మకర రాశి - 2018-2019

 

మకర రాశి - (2018-2019)

 

మకర రాశి -  ఉ.షా 2,3,4 (భో,జా,జి)

శ్రవణం 1,2,3,4 (జూ,జె,జో,ఖ),ధనిష్ఠ 1,2 (గా,గీ)

ఆదాయము 8  వ్యయం 14  రాజపూజ్యం 4 అవమానం 5

    ఈ రాశి వారికి 11-10-2018 వరకు గురువు 10వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 11వ స్థానంలో తదుపరి వత్సరాంతం 12వ స్థానంలో ఉండును. శని వత్సరమంతా 12వ స్థానంలో, రాహు, కేతువులు 7-03-2019 వరకు 7, 1 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 6, 12 స్థానాల్లో ఉందురు.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావము ఉన్నమా సంవత్సర ఉత్తరార్థములో పనులు ఆలస్యంగానైలి పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత చికాకు ఉన్ననూ ఏదో విధంగా ధనం చేతికందుతుంది. విపరీత మైన మానసిక సంఘర్షణ లోనవుతారు. ఏదొక తెలియని అభద్రత ఏర్పడుతుంది. మీ ముందు నిలిచి మాట్లాడి లేని వారు కూడా మీకు సలహాలు ఇవ్వటము, పరోక్షముగా విమర్శించుట ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. కాలవైపరీత్యము ఈ విధంగా ఉంటుందా అని నిర్వేదానికి లోనవుతారు. వ్యాపారస్తులు అధిక శ్రమచేత పనులు పర్తి చేసుకుంటారు. ప్రలోభాలకు లొంగి దాచిన ధనం వృద్ధి చేసుకోకూడదు క్రొత్తది సంపాదించుకున్నా, ఉన్నది కాపాడుకోవడం ఉత్తమమని గ్రహించండి.

    ఉద్యోగస్తులు అనవసర విషయాలపై ఆసక్తి చూపకండి, తొందరపడి అత్యుత్సాహంతో మీ అధికారులు పట్లగాని, మీ యాజమాన్యం పై పట్లగాని అనుచితముగా మాట్లాడకండి, మాట పెదవి దాటితే వృధికి దాటుతుందని గ్రహించండి. మాటలు చేరవేచే వారుంటారు. తస్మాత్‌ జాగ్రత్త, తమ సంతానం ప్రయోజకులుగా ఉంటారు. తాము కోరుకున్న విద్యా సంస్థలలో తాము కోరుకున్న కోర్సులలో ప్రవేశాలు లభించ వచ్చును. విద్యార్థులకు ద్వితీయార్థము మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నిత్యం ప్రత్యేక శనిస్తోత్రము శ్రీ హేమశ్రీవ స్తోత్ర పారాయశము చేయండి. ధార్మిక సేవా, సామాజిక సేవా కార్యక్రములు నిర్వహిస్తారు. అందిన ధనాన్ని సద్వినియోగపరుస్తారు. దైవ సంబంధిక కార్యక్రమాలలో ఆగుశ్రద్ధ చూపి అనిదులో నిమగ్నమవుతారు. తల్లి గారి ఆరోగ్య విషయంలో ఔషద సేవనం, వైద్యుణ్ణి సంప్రదించుట, ఒక సమయంలో కాస్త ఆందోళన. అడగకుండా అప్పు ఇస్తున్నారని అత్యాసకు పోయి అనర్థాలకు ఆహ్వానించకండి. మీ నుంచి సహాయం పొందిన వారి నుండి మరల వారి నుండి అనుకూల స్పందన రాకపోవడం ఆవేదనకు గురిచేస్తుంది. కోర్టు వ్యవహారాలు మిశ్రమ ఫలంగా మధ్యే మార్గంగా పరిష్కారమవుతాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి. పోటీ పరీక్షలలో విజయం మీ చెంతనే ఉంటుంది. ఉద్యోగస్తులు తమకు లభించిన ఉద్యోగాలను కాపాడుకోవాలి. తొందరపడి చెప్పుడు మాటలు విని రాజీనామ చేయరాదు. స్త్రీలు ఆవేశం తగ్గించుకోవాలి. గర్భిణులు వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన మార్పు కనపరుచున్నది. ఉత్తరార్థంతో గృహ నిర్మాణ ఆలోచనలు సార్థికత.

    నూతన పరిచయాలు ఏర్పడతాయి. జీవితంలో ఆత్మస్ధైర్యము. ధైర్యము పెరుగుతుంది. ఎలర్జీ వంటి సమస్యలు బాధించవచ్చును.  సమస్య కొంత దీర్ఘకాలికంగా ఉండవచ్చును. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకింత ధనవ్యయము, వీరికి తాంత్రిక, నరఘోష మొదలైన  క్షుద్ర విద్య బాధితులు అయ్యే అవకాశము గలదు. నిత్యము శ్రీలక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రము పారాయణం చేయండి. అనేకమైన దృష్టశక్తుల నుండి విముక్తి పొందండి. సంవత్సరాంతంలో గర్భధారణ సమస్యలు, విషజంతు పీడయు, నిర్లక్ష్యము, కంటి మరియు దంత సమస్యలు బాధించుట, ఇతరులచే మోసగింపబడుట, అన్యస్త్రీ వివాదములు, కుటుంబములో తరచ అకారణ కలహాలు, స్థలమార్పు గోచరించుచున్నది. రక్త సంబంధీకులకు అనారోగ్య సూచనలు, మధ్యవర్తుల ద్వారా అపోహలు, చెప్పుడు మాటలు వినుటద్వారా మానసిక అశాంతి కాళ్ళకు, పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. వానములు నడుపునపుడు జాగ్రత్త. అయినా కొద్దిపాటి సమస్యలు ఎదురైనన గతము అనుభవాల ప్రభావం చేత ఎత్తుకుపై ఎత్తులు వేసి ఆర్థికముగా అభివృద్ధి చెందుతారు. వృత్థి పరముగా వృద్ధిలోకి వస్తారు. మేన మామలకు ఆరోగ్యములో కొంత చికాకు కనిపించుచున్నది. పాండిత్య ప్రతిభ పెరుగుతుంది. గొప్ప పండితుడిగా చెలామణి అవుతారు. ఋణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాలలో ప్రవేశిస్తారు. సేవ చేస్తారు. ఒక ప్రాణ స్నేహితునికి మీ సహాయము అవసరమవుతుంది. సహాయము చేస్తారు. కోర్టులలో ఉన్న దంపతుల సమస్యలు మధ్యమార్గంగా పరిష్కరించుకుంటారు. మొండి పట్టుదలల చేత దాంపత్య సమస్యలు మీకై మీరు సృష్టించుకో కూడదు. జ్ఞాపకశక్తి తగ్గడం అపనిందలు, భరించవలసివచ్చును. సమస్యలు  వత్సరాంతంలో సంభవించవచ్చును. చేయని దోషమునకు మీరు సంజాయిషీ చెప్పుకోవడం బాధ కల్గించును. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారము లభిస్తుంది. విదేశీయానము కొరకు ప్రయత్నాలు శ్రద్ధగా చేయండి. ఫలితము లభిస్తుంధి. పోటీ పరీక్షలలో చక్కని విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల పరిపూర్ణ సహకారాన్ని పొందుతారు. ప్రభుత్వపరమైన కాంట్రాక్టులు లభిస్తాయి. ఖర్చులను నియంత్రించుకొనుట ఉత్తమము. అధికాశతో వివాదస్పదమైన ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. తస్మాత్‌ జాగ్రత్త. తమ సంతానానికి శుభకార్యాచరణ. తన కోపమే తన శత్రువని తెలుసుకోవాలి. ఆవేశము అనర్థానికి కారణం కావచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది తాము కోరుకున్న స్థానాలలో ప్రవేశము లభించగలదు. వ్యవసాయదారులకు అనుకూలముగా ఉన్నది. మీ పరిచయానికి, స్నేహానికి ఇతరులు ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. సంతానం యొక్క పురోగతి సంతృప్తి కరముగా ఉంటుంది. కన్యాదాన ఫలం దక్కుతుంది. ఉద్యోగములో ఉన్నతస్థానానికి వెళ్ళగలరు. కాని ఒకింత ఓపిక అవసరము. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. కనుక తమ భావాన్ని అభిప్రాయాన్ని ఎదుటి వారు అర్థం చేసుకునే రీతిలో సాత్వికంగా తెలియజేయండి. విమర్శించే వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నము చేయండి. సాటి వారి ముందు మీరు ఏమిటీ నిరూపించుకోవాలనే తపన పెరుగుతుంది. ఆ దిశలో ముందడుగు వేస్తారు. మంచి ప్రయోజనాలకై ధనవ్యయం చేస్తారు.

    గతం చాలా రోజులు నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిది  కాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్‌ జాగ్రత్త. పనిభారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడా ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్నెట్‌ ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారి కోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు.  కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి. అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి బందువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణమవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుటి వారి ముందు తాము ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు. ధనం సంపాధించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే  అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రమోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువ స్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పుకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరుచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి, బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలు. ఆస్తులు వివాదాస్పదమగుట, వంశపారంపార్య ఆస్తుల విషయంలో కలహాలు, కోర్టు గొడవలు కోరికలు పూర్తిగా తీరకపోవుట. భవిష్యత్తు గురించి ఉజ్జ్వలమైన భవిష్యత్తు గలదని చక్కని దారులు గలవని ఆ దిశలో ఆలోచిస్తారు. అవకాశాలు వస్తాయి. గోసేవ, మహాలక్ష్మి స్తోత్ర, శ్రీ సుందరకాండ పారాయణం, శని, రాహు, కేతు కుజ ధ్యాన శ్లోకాలు పఠించుట వల్ల మేలు జరుగుతుంది. వృద్ధులకు సహకరించండి. మాతాపితరులను గౌరవించండి. వృక్ష సేవ చేయండి పర్యావరణాన్ని రక్షించండి. బిల్వ వృక్షాన్ని పోషించండి.

    ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. స్నేహితుల విషయంలో జాగ్రత్త అవసరం. దుర్జన సాంగత్యము కలదు. వివాహ ప్రయత్నాలు సఫలం కావటానికి విపరీతముగా కృషి చేయవల్సి వస్తుంది. భార్య ఆరోగ్య విషయంలో అజాగ్రత్త ఏమాత్రము పనికిరాదు. ఎలర్జీ సమస్యలు బాధింపవచ్చును. అయినను సంవత్సరం చివరిలో ఆర్ధిక లాభము, ఉద్యోగములో ప్రమోషను, స్థానచలనము జరుగవచ్చును. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైన అపోహలు ఏర్పడే అవకాశము కలదు తస్మాత్‌ జాగ్రత్త.

 

 

 

 

 

More Related to Rasi Phalalu 2018 - 2019