ఎక్కువ తక్కువలు
ఎక్కువ తక్కువలు
గుణాధికాన్ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్।
మైత్రీం సమానా దన్విచ్ఛేత్ న తాపై రనుభూయతే॥
మనకంటే గుణవంతులైనవారిని చూసి సంతోషించాలి, మనకంటే తక్కువ గుణవంతులని చూసి సానుభూతి చూపాలి. మనతో సమానమైనవారిని చూసి స్నేహం చేయాలి. అప్పుడు ఎలాంటి దుగ్ధా మనల్ని వేధించదు.