మానవ ప్రయత్నం

 

మానవ ప్రయత్నం

 

 

పతతి కదాచిన్నభసః ఖాతే పాతాళతోపి జలమేతి।

దైవమచింత్యం బలవత్‌ బలవాన్న తు పురుషకారోపి॥

వానల కోసం దైవాన్ని ప్రార్థిస్తే, ఆయన అనుగ్రహిస్తే.... వర్షాలు కురుస్తాయి. కానీ అదే నీటి కోసం మానవుడు భూమిని తవ్వడం మొదలుపెడితే, పాతాళంలో నుంచి జల ఉరకలు వేసుకుంటూ వస్తుంది. దైవబల ఎంత ముఖ్యమో, మానవ ప్రయత్నమూ అంతే ముఖ్యం. అది కూడా సత్ఫలితాలను ఇచ్చేదే!