విజయం చేకూర్చే పసుపు కేరువామాల
రుద్రాక్ష మాల మాదిరిగానే, పసుపు కేరువా మాలను కూడా పరమ పవిత్రమైందిగా భావిస్తారు. పసుపు కేరువామాల చేపట్టిన పనిలో విజయం చేకూరుస్తుంది. గణపతికి ఈ కేరువా మాల అంటే మహా ఇష్టం. పార్వతీదేవి నలుగుపిండితో గణపతిని రూపొందించిన సంగతి మనకు తెలుసు. నలుగుపిండి పసుపే కదా!. కనుక పార్వతీదేవికీ, గణపతికీ కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పసుపు కేరువా మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
-->శక్తికి ప్రతిరూపమైన కేరువామాల ఇంట్లో ఉంటే పార్వతీ, గణేశులను ఇంట్లో ప్రతిష్టించు కున్నట్టే. -->పసుపు కేరువామాల జపాన్ని ఏదైనా మంచిరోజు చూసుకుని మొదలుపెట్టడం మంచిది. అక్షయ తృతీయ రోజు అయితే మరీ ఉత్తమం.
-->కేరువామాలను చేతిలో ఉంచుకుని “ఓం గ్లౌం గణపతయే నమః” అని స్మరిస్తూ పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలూ ఏర్పడవు. పసుపు కేరువామాలతో విజయం సొంతమౌతుంది.
-->కేరువామాల ఒక్కో పూసనూ తిప్పుతూ “ఓం గ్లౌం గణపతయే నమః” మంత్రాన్ని 108 సార్లు జపిస్తే గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది.
-->పసుపు కేరువామాలను తరచూ కడగడం వల్ల దాని మెరుగు, సొగసు తగ్గిపోతుంది. అందువల్ల జపం చేసేముందు సంకల్ప సిద్ధితో ఈ మాలపై మంత్రోదకాన్ని చిలకరిస్తే సరి. శుద్ధి చేసినట్లూ అవుతుంది, ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
-->జపం పూర్తయిన తర్వాత కేరువా మాలను తీసి ఎక్కడో పెట్టకూడదు. పసుపు కేరువామాలను పూజా మందిరంలో, దేవుడి వద్దనే ఉంచాలి.