సింహరాశి

 

స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022

సింహరాశిః- (మ, మీ,ము,మే,మో,టా,టీ,టు,టే)
ఈ అక్షరములు కల ఈ రాశి వార్కి ఆదాయం2, వ్యయం14, పూజ్యం2, అవమానము2. ఈ అక్షరములు గల ఈ రాశి వారి స్త్రీ, పురుష గుణములుః - విశాలహృదయము, అభిమానవంతులు పరోపకార గుణము కలవారు. పొగడ్తలకి లొంగిపోతారు. ఎంత త్వరగ కోపం వస్తుందో అంత త్వరగా కోపం పోతుంది. మర్యాద జరగకపోయినా పర్వాలేదు. కాని అవమానము మాత్రం జరిగితే సహించరు. అబిమానము, పట్టుదల, అదర్శము అందరిని మించవలెనను కుతూహలము చురుకుదనము తొందరపాటు పశ్చాతాపము, పరాక్రమ శాలురు అలంకారప్రియులు అహాంభావం ఎక్కువ, గర్వం తగ్గించుకుంటె రాణించగలరు. దృఢమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. గృహ అలంకరణయందు పరిశుభ్రంగా ఉంచుటలోను ఎక్కువ శ్రద్ధ వహించగలుగుతారు.

ఈ రాశి వారికి 7లో గురువు, 6లో శని, 10లో రాహువు, 4లో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపార వ్యవహరముల యందు జయము, ఉత్సాహము ధనలాభము, భూగృహ లాభము, నూతన గృహనిర్మాణము, స్త్రీ సౌఖ్యము సంతోషము, బంధుమిత్ర సమాగమము, రాజకీయ వ్యవహరముల యందు జయము. ఆరోగ్యము తేజస్సు యత్నకార్య సాఫల్యతయు, కుటుంబమున సౌఖ్యము, నూతన వ్యక్తుల పరిచయములు సహోదరులతో సహకారము, సంతానము జాయింటు వ్యాపారములు సక్రమంగా నెరవేరతాయి. కోర్టు వ్యవహరముల యందు జయము. విదేశి సంచారము, ఆస్థుల పంపకములు క్రయవిక్రయముల యందు జయము. విదేశి సంచారము, ఆస్థుల పంపకములు క్రయవిక్రయముల యందు లాభము, ఫైనాన్స్, బ్రోకర్లు, కాంట్రాక్టు రంగాల వారికి ఆదాయమేర్పడి మంచి సహకారం లభించును. మద్యం, ప్రత్తి వ్యాపారం వల్ల అధిక లాభములు కల్గి ఉత్సాహముతో ఉందురు. సినీరంగ, కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహు కల్గి ఆర్థిక సహాయము పొందుదురు. వైద్య న్యాయవాద ఇంజనీరింగ్ వృత్తుల వారికి ఆదాయము అధికము. అనుకున్న పనులు నెరవేర్చుకోగలరు. అకాల భోజనము పిల్లల పట్ల శ్రద్ద అవసరం. శరీరమున వాత రోగభయములు స్త్రీ మూలక కలహ కారణములు కలుగుటయు, శరీర బలము, పుణ్యతీర్థ సందర్శనము, వుబకార్యాచరణము, ధర్మకార్యాచరణము, ప్రజలలో మాట, పలుకుబడితనము సుగంధ లాభము, మధుర పదార్థ భక్షణము విందులు, వినోదములు, ఉల్లాసము, పురోహిత జ్యోతిష వాస్తు రంగాల వారికి కీర్తి ప్రతిష్ఠలధికము. తీర్థయాత్రత ఫలప్రాప్తియు, పరోపకార్యములు చేయుట మొదలగు శుభ ఫలితములుండును. ప్రతిరోజు సందరకాండ సంగ్రహము, శ్రీ రామ రక్షాస్తోత్రము పఠించిన మేలు కలుగును. ఈ రాశి వారికి ఆది, సోమ వారములు శుభప్రదము. 1,4,10,13,19,22 తేదీలు యోగ ప్రదములు. మఖ వారు వైడూర్యమును, పుబ్బవారు వజ్రమును, ఉత్తర వారు కెంపును ధరించి శుభ ఫలితములు పొంగలరు.

 

 

తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి