పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు ?
పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు?
తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి, కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవిల్ లు పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు.
తిరువణ్ణామలై లో పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు గా వెలిశాడు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తాడు.
శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు వాయులింగ రూపంలో దర్శనమిస్తాడు.
కాంచీపురంలో ఏకామ్రేశ్వర్ గా కొలువై పృధ్విలింగ రూపంలో దర్శనమిస్తాడు.
చిదంబరంలో ఆకాశ (నిరాకార) రూపంలో దర్శనమిస్తాడు.
తిరువనైకోవిల్ (జంబుకేశ్వర్)లో జలలింగం రూపంలో దర్శనమిస్తాడు.
తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవిల్ లు తమిళనాడులో ఉంటే, శ్రీకాళహస్తి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది.