Read more!

Kolar Kurudumale Maha Ganapati Temple

 

కురుడుమాలే మహా గణపతి ఆలయం

Kolar Kurudumale Maha Ganapati Temple

 

కర్ణాటక రాష్ట్రంలో, కోలార్ జిల్లాలో ఉన్న కురుడుమాలే మహా గణపతి ఆలయం గురించి ఎక్కువమందికి తెలీదు కానీ చూస్తే మట్టుకు జీవితం ధన్యమైనట్లే. అసలు ఈ మహా గణపతి ఆలయంలో కాలు పెట్టగానే మనలో గొప్ప ప్రశాంతత కలుగుతుంది. మాటలకందని దివ్యానుభూతి సొంతమౌతుంది.

కురుడుమాలే అనే పదం కూడు, మలై అనే పదాల ఆధారంగా ఏర్పడింది. ''కూడు'' అనే పదానికి తమిళంలో కలయిక అని అర్ధం. మలై అంటే కొండ అని అర్ధం. కన్నడ దేశంలో ఉన్న కొండకు తమిళ పేరు ఎందుకు పెట్టారో తెలీదు. బహుశా అక్కడ కొందరు తమిళులు స్థిరపడి ఉండొచ్చు. మొత్తానికి దేవుళ్ళందరూ ఈ కొండమీద కలిసి మీటింగ్ పెట్టుకునేవారట. ఈ కురుడుమాలే కొండమీదే దేవుళ్ళు ఉత్సాహం పొంది, ఉత్తేజితులయ్యేవారట. ఇది స్థలపురాణం చెప్తోన్న కధనం.

కురుడుమాలే కొండ చాలా అందంగా ఉంటుంది. ఈ కొండ రాళ్ళు మహా సుందరంగా ఉంటాయి. కురుడుమాలే కొండ, ఆ పరిసరాలు, అక్కడి ప్రశాంతత అన్నీ మహదానందం కలిగిస్తాయి. ఆ సౌందర్యాన్ని చూట్టానికి రెండు కళ్ళూ చాలవు. ఎవ్వరికైనా సరే ఇక్కడ అడుగు పెడితే చాలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. ఈ వాతావరణం ఎంతో అసాధారణంగా, అపురూపంగా ఉంటుంది.

కురుడుమాలే మహా గణపతి ఆలయంలోని విగ్రహం చాలా పెద్దది. 13.5 అడుగుల ఎత్తయిన మహా గణేశుని విగ్రహాన్ని చూస్తే మాటలు రావు. కళ్ళు ఆనందభాష్పాలతో నిండుతాయి. ఇహలోక ప్రపంచాన్ని మర్చిపోతాం. ఒక అలౌకిక ఆనందాన్ని పొందుతాం.

కురుడుమాలే మహా గణపతి ఆలయానికి అసలుసిసలైన విశిష్టత ఉంది. అదేమిటంటే మహా గణపతి దీవెనలు పొంది ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే సంకల్పంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారట.

 

Karnataka Kurudumale Maha Ganapati Temple, huge idol at kurudumale temple, rare ganesha temple kolar dt, auspicious ganesh temple at kurudumale, 13.5 feet Ganesh Idol