కృష్ణాష్టమి రోజు రాధా చాలీసా పఠిస్తే జరిగేదేంటి!
కృష్ణాష్టమి రోజు రాధా చాలీసా పఠిస్తే జరిగేదేంటి!
తెలుగు పంచాంగంలో చాలా తిథులకు ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా దేవతలు జన్మించారని చెప్పబడే షష్టి, అష్టమి, చవితి వంటి తిథులకు ఆయా మాసాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆగస్టు 26 వ తేదీన కృష్ణాష్టమి జరుపుకోకున్నారు. ఈరోజున శ్రీకృష్ణుడు జన్మించాడని. ఈరోజు కృష్ణుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రాధా చాలీసా పఠిస్తే చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. కృష్ణాష్టమి రోజు రాధా చాలీసా పఠిస్తే జరిగేదేంటో తెలుసుకుంటే..
శ్రీకృష్ణునికి, రాధా దేవికి మధ్య ఉన్న సాన్నిథ్యం, వారిద్దరి మధ్య ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ మాటల్లో చెప్పలేనిది. కృష్ణుడినే తన ఊపిరిగా చేసుకుని బ్రతికినది రాధా దేవి అయితే.. సృష్టిలో రాధాదేవి అంత స్వచ్చమైన ప్రేమ లేదని గుర్తించి, ఆ ప్రేమకు దాసోహమైనవాడు కృష్ణుడు.
కృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుని కృప కోసం కృష్ణునికి ఇష్టమైన వంటకాలు చేస్తారు. తీపి పదార్థాలు కృష్ణునికి నివేదిస్తారు. అంతేనా స్వామి అనుగ్రహం కోసం శ్రీకృష్ణ గీతాలు, స్తోత్రాలు పఠిస్తుంటారు. అయితే ఈరోజు శ్రీకృష్ణ స్తోత్రాలు, గీతాలతో పాటూ రాధా చాలీసా పఠించాలి. రాధా దేవిని కీర్తిస్తే శ్రీకృష్ణుడు తృప్తి చెందుతాడు. కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి.
జన్మాష్టమి రోజు వివిధ ప్రాంతాలలోని శ్రీకృష్ణ దేవాలయాలలో వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా చిన్ని కృష్ణునికి పూజలు చేస్తారు. చాలామంది తమ పిల్లలకు కృష్ణునిలా అలంకరించి కృష్ణుడే తమ ఇంట్లో నడయాడినట్లు మురిసిపోతారు.
*రూపశ్రీ.