controversy on Visakha Sai Baba Temple

 

సాయి మందిరంపై పెద్ద వివాదం

Controversy on Visakha Sai Baba Temple

 

Click here for the VIDEO

 

విశాఖపట్నం సీతమ్మధారలోని నార్త్ సాయి మందిరం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఎంతో ప్రశస్తమైన ఈ ఆలయం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఒక పీఠాధిపతి కారణంగా పీఠ(ట)ముడి పడినట్లయింది. వివరాలేంటో తెలుసుకుందాం.

 

ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే విశాఖపట్నం సీతమ్మధారలోని నార్త్ సాయి మందిరంపై స్వరూపానంద కన్ను పడింది. ఆయన మరెవరో కాదు. విశాఖ జిల్లా చిన ముషిడివాడ శారదాపీఠం అధిపతి. శారదా పీఠానికి సొంతంగా మఠాలున్నాయి. ఎప్పటినుంచో సాయి మందిరాన్ని సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తున్న పీఠాధిపతి స్వరూపానంద ఆశ నెరవేరింది. ఇప్పుడు నార్త్ సాయి మందిరం ఈయన పరమైంది.ఆదాయం వస్తున్నదేవాలయ అధికారాలను స్వరూపానందకు అప్పగించి చేతులు దులుపుకున్నారు అధికారులు.

నిజానికి సాయి మందిరంపై షిర్డీ సాయి ట్రస్టుకు మాత్రమే అధికారాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఆలయ అధికారాలను స్వరూపానందకు ఎలా అప్పగించారు? ఇది సాయి భక్తులకు మింగుడు పడటంలేదు. అసలు సాయిబాబా గుడిలో స్వామీజీ చిత్రపటాలు, ఫ్లెక్సీలు ఉండటం ఏమిటి, స్వామీజీ బాబాను మించినవాడా, బాబా గుడిలో బాబా చిత్రపటాలే ఉండాలి, ఈ ఆలయాన్ని శారదా పీఠానికి అప్పగించడానికి వీల్లేదు అంటూ పోరాటానికి దిగారు భక్తబృందం.

 

సాయిబాబా దేవాలయ వివాదం ఏమవుతుందో, ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే!


Sai baba temple belongs to Sharada Peeth, Visakha sai baba temple in controversy, visakhapatnam seetammadhara sai mandir, Controversy on Visakha Sai Baba Temple Video, seetammadhara north sai temple, visakha mushidiwada sharadapeeth, Controversy on Sai Baba Temple and sharadapeeth