Read more!

Wonders with Panchaloha

 

పంచలోహాలతో మహాద్భుతాలు చేయొచ్చు

Wonders with Panchaloha

 

బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుము, - వీటిని పంచలోహాలు అంటారు. ఈ అయిదు లోహాలను కరిగించి దేవుని విగ్రహాలు తయారు చేసే సంప్రదాయం మన హిందూ తత్వంలో ఉంది. కొందరు పంచలోహాలతో ఆభరణాలు కూడా చేయించుకుంటారు. ఈ లోహాల్లో ప్రాణశక్తి నిక్షిప్తం చేసే వీలు ఉంది. అందువల్లనే పంచలోహాలకు దివ్యత్వం కలిగింది. సాంకేతిక నైపుణ్యం పెరిగిన తర్వాత రకరకాల అయస్కాంత శక్తుల గురించి స్పష్టంగా తెలుసుకుంటున్నాం. నిజానికి ఎన్నో శతాబ్దాల క్రితమే మన మహర్షులు మెరుపుల్లో, వస్తువుల్లో, మానవ శరీరంలో అంతర్లీనంగా ఉండే అయస్కాంత శక్తులు, విద్యుత్ తరంగాలను కనుగొన్నారు. వాటన్నిటికీ సిద్ధాంత పరమైన సూత్రీకరణలు తంత్ర శాస్త్రంలో లభ్యమౌతున్నాయి. ఆ శక్తులు, సూత్రాలు మనలాంటి సామాన్యులకు అంత సులభంగా అర్ధం కాకపోతేనేం.. వాటిని శతాబ్దాల క్రితమే ఏ సాంకేతిక పరికరాలూ లేని కాలంలోనే కనిపెట్టిన మన ఋషులు ఎంత విజ్ఞాన గనులో కదా!

మహర్షులు గాలి, నేల, ఆకాశం, గ్రహాలూ, నక్షత్రాలు - ఇలా ప్రతిదాని గురించీ వివరించారు. వాటివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎప్పుడు ఏవిధంగా హాని జరిగే అవకాశం ఉందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలో విశదపరిచారు. కాకపోతే మనమే మహర్షులు చెప్పిన అనేక అమూల్యమైన విషయాలను మూఢాచారాల కింద తీసిపడేస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాం.

పంచలోహాల విగ్రహాన్నే తీసుకుంటే.. అది మహత్తరమైంది అని మన పెద్దలు సెలవిచ్చారు. కారణం ఈ లోహాల్లో ప్రాణశక్తిని ప్రతిష్టించేవారు. మహర్షులు తమ తపోశక్తిని కేంద్రీకరించి పంచలోహాల్లో ప్రవేశపెట్టేవారు. ఆయా లోహాల్లో విడివిడిగా కంటే అవన్నీ కలిసినప్పుడు ఏర్పడిన మిశ్రిత లోహంలో మనశ్శక్తిని ప్రవేశపెట్టడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. తపస్సంపన్నులైన ఋషులు మిశ్రమ లోహాలను అనేకసార్లు చూడటం లేదా స్పృశించడం ద్వారా ఆయా లోహాల్లో ఒక మహత్వ శక్తి చేరుతుంది. అలా ఆయా లోహాల్లో ఆకర్షణ శక్తి పెరగడం, కనిపించని శక్తి వాహకాలు ప్రవేశించడం జరుగుతుంది.

ఇప్పుడు మనకు జెనరేటరు, రిమోట్ కంట్రోల్ లాంటి అనేక పరికరాలు వచ్చాయి. కానీ పూర్వం ఇవేవీ లేవు. నూనె దీపాలు తప్పిస్తే విద్యుత్ బల్బులే లేవు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన యంత్ర పరికరాలు ఏవీ లేవు. కానీ మహర్షులు తల్చుకుంటే ఏదయినా చేయగలిగేవారు. అది కనికట్టు కాదు. కూర్చున్న చోటనే ఉండి ఎక్కడ ఏం జరుగుతోందో చెప్పగలిగేవారు. కంటి చూపుతో వస్తువుల్లో స్థాన చలనం కావించేవారు. వారి చూపులే రిమోట్లలా పనిచేసేవి. వారి మనోసంకల్పం అంత మహత్తరమైంది. పంచాలోహాల్లో తపశ్శక్తి ప్రవేశపెట్టడంవల్ల వాటికి అద్భుతమైన, అగోచరమైన మహా శక్తి లభించేది. అందుకే పంచ లోహాలతో రూపొందిన విగ్రహాలను ప్రత్యక్ష దైవంగా భావించేవారు.

చెకొస్లోవేకియా శాస్త్రజ్ఞుడు రాబర్ట్ పావ్లిటా మనశ్శక్తిని కేంద్రీకరించడం ద్వారా రాయి, ఉక్కు, కంచు, రాగి, ఇనుము, బంగారాల్లో ప్రాణశక్తిని నిలవచేసే పద్ధతిని కనుగొన్నారు. ఇలా శిలలు, లోహాల్లో ప్రాణశక్తిని ప్రవేశపెట్టే పద్ధతికి Psychotronic Generaters అంటూ పేరు పెట్టారు. పావ్లితా ధాతు రసాయన శాస్త్రంలో ప్రతిభావంతుడు. అతడు విస్తృత పరిశోధనలు జరిపి లోహాన్ని అనేకసార్లు పట్టుకోవడం ద్వారా లేక, డాన్ని రెప్ప వాల్చకుండా తీక్షణంగా చూడటం ద్వారా అందులో ఒక మహా శక్తిని కేంద్రీకరించావచ్చునని రుజువు చేశాడు. అలా చేయడంవల్ల ఒక అగోచరమైన మహా శక్తి ఆ ధాతువుపై పేరుకుని, డాన్ని ఆకర్షిస్తుందని ఆయన ప్రయోగాల ద్వారా నిరూపించారు. అది విద్యుత్తు స్థిర శక్తి కాదని వివరించారు. కారణం Static Electricity నీళ్ళలో పనిచేయదు. కానీ పావ్లీటా నిక్షిప్తం చేసిన లోహాకృతులు నీళ్ళలో కూడా పనిచేశాయి.

పంచ లోహాలతో రూపొందిన విగ్రహాలు, పాత్రలు ఎవరూ కదిలించకుండానే కదిలిన సంఘటనలను శాస్త్రవేత్తలు ఉదాహరణలుగా చూపారు. చెకొస్లోవేకియా హ్రదియోక్రేలోనే యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ పావ్లిటా రూపొందించిన లోహ సామగ్రి సాయంతో ఎన్నో ప్రయోగాలు చేశారు. జెనరేటర్ ను, ఎలక్ట్రిక్ మోటారు సాయంతో నడిచే చిన్న ఫ్యానును ఒక పెట్టెలో ఉంచి సీలు వేశారు. పావ్లీటా అక్కణ్ణించి 6 అడుగుల దూరంలో నిలబడి తన జెనరేటర్ మీద దృష్టి కేంద్రీకరించి ప్రాణశక్తిని నిక్షిప్తం (చార్జ్ చేశాడు) చేశాడు. కొన్ని క్షణాల్లోనే పంఖా రెక్క సైకోట్రానిక్ జెనరేటర్ నుంచి విడుదలైన శక్తి సాయంతో ప్రభావితం అయినట్లు వేగం తగ్గి తిరగసాగింది. క్రమంగా చలనం నిలిపి, తిరిగి దానికి వ్యతిరేక దశలో తిప్పాడు. చాలాకాలం ఈ శక్తిని ఎలా కనిపెట్టారో, దాని మర్మం ఏమిటో, ఎలా పనిచేస్తోందో, దాని రహస్యం ఏమిటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. చివరికి స్వయంగా పావ్లీటాయే ''ఇదంతా భారతీయుల తంత్ర శాస్త్రం నుండి నేర్చుకున్నా''నని అసలు రహస్యాన్ని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఆయుర్వేద చికిత్స ఎంత గొప్పదో ఇతర దేశాలవాళ్ళు చెప్పాకగానీ మనం గుర్తించలేకపోయాం. అలాగే లోహాల్లో ప్రాణశక్తి ప్రతిష్ఠించి మహాద్భుతాలు చేసే విద్యలో మనవాళ్ళు దిట్టలు అనే సంగతి విదేశీయులు చెప్తేగానీ మనకు తెలీకపోవడం ఎంత బాధాకరం?!

 

Powerful Panchaloha Idol, panchaloha murthy, gold silver copper iron and bronz metals panchaloha, panchaloha and mystic power