శ్రేయస్సుని కలిగించే లక్షణాలు
శ్రేయస్సుని కలిగించే లక్షణాలు
ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం
కాలే శక్య్తా ప్రదానం యువతిజనకథా మూకభావః పరేషామ్ ।
తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ భూతానుకంపా
సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాః ॥
జీవహింసను విడనాడటం, పరుల ధనం యందు నిగ్రహాన్ని పాటించడం, సదా సత్యాన్నే పలకడం, అవసరాన్ని అనుసరించి శక్తి కొలదీ దానం చేయడం, పరస్త్రీల గురించి మాట్లాడకపోవడం, అత్యాశను విడనాడటం, గురువుల యందు వినయంతో ప్రవర్తించడం, సమస్త ప్రాణుల పట్లా కరుణతో మెలగడం, సర్వ శాస్త్రాల పట్లా సమత్వాన్ని కలిగి ఉండటం అనే లక్షణాలు శ్రేయస్సుని కలిగిస్తాయి.