రామాయణం చదివితే...

 

రామాయణం చదివితే...

 

 

బంధాలు,బాధ్యతల పట్ల మన తీరు తెన్నులు ఎలా వుండాలో ఆదికావ్యం రామాయణం మనకు బోధిస్తుంది. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణము పవిత్ర గ్రంథాలలో ఒకటిగా నేటికి కొనియాడబడుతోంది. హిందూ ధర్మ  చరిత్ర, సంస్కృతి,ఆచారాలపై గాఢమైన ప్రభావము కలిగి వుంది. రామాయణ గాథలోని పాత్రల ద్వారా ఆదర్శ జీవితం ఎలా వుండాలో మనం నేర్చుకోగలుగుతాము.  ఆదికావ్యం రామాయణం. రామాయణాన్ని చదవటం ద్వారా శత్రువులను అధిగమించవచ్చు. స్త్రీలు రామాయణాన్ని విన్నా, చదివినా, రాముడి వంటి పుత్రుడు కలుగుతాడు.  అదే పెళ్లికాని పడుచులు చదివినా, వినినా శ్రీరాముడి వంటి భర్త లభిస్తాడు.  ఇంకా దీర్ఘాయుష్షు, సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కలుగుతాయి.  రోగులు ఈ కావ్యాన్ని పఠించినా, ఆలకించినా దీర్ఘకాలిక రోగాలు ఉపశమిస్తాయి.  అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి.