ప్రదోష వ్రతం గురించి విన్నారా...ఇందులో శివుడికి ఏం సమర్పించాలో తెలుసా?
ప్రదోష వ్రతం గురించి విన్నారా...ఇందులో శివుడికి ఏం సమర్పించాలో తెలుసా?
ప్రదోషకాలం గురించి చాలామందికి తెలియదు. కానీ ఈ మద్యన ప్రదోషకాల పూజ గురించి, ప్రదషకాల వ్రతం గురించి చాలా వైరల్ అవుతోంది. ప్రదోష కాలంలో శివుడిని పూజిస్తారు. అసలు ప్రదోషకాలం అంటే ఏమిటి? ప్రదోషకాలంలో శివుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రదోషకాల పూజలో శివుడికి ఏం సమర్పించాలి? తెలుసుకుంటే..
ప్రదోషకాల వ్రతం..
హిందూ సంప్రదాయంలో ప్రదోష ఉపవాసానికి, ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రదోష సమయంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు, పార్వతి దేవిలను పూజిస్తారు. పంచాంగం ప్రకారం ప్రదోష వ్రతం మార్గశిర మాసంలో ఉంది. నవంబర్ 28 వ తేదీన ప్రదష వ్రతం ఆచరిస్తారు. ఇది మార్గశిర మాసంలో వస్తుంది. ఈ సమయంలో శివ పూజ చేయడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు.
సమయం ఎప్పుడు..
పంచాంగం ప్రకారం ప్రదోష వ్రతం నవంబర్ 28 వ తేదీ ఉదయం 6 గంటల 23 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. 29 వ తేదీ ఉదయం 8గంటల 39 నిమిషాలకు ముగుస్తుంది. ఈ రోజు శివుడిని పూజించేటప్పుడు కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల శివుడు ప్రసన్నుడు అవుతాడని, భక్తులను అనుగ్రహిస్తాడని అంటారు.
ప్రదోష వ్రతం రోజున శివుడిని పూజించేటప్పుడు నెయ్యి, తేనెను సమర్పించడం శ్రేయస్కరం. దీని వల్ల భక్తుల జీవితంలో దేనికీ లోటు ఉండదట. అలాగే చెరకు రసాన్ని, బెల్లాన్ని సమర్పించినా ఆ శివయ్య సంతోషిస్తాడు. చెరకు రసం, బెల్లం సమర్పిస్తే పేదరికం తొలగిపోయి, ఐశ్వర్యం లభిస్తుంది.
కుంకుమ పువ్వును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీన్ని పరమేశ్వరుడి పూజలో వినియోగిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కుంకుమ పువ్వును సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయట. సంబంధాలు చాలా సంతోషంగా, ఎలాంటి చీకుచింతా లేకుండా ఉంటాయట.
ఫలితాలు..
ప్రదోష వ్రతంలో శివుడికి పై వస్తువులను తప్పకుండా సమర్పిస్తే ఏ పని తలపెట్టినా సరే.. ఆ పనిలోో విజయం సాధిస్తారట. అలాగే ఏవైనా మధ్యలో ఆగిపోయిన పనులు తిరిగి వేగం పుంజుకుంటాయట. అవన్నీ వేగంగా పూర్తవుతాయట.
*రూపశ్రీ.