Read more!

ఇంద్రకీలాద్రి ఫై దేవీ నవరాత్రులు

 

శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వ హించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. రాష్ట్రం లోని రెండవ అతి పెద్ద ఆలయం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నేటినుంచి ఈ నెల28 వరకు ఈ దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఈ పది రోజులు శ్రీ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలతో దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

స్నపనాభిషేకం అనం తరం ఉదయం 8గంటలకు శ్రీఅమ్మవార్ని భక్తులు దర్శించు కునే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రతి రోజు తెల్లవారుజా మున 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవార్ని భక్తులు దర్శించుకునే సౌకర్యం కల్పించామని దేవస్థానం ఈవో ఇ.గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. 28వ తేది రాత్రి తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ము గుస్తాయి. భవానీ దీక్షలు తీసుకున్న భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత కూడా మరోక మూడు రోజులు పాటు ఉత్సవ ఏర్పాట్లును కొనసా గించాలని అధికారులు నిర్ణయించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 15లక్షల మంది భక్తులు శ్రీ అమ్మవార్ని దర్శించుకోవడానికి వస్తారని అధికా రులు అంచనాలు వేస్తున్నారు. రూ.2కోట్ల వ్యయంతో భక్తు లకు కావాల్సిన సౌకర్యాలను అధికారులు కల్పించారు. ప్రస్తు తం దేవస్థానంలో ఉన్న 600మంది సిబ్బందికి అదనంగా ఇతర దేవస్థానాల నుంచి సుమారు 200 మంది సిబ్బందిని రప్పించి భక్తుల సేవకు ఉపయోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచు కుంటున్నాయి.దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇం ద్రకీలాద్రి విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతోంది. ప్రత్యేకంగా విద్యుత్‌దీపాలను అలంకరించారు. వివిధ దేవతా మూర్తుల కటౌట్లను ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.

కొండదిగువన ఉన్న శృంగేరి పీఠంలో ప్రతి రోజు 5000 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మరోక ప్రదేశంలో కూడా మరోక 1000 మందికి అన్నదానం చేసే ఏర్పాట్లుచేయమని జిల్లామంత్రికె.పి.సారథి అధికారు లను ఆదేశించడంతో ఆదిశగా ప్రయత్నాలు జరుగుతు న్నాయి. కొండదిగువనే ఉన్న కనకదుర్గా నగర్‌లో భక్తులకు కావాల్సిన లడ్డూ,పులిహోర ప్రసాదాలను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకు ప్రవేటు వాహనాలను కొండపైకి అనుమతించరు. అయితే వృద్ధులు, వికలాంగులు, వి.వి.ఐ.పి.లు వెళ్లేందుకు 17వ్యాన్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కృష్ణానది ఓడ్డున నాలుగు స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. అక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించారు.

మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు నదిలోకి దిగలేకపోయే అవకాశం ఉన్నందున వారికోసం ప్రత్యేకంగా షవర్స్‌(జల్లుస్నాన ఘట్టాలు) ఏర్పాటు చేశారు. ఒకేసారి 150 మంది భక్తులు స్నానం చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు 1.5లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారని అధికా రులు అంచనాలు వేస్తున్నారు. నాలుగు స్నానఘట్టాలలోనూ మూడు షిప్టులుగా సుమారు 600 మంది క్షురకుల్ని నియమించి కేశఖండన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీఅమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల్ని రంజింప చేసేందుకు తుమ్మపలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 25న అమ్మవారి జన్మనక్షత్రం మూల.

ఆరోజున ప్రభుత్వం తరుఫున దేవాదాయశాఖమంత్రి శ్రీఅమ్మవారికి పట్టుచీర, పసుపు,కుంకుమ, పూలు సమర్పించడం ఆనవా యితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా దేవాదాయశాఖమంత్రి గాదెవెంకటరెడ్డి శ్రీఅమ్మవారికి వట్టు వస్త్రాలను సమర్పి స్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 26న సాయంత్రం 4గంటలకు ఇంద్రకీలాద్రి పై ఉన్న భవానీ దీక్షా మండపంలో వేదవిద్వత్‌ సభ జరుగుతోంది.రాష్ట్ర దేవాదా యశాఖ కార్యదర్శి కె.వి.రమణాచారి, కమిషనర్‌ పి.సుందర్‌ కుమార్‌ ఈ కార్యక్రమాలకు హజరుకానున్నారు. 28న సాయంత్రం కృష్ణానదిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీ అమ్మవారు నదీవిహారం చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంపై శ్రీఅమ్మవారు నదీ విహారం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. తెప్పోత్సవంగా పిలిచే ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షిస్తారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చకచకసాగిపోతున్నాయి.