అతి వీడకపోతే అనర్థాలే
అతి వీడకపోతే అనర్థాలే
అతి వినయం ధూర్త లక్షణం అనే మాట వినే వుంటాం. ఎక్కువ వినయంగా నటించే వారు మంచివారు కాదనే అర్థంలో దీనిని వాడుతుంటారు. వినయమే కాదు ఏ విషయం, అంశంలోనైనా "అతి"గా వ్యవహరించడం విపరీత అర్థాలకు, దుష్పలితాలకు, దుష్పరిణామాలకు, విపత్తులకు దారి తీస్తుంది. మన పురాణాల్లో దీనికి సంబంధించిన నిదర్శనాలు ఎన్నో వున్నాయి.
- అతిగర్వం వల్ల శ్రీరాముడి చేతిలో రావణుడు మరణించాడు.
- కొడుకు దుర్యోధనుడిపై దృతరాష్ట్రునికి గల అతి ప్రేమ కురువంశ నాశనానికి కారణమయ్యింది.
- అతిగా తినటం వలన అనేక అనారోగ్యాలు కలిగి ఆయుష్షు తగ్గుతుంది.
- అతిగా మాట్లాడే వారిపై గౌరవభావం సన్నగిల్లుతుంది. తొందరగా చులకన పాలవుతారు.
- అతి దానం వల్ల బలి చక్రవర్తి, కర్ణుడు నష్టపోయారు.
- ధనం, కీర్తి, అధికారం ఇలా దేని గురించి అతిగా ఆశపడిన అనార్థాలే కలుగుతాయి. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు.