Miracles with Yoga
యోగ సాధనతో అద్భుతాలు
Miracles with Yoga
యోగ సాధనను మించింది లేదు. మన మనసుమీద మనకు నియంత్రణ సాధ్యమైతే ఇక లోకాన్నే జయించవచ్చు. ఇది అబద్ధం కాదు, అతిశయోక్తి కాదు. అసాధ్యం అసలే కాదు. మనసు చాలా చంచలమైంది. అది ఒక్క క్షణం కూడ ఎక్కడా స్థిరంగా ఉండదు. ఉంది అనుకుంటే పొరపాటు లేదా భ్రమ. అది నిరంతరం భూమ్యాకాశాల మధ్య పల్టీలు కొడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడితే దిగ్దిగంతాలు పయనిస్తుంది. కాసేపు గతంలో షికార్లు కొడితే, ఇంకాసేపు భవిష్యత్తులో విహరిస్తుంది. వర్తమానం పెద్దగా ఉండదు. లేనిదే రోజు మొత్తంలో ఇన్ని పనులు ఎలా చక్కబెడుతున్నాం అనుకోవచ్చు. పనులదేముంది... యాంత్రికంగా, మొక్కుబడిగా చేసేస్తుంటాం. నిజంగా మనసు లగ్నం చేసి చేస్తే మనమంతా మామూలుగా ఉండం. మహాద్భుతాలు సాధిస్తాం.
మనసు మీద గనుక పట్టు సాధిస్తే మనం దేన్నయినా నియంత్రించగలం. గుర్రపు కళ్ళెం చేతిలో ఉన్నట్లు మన మనసు కళ్ళేన్ని చేతపట్టుకుంటే ఆఖరికి శరీర ఉష్ణోగ్రతను కూడా అదుపులో పెట్టొచ్చని సాధుసన్యాసులు నిరూపించారు.
ప్రతి జీవి శరీరంలో ఉష్ణోగ్రత ఉంటుంది. మనిషి సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. వాతావరణంలో మార్పుచేర్పులు, శారీరక ఆరోగ్య స్థితిని అనుసరించి body temperatureలో తేడాలు ఉండొచ్చు. జ్వరం సోకినప్పుడు శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల వరకూ పెరుగుతుంది. అంతకు మించి టెంపరేచర్ పెరిగితే ప్రమాదం. వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. ఒక్కోసారి రక్తపోటు మొదలైన కారణాలతో నార్మల్ టెంపరేచర్ పడిపోయి శరీరం బాగా చల్లబడుతుంది. ఇది కూడా ప్రమాదమే. వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సంగతులు అలా ఉంచితే యోగ ప్రక్రియతో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవచ్చు.
బౌద్ధ సన్యాసులు యోగ ప్రక్రియతో తమ శరీర ఉష్ణోగ్రతను పెంచగల్గుతారు. ఇంకా చిత్రం ఏమిటంటే శరీరం మొత్తం వెచ్చబడేలానూ చేయగలరు. కాదంటే శరీరంలో ఫలానా భాగంలో ఉష్ణోగ్రత పెరిగేలానూ చేయగలరు. ఈ యోగ ప్రక్రియను ''టమో యోగం'' అంటారు. ఇది కేవలం నమ్మకం కాదు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఇందులో నిజం ఉందని ఒప్పుకున్నారు.
ఫలానా పని చేయాలి అంటే చేస్తాం. చేయకూడదు అనుకుంటే దాని జోలికి వెళ్ళం. ఇది స్థిరచిత్తం ఉన్నవారికి సాధ్యం. కానీ మనసునే కాకుండా శరీరాన్ని కూడా మన అదుపులో ఉంచుకోవడం సాధ్యమా? అందునా శరీర ఉష్ణోగ్రతను హెచ్చించడం ఎలా వీలవుతుంది అనిపించడం సహజం. చాలామందికి నమ్మశక్యంగా ఉండదు. కానీ కొందరు బౌద్ధ సన్యాసులు ''టమో యోగం'' ద్వారా ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను హెచ్చు చేసి చూపించారు శరీర రక్త నాళాలను గరిష్ఠ పరిమితికి వ్యాపింపచేయడం ద్వారా ఉష్ణోగ్రతను పెంచినట్లు బోధపడింది.
సంకల్పబలం గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించుకుంటాం. అది నిజంగా అత్యద్భుతం. దేన్నయినా మనసా వాచా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఆ సంకల్పం చాలాచాలా స్థిరంగా ఉండాలి. అందులో గనుక సందేహాలు, భయాలూ లేకపోతే దేన్నయినా సాధించవచ్చు. దాన్నే రుజువు చేశారు బౌద్ధ సన్యాసులు. శరీరం మనసు చెప్పినట్లే వింటుందని, పైకి కనిపించే, కనపడని అంశాలు ఎవైనా మన అదుపులోనే ఉంటాయని మహర్షులు ఎన్నోసార్లు నిరూపించారు. కనుక స్థిరమైన మనసు ఉంటే కోరికలను అదుపులో ఉంచుకోవడమే కాదు దేన్నయినా నియంత్రించవచ్చు అని రుజువౌతోంది.
బౌద్ధ సన్యాసులు శరీర ఉష్ణోగ్రతను పెంచి చూపే పరీక్ష ఎక్కడ, ఎలా జరిగిందో తెలుసా...
శరీరాన్ని గడ్డ కట్టించే హిమాలయ పర్వతాల్లో రాత్రిపూట తడి వస్త్రాలు ధరించి కూర్చున్న బౌద్ధ సన్యాసులు ఉదయంలోగా ఆ వస్త్రాలు పొడిగా అయ్యేలా చేయాలి. యోగశక్తి ఎంత శక్తివంతమైనదో, మహోన్నతమైందో లోకానికి తెలియజెప్పడం కోసం సాధకులు ఆ పరీక్షకు సిద్ధమయ్యారు. విజేతలు అనిపించుకున్నారు.
బౌద్ధ సన్యాసులు ''టమో యోగం'' (Tamo Yoga)చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిన కొద్దిసేపటికే వారి చేతివేళ్ళ టెంపరేచర్ సాధారణం కంటే 15 డిగ్రీలు పెరిగింది. అలాగే ఆ మంచు కొండల్లో వేసుకున్న తడిబత్తలను ఉదయానికల్లా పొడివారేలా చేసిచూపారు.
యోగశక్తి మహిమ అది. వైద్యులు తగ్గించలేని జబ్బులను కూడా యోగసాధనతో నయమౌతాయి.
indian yogic power, yogic powers, yogic powers real, yoga sutra, hindu yogic practices, temperature controlling